ఔటర్ రింగ్ రోడ్డును ముంబైకి చెందిన ఐఆర్బీ సంస్థకు కేటీఆర్(KTR) అమ్మారని, ప్రైవేటు కంపెనీలకు మరికొన్ని అప్పగించారని రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్(ORR) టెండర్ల ప్రక్రియ మొదలు బిడ్ ఖరారు వరకూ కూడా అన్నీ అక్రమాలే జరిగాయన్నారు.
కేసీఆర్(Kcr), కేటీఆర్(Ktr)లు అవినీతిపరులని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆరోపించారు. 111 జీవో ఎత్తివేత వెనక ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు. 111 జీవో పరిధిలోనే కేసీఆర్ కుటుంబీకులు భూములు కొన్నారని, వాటిని కొనుగోలు చేశాక ఇప్పుడు జీవోను ఎత్తివేసినట్లు విమర్శించారు. జీవో ఎత్తివేతకు సంబంధించి తాము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తామని వెల్లడించారు. 2019 తర్వాత 111 జీవో పరిధిలో భూముల క్రయ, విక్రయాల వివరాలను బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఔటర్ రింగ్ రోడ్డును ముంబైకి చెందిన ఐఆర్బీ సంస్థకు కేటీఆర్(KTR) అమ్మారని, ప్రైవేటు కంపెనీలకు మరికొన్ని అప్పగించారని రేవంత్ రెడ్డి(Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఓఆర్ఆర్(IRR) టెండర్ల ప్రక్రియ మొదలు బిడ్ ఖరారు వరకూ కూడా అన్నీ అక్రమాలే జరిగాయన్నారు. టెండర్ సాధించాక అగ్రిమెంట్ ప్రకారం 30 రోజుల్లో 10 శాతం చెల్లించాల్సి ఉంటుందని, మరో నెల రోజుల్లో రూ.738 కోట్లను ఐఆర్బీ సంస్థ హెచ్ఎండీఏ(HMDA)కు అప్పటించాలని తెలిపారు.
మే 26వ తేదిలోపు ఐఆర్బీ(IRB) సంస్థ 10 శాతం హెచ్ఎండీఏకు చెల్లించకపోతే టెండర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎస్ సోమేశ్ కుమార్, HDA కమిషనర్ అరవింద్ కుమార్ ఈ తతంగమంతా నడిపిస్తున్నారని, వారి వెనక కేసీఆర్(KCR), కేటీఆర్ (KTR)లు ఉన్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో బీజేపీ(BJP) నేతలు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. తాము అడిగిన సమాచారం ఇవ్వకుంటే HMDAను ముట్టడించనున్నట్లు అధికారులను రేవంత్ రెడ్డి(Revanth Reddy) హెచ్చరించారు.