తెలంగాణలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబందించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 27 నుంచి ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతులకు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇదంతా పూర్తిగా ఆన్ లైన్ లోనే ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ నెల 28వ తేదీ నుంచి 30 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. మార్చి 4వ తేదీ నాటికి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ముగియనుంది. ఉపాధ్యాయులు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ మొత్తం 37 రోజుల్లో ముగియనుంది. మార్చి 5 నుంచి 19వ తేదీ వరకు అప్పీళ్లకు అవకాశం కల్పించనున్నారు. టీచర్ల నుంచి దరఖాస్తులు అందిన 15 రోజుల్లో అప్పీళ్లను పరిష్కరించనున్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలపై ఈ నెల 15న ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీల సమక్షంలో మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి సమగ్రంగా చర్చించారు.