Kodangalలో బీజేపీ అభ్యర్థిగా చీకోటి..? రేవంత్‌కు గట్టి పోటీ ఇచ్చేనా..?
కొడంగల్ బీజేపీ అభ్యర్థిగా క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ కుమార్‌ను బరిలోకి దింపాలని బీజేపీ అనుకుంటోంది. రేవంత్ రెడ్డికి గట్టి పోటీ ఇచ్చే అభ్యర్థి అతనే అవుతాడని భావిస్తోంది.
Chikoti Praveen Kumar: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం పీక్‌కి చేరింది. విమర్శలు- ప్రతి విమర్శలతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రముఖులు పోటీ చేసే నియోజకవర్గాల్లో అభ్యర్థులు కొలిక్కి వస్తున్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అడ్డా కొడంగల్.. గత ఎన్నికల్లో ఇక్కడినుంచి పోటీ చేసి ఓడిపోయారు. కానీ అంతకుముందు ఇక్కడినుంచి పోటీ చేసి వరసగా గెలుపొందారు.
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయనే బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి రేవంత్ పోటీలో ఉన్నారు. ఇక మిగిలింది బీజేపీ.. ఆర్థికంగా గట్టిగా ఉన్న చీకోటి ప్రవీణ్ కుమార్‌ను (Chikoti Praveen Kumar) బరిలోకి దింపాలని అనుకుంటోంది. 35 మందితో మూడో జాబితాను ఈ రోజు విడుదల చేసింది. అందులో కొడంగల్ నియోజకవర్గం పేరు లేదు.. కానీ అతనికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది.
చీకోటి ప్రవీణ్ (Chikoti Praveen Kumar) ఆర్థికంగా బలవంతుడు.. ఎన్నికల్లో గెలిచేందుకు ఎంత ఖర్చు చేసేందుకైనా వెనకాడరు. సో.. రేవంత్‌ను ఓడించడమే టార్గెట్ పెట్టుకున్నారు. లేదంటే మెజార్టీ తగ్గించే పనిలో ఉన్నారు. చీకోటిపై వచ్చిన ఆరోపణలు.. గ్యాంబ్లింగ్, క్యాసినో నిర్వహించడం లాంటి వల్ల చెడ్డ పేరు ఉంది. పాజిటివ్‌తోపాటు నెగిటివ్ కూడా ఉంది. మరీ కొడంగల్ బీజేపీ టికెట్ ఖరారు చేస్తే.. ఏం జరుగుతుందో చూడాలి. ఆ నియోజకవర్గ ప్రజలను చీకోటి ఆకట్టుకుంటారా.? లేదంటే గ్యాంబ్లింగ్ వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుందో చూడాలి.