»Senior Leader D Srinivas Unwell Admitted To Hospital
D Srinivas unwell:డీ శ్రీనివాస్‌కు అస్వస్థత.. పరిస్థితి విషమం: అర్వింద్ ట్వీట్
D Srinivas unwell:సీనియర్ నేత డీ శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బంజారాహిల్స్‌లో గల సిటీ న్యూరో ఆస్పత్రిలో చేర్పించారు. ఆయనకు వైద్యులు ఆధునాతన ట్రీట్ మెంట్ అందిస్తున్నారు.
senior leader D Srinivas unwell, admitted to hospital
D Srinivas unwell:సీనియర్ నేత డీ శ్రీనివాస్ (D Srinivas) అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను బంజారాహిల్స్‌లో గల సిటీ న్యూరో (city neuro) ఆస్పత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
డీఎస్ పొలిటికల్ కెరీర్ కాంగ్రెస్ పార్టీ (congress) నుంచి సాగింది. ఇక్కడే ఉన్నత పదవులను చేపట్టారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ చీఫ్‌గా (pcc chief) కూడా పనిచేశారు. అయితే తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. శీనన్న వెల్కం.. తమ్ముడిలా స్వాగతం పలుకున్నా అని కేసీఆర్ (kcr) పార్టీలోకి ఆహ్వానించారు. తర్వాత ఆయనను రాజ్యసభకు (rajya sabha) కూడా పంపించారు. కానీ టీఆర్ఎస్ పార్టీలో (trs party) ఇమడలేకపోయారు. రాజ్యసభ పదవీ కాలం ముగిసే వరకు కూడా ఆ పార్టీలో ఉన్నా.. దూరం దూరంగానే ఉన్నారు. స్థానిక నిజామాబాద్ నేతలు డీఎస్‌పై (ds) ధిక్కార స్వరం వినిపించారు. గులాబీ దళపతి కేసీఆర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అయినప్పటికీ డీఎస్‌పై కేసీఆర్ చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో లేరు.
డీఎస్‌కు ఇద్దరు కుమారులు.. ఒకరు సంజయ్ (sanjay) కాగా, ఆయన నిజామాబాద్ వరకే పరిమితం అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేశారు. మరో కుమారుడు ధర్మపురి అర్వింద్ (arvind).. బీజేపీలో చేరారు. నిజామాబాద్ లోక్ సభ నుంచి పోటీ చేసి.. కల్వకుంట్ల కవితను (kavitha) ఓడించాడు. సీఎం కేసీఆర్ (cm kcr), మంత్రి కేటీఆర్ (ktr) లక్ష్యంగా విమర్శలు చేస్తుంటారు. అర్వింద్ బీజేపీలోకి వచ్చిన సమయంలోనే.. డీఎస్‌కు ఇబ్బందులు వచ్చాయి. అటు టీఆర్ఎస్ నుంచి ప్రెషర్ చేయడం.. ఇటు బీజేపీలో చేరలేని పరిస్థితి. అందుకే ప్రత్యక్ష రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వచ్చారు.
డీఎస్ అస్వస్థత గురించి ఆయన కుమారుడు ధర్మపురి అర్వింద్ స్పందించారు. తన తండ్రి ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని పేర్కొన్నారు. ఈ రోజు, రేపు తన అధికారిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నానని వెల్లడించారు. కార్యకర్తలను ఉద్దేశించి ట్వీట్ చేశారు. డీ.శ్రీనివాస్‌కు అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో కుటుంబసభ్యులు ఆయనను సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు ఆయనకు వివిధ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
మా నాన్న డి. శ్రీనివాస్ గారు తీవ్ర అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.
కాబట్టి ఈ రోజు, రేపు (27,28) రెండు రోజుల పాటు నా కార్యక్రమాలన్ని రద్దు చేసుకుంటున్నాను. pic.twitter.com/Z043QOGu9f