• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

పనుల జాతర-2025లో పాల్గొన్న ఎమ్మెల్యే

KNR: రామడుగు మండలం వెలిచాల, దేశరాజ్ పల్లె గ్రామాల్లో శుక్రవారం పనుల జాతర-2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పలు అభివృద్ధి పనులకు సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీతో కలిసి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు నిర్వహించారు.

August 22, 2025 / 07:22 PM IST

సబ్ కలెక్టర్‌ను కలిసిన టీఎన్జీవో కార్యవర్గం

NZB: ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాళవీయను టీఎన్జీవో ఆర్మూర్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం యూనిట్ ఉద్యోగుల సమస్యలపై సబ్ కలెక్టర్‌తో చర్చించారు. సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారని వారు తెలిపారు.

August 22, 2025 / 07:22 PM IST

అభివృద్ధి పనుల ప్రారంభించిన MLA

JN: అభివృద్ధియే ధ్యేయంగా పనిచేస్తామని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆమె పాలకుర్తి మండలం ముత్తారం గ్రామంలో రూ.20లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం రూ.2.80 కోట్లతో నిర్మించిన నూతన వంతెనను కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

August 22, 2025 / 07:22 PM IST

సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన మాజీమంత్రి

MBNR: జడ్చర్లలో ప్రసిద్ధి చెందిన పురాతన ఆలయం రంగనాయకస్వామి గుట్టపై అవంతిక-2 సినిమా షూటింగు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీమంత్రి లక్ష్మారెడ్డి హాజరై క్లాప్ కొట్టి షూటింగ్ ప్రారంభించారు. అంతకుముందు సినిమా యూనిట్‌తో కలిసి రంగనాయకస్వామి ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. సినిమా మంచి విజయం సాధించాలని మాజీమంత్రి ఆకాంక్షించారు.

August 22, 2025 / 07:22 PM IST

ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలు

NZB: బోధన్ పట్టణంలో ప్రసిద్ధిగాంచిన పెద్ద హనుమాన్ మందిరంలో శుక్రవారం ఘనంగా ఎడ్ల పొలాల అమావాస్య వేడుకలు నిర్వహించారు. బోధన్ పట్టణానికి చెందిన అజయ్ వడియార్ ఇంటి నుండి ఎడ్లను అలంకరించి తీసుకోని వచ్చి ఆలయంలో మొదట పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ తిప్పడం జరిగిందని అర్చకులు ప్రవీణ్ శర్మ తెలిపారు. ఇట్టి పూజ కార్యక్రమంలో ఈవో రాములు, ఛైర్మన్ శంకర్ పాల్గొన్నారు.

August 22, 2025 / 07:21 PM IST

ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి

SDPT: పనుల జాతర -2025 కార్యక్రమంలో భాగంగా హుస్నాబాద్ మండలంలోని మీర్జాపుర్ గ్రామంలో రూ. 2 కోట్లతో నిర్మించిన నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆరోగ్య కేంద్రం లోపల కలియతిరిగారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లు, సిబ్బందికి తెలిపారు.

August 22, 2025 / 07:19 PM IST

‘వంట గదిని పరిశుభ్రంగా ఉంచాలి’

VKB: వసతి గృహాల్లో పరిసరాలతో పాటు వంట గదులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వికారాబాద్ మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ సూచించారు. ఇవాళ జిల్లా 12వ వార్డులోని సోషల్ వెల్ఫేర్ వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.

August 22, 2025 / 07:19 PM IST

ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసిన ఎంపీ

JN: వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని శుక్రవారం న్యూఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి–వరంగల్ NH-163 లో పెండింగ్‌లో ఉన్న సర్వీస్ రోడ్ల పనులు పూర్తి చేయాలని కోరుతూ వినతి పత్రం అందించారు. నిడిగొండ, రఘునాథపల్లి, చాగల్, స్టేషన్ ఘనపూర్, చిన్నపెండ్యాల్, కరుణాపురం గ్రామాల వద్ద రోడ్ల లింకులు లేవన్నారు.

August 22, 2025 / 07:14 PM IST

5.40 కిలోల ఎండు గంజాయి స్వాధీనం

SRD: కొండాపూర్ మండలం మల్కాపూర్ శివారులో ఎక్సైజ్ అధికారుల తనిఖీల్లో 5.40 కిలోల ఎండు గంజాయి శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కారులో గంజాయిని తరలిస్తుండగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చిరంజీవిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ శంకర్ తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సై హనుమంతు, అనుదీప్, సతీష్ పాల్గొన్నారు.

August 22, 2025 / 07:14 PM IST

ట్రాక్టర్ ట్రక్కు దొంగ అరెస్ట్: ఎస్సై

KMM: ట్రాక్టర్ ట్రక్కులను చోరీకి పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు చింతకాని SI నాగుల్ మీరా తెలిపారు. SI కథనం ప్రకారం.. నామవరం వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానస్పదంగా ఉన్న నరేంద్ర అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోని విచారించగా ట్రాక్టర్ ట్రక్కులను చోరీ చేస్తున్నట్లు చెప్పడన్నారు. దొంగను కోర్టులో హాజరు పరిచామన్నారు.

August 22, 2025 / 07:09 PM IST

పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

JGL: పనుల జాతర-2025లో భాగంగా శుక్రవారం కొడిమ్యాల మండల చెప్యాల, అప్పారావుపేట గ్రామాలలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం శంకుస్థాపన చేశారు, ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గ్రామాలు అభివృద్ధి పథంలో నడిచినప్పుడే దేశ పురోగతి సాధిస్తుందని పేర్కొన్నారు.

August 22, 2025 / 07:07 PM IST

హాస్టల్ విద్యార్థులకు వైద్య పరీక్షలు

NLG: చిట్యాల మండలం పెద్ద కాపర్తి సంక్షేమ వసతి గృహంలో శుక్రవారం వెలిమినేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి నరసింహ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వివరించారు. వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. సంక్షేమ అధికారి నర్సింగరావు, వైద్య సిబ్బంది, ఏఎన్ఎంలు ఉన్నారు.

August 22, 2025 / 07:03 PM IST

చేగుంటలో ఘనంగా మెగాస్టార్ జన్మదిన వేడుకలు

MDK: చేగుంట మండల కేంద్రంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో రోగులకు, అంగన్వాడి కేంద్రాలలో చిన్నారులకు బ్రెడ్లు, పండ్లు, చాక్లెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్టాలిన్ నర్సింలు, చౌదరి శ్రీకాంత్, మేకల రవి, చాంద్ పాషా, జావీద్, రాజు పాల్గొన్నారు.

August 22, 2025 / 07:03 PM IST

మార్వాడీ గో బ్యాక్.. పోలీస్ భారీ బందోబస్తు

HNK: మార్వాడి గో బ్యాక్ అంటూ వాణిజ్య దుకాణాలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ తన సిబ్బందితో కలిసి తగిన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పట్టణంలో శాంతి భద్రతలు కాపాడుటకు పటిష్టమైన చర్యలు తీసుకోబడినవి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించినట్లు తెలిపారు.

August 22, 2025 / 07:03 PM IST

వార్డ్‌ ఆఫీసర్లతో కేఎంసీ కమిషనర్ సమీక్ష

KMM: KMCలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య ఐదుగురు చొప్పున వార్డ్‌ ఆఫీసర్లతో విడివిడిగా సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణ (గ్రౌండింగ్) పనుల ప్రగతిపై సమీక్ష చేపట్టారు. వార్డ్ వారీగా గ్రౌండింగ్ పనులు ఎంతవరకు పూర్తయ్యాయో, ఇంకా పెండింగ్‌లో ఉన్న పనుల వివరాలు, ఆలస్యానికి గల కారణాలు, ఎదురవుతున్న సమస్యలపై చర్చించారు.

August 22, 2025 / 07:01 PM IST