»Ponguleti Srinivas Reddy Said Will Implement 6 Guarantees Even If There Are Financial Difficulties In Telangana
Ponguleti Srinivas reddy: ఆర్థిక ఇబ్బందులున్నా కూడా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీల అమలు గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అంతేకాదు తెలంగాణలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా వాటిని అమలు చేస్తామన్నారు.
Ponguleti Srinivas reddy said will implement 6 guarantees even if there are financial difficulties in telangana
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో మరో రెండింటిని వచ్చే సంక్రాంతి పండుగ నాటికి అమలు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivas reddy) చెప్పారు. ఖమ్మం జిల్లా కలెక్టరేట్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో భాగంగా ఈ మేరకు పేర్కొన్నారు. ఆ క్రమంలో మీడియాతో మాట్లాడిన మంత్రి రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఆరు గ్యారెంటీల అమలుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈనెల 28న మరో రెండో గ్యారెంటీలు అమల గురించి ప్రకటిస్తామని అన్నారు.
అంతేకాదు తమది కక్ష సాధింపు ప్రభుత్వం కాదని గుర్తు చేశారు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండబోవని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని, బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని గుర్తు చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి డిసెంబర్ 20న శ్వేత పత్రం విడుదల చేస్తామని అన్నారు. అంతేకాదు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్(BRS) చేసిన అవినీతిని కూడా బట్టబయలు చేస్తామని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.