దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోగ్రూప్ -డి (లెవల్ -1) ఉద్యోగాలకు సంబంధించి తుది ఫలితాలు రిలీజ్ చేసింది. ఈ మేరుకు రైల్వేరిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్సీ), సికింద్రాబాద్ (Secunderabad) అధికారిక ప్రకటన విడుదలయ్యాయి. లెెవెల్-1 ఖాలీల భర్తీకి సంబంధించి గత సంవత్సరం ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT EXAMS) నిర్వహించారు. ఈ ఏడాది జనవరి లో ఫిజికల్ టెస్ట్ (Physical test) చేశారు.
దక్షిణ మధ్య రైల్వే (SCR) పరిధిలోగ్రూప్ -డి (లెవల్ -1) ఉద్యోగాలకు సంబంధించి తుది ఫలితాలు రిలీజ్ చేసింది. ఈ మేరుకు రైల్వేరిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్ఆర్సీ), సికింద్రాబాద్ (Secunderabad) అధికారిక ప్రకటన విడుదలయ్యాయి. లెెవెల్-1 ఖాలీల భర్తీకి సంబంధించి గత సంవత్సరం ఆగస్టు, అక్టోబర్ నెలల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT EXAMS) నిర్వహించారు. ఈ ఏడాది జనవరి లో ఫిజికల్ టెస్ట్ (Physical test) చేశారు. ఫిబ్రవరిలో సర్టిఫికేట్లు వేరిఫికేషన్(Verification of Certificates) మెడికల్ టెస్ట్ నిర్వహించారు. ఈ మూడు దశల్లో ఉత్తీర్ణులైన 7,869 మంది అభ్యర్థుల వివరాలను వెబ్సైట్లో పొందుపరిచింది.
ఇందులో స్టోర్, డీజిల్, ఎలక్ట్రికల్, వర్క్‌షాప్ తదితర విభాగాల్లో .. అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో పైలట్,(Assistant Loco Pilot) అసిస్టెంట్ వర్క్స్, పాయింట్స్‌మెన్ తదితర పోస్టులున్నాయి. ఆర్ఆర్సి (RRC) ప్రిన్సిపల్ చీఫ్ పర్సనల్ కార్యాలయం ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు అందనున్నాయి. సికింద్రాబాద్ జోన్లో 24,596 మంది పీఈటీ పరీక్షలకు ఎంపికయ్యారు. పీఈటీ నుంచి దివ్యాంగులకు మినహాయింపు నేపథ్యంలో వారి ఫలితాలను వెల్లడించలేదు. తాజాగా అందరినీ పరిగణనలోకి తీసుకొని తుది ఫలితాలను విడుదల చేశారు. ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ వేతనం నెలకు రూ.18,000 జీతం (7వ పే సీపీసీ పే మ్యాట్రిక్స్ ప్రకారం).