KTR : ఎన్నికల ఎఫెక్ట్.. కేటీఆర్ కాన్వాయ్‌ని తనిఖీ చేసిన పోలీసులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో నాయకులంతా తీరిక లేకుండా ప్రచారంలో మునిగిపోయారు. ఈ నెల కష్టపడితే మరో ఐదేళ్లు సుఖ పడొచ్చని..
KTR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరో రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో నాయకులంతా తీరిక లేకుండా ప్రచారంలో మునిగిపోయారు. ఈ నెల కష్టపడితే మరో ఐదేళ్లు సుఖ పడొచ్చని.. ఆరోగ్యాలు బాగోలేకపోయిన ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే జాతీయ స్థాయి నేతలంతా ప్రచారం నిమిత్తం తెలంగాణలో వాలిపోయారు. సీఎం కేసీఆర్ కూడా రోజుకు మూడు నియోజకవర్గాలకు తగ్గకుండా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ఇటు మంత్రి కేటీఆర్ కూడా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ (Minister KTR) కాన్వాయ్‌ని పోలీసులు బుధవారం మరో సారి తనిఖీ చేశారు.
ఎన్నికల ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ క్రమంలో జిల్లాలోని రుద్రంగి చెక్ పోస్టు వద్ద మంత్రి వాహనాన్ని ఎన్నికల విధి నిర్వహణలో భాగంగా పోలీసులు తనిఖీ చేశారు. మొన్న మంత్రి కేటీఆర్ కామారెడ్డికి వెళ్లగా.. అధికారులు ఆయన కాన్వాయ్‌ని తనిఖీ చేశారు. అయితే ఇవాళ మరోసారి కేటీఆర్ కాన్వాయ్‌ని తనిఖీ చేశారు. మంత్రి కేటీఆర్ కూడా ఎన్నికల నియమావళిని పాటిస్తూ పోలీసులకు పూర్తిగా సహకరించారు. మంత్రి కేటీఆర్ వాహనాన్ని, ఆయన వెంట వస్తున్న ఇతర వాహనాలను కూడా పోలీసులు తనిఖీ చేశారు. ఈ పరిశీలన అనంతరం మంత్రి కేటీఆర్ వేములవాడ రోడ్ షోకు వెళ్లారు. తనిఖీకి సహకరించిన మంత్రికి పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.