Pongulati Srinivas Reddy : సస్పెన్షన్ పై పొంగులేటి రియాక్షన్ ఇదే..!
pongulati Srinivas Reddy : బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది .. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు , మాజీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే .. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వీరు ఇద్దరు వివాదస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే .. అయితే దానిపై పొంగులేటి మాట్లాడుతూ ..
గత కొంతకాలంగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులు.. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు. సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో… వారిని తాజాగా బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. కాగా… సస్పెన్షన్ పై పొంగులేటి స్పందించారు.
ఇన్ని రోజులకు తనకు బిఆర్ఎస్ నుంచి విముక్తి లభించిందని చెప్పారు. బిఆర్ఎస్ నుంచి తనను ఇప్పటికైనా సస్పెండ్ చేయడం సంతోషకరమని అన్నారు. దొరల గడీ నుంచి తనకు విముక్తి లభించినందుకు ఆనందంగా ఉందని చెప్పారు. జూపల్లి సైతం ఇదేవిధంగా స్పందించడం గమనార్హం.
నిన్న కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో తన మద్దతుదారులతో పొంగులేటి ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జూపల్లి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరు ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై బహిష్కరణ వేటు పడింది. చాలా కాలంగా వీరిద్దరూ బిఆర్ఎస్ అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే.