• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఆ గ్రామంలో తొలి గ్రామసభ.. అభివృద్ధికి సర్పంచ్ హామీ!

నల్గొండ: మర్రిగూడ మండలం ఖుదాబాక్షపల్లిలో సర్పంచ్ పందుల జయలక్ష్మి పాండు అధ్యక్షతన శనివారం మొదటి గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు పలు సమస్యలను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. వార్డు సభ్యులు, ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.

February 21, 2026 / 06:31 PM IST

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

MBNR: మహబూబ్ నగర్ ఎస్సీ స్టడీ సర్కిల్ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త అందించింది. డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు నెలల పాటు గ్రూప్-1,2,3,4, ఆర్ఆర్‌బీ బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వబడుతుందన్నారు. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు ఈనెల 22లోపు ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 21, 2026 / 06:30 PM IST

శామీర్‌పేటలో ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

HYD: శామీర్‌పేటలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి నివాసంపై దాడి ఘటన నేపథ్యంలో పరామర్శించేందుకు బయలుదేరిన ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వ వైఖరిని ఖండించిన ఈటల ప్రజాస్వామ్య విలువలు దెబ్బతింటున్నాయని ఆరోపించారు.

February 21, 2026 / 06:24 PM IST

ఇంటర్ విద్యార్థులకు సువర్ణవకాశం

WNP: ఖిల్లా ఘనపూర్ మండలంలోని గ్రామాల ఇంటర్ సెకండియర్ Mpc, Bipc చదువుతున్న విద్యార్థులకు ఉన్నత చదువుల నిమిత్తం సాయం చేసేందుకు దాతలు ముందుకొచ్చారు. ఖిల్లా సేవా సమితి ద్వారా దాతలు రేపు ఉ.9:30 గంటలకు బాలుర హైస్కూల్లో పరీక్ష రాసి పాసైన విద్యార్థులకు నెలకు రూ.12,500 స్కాలర్‌షిప్‌తో పాటు ఉచిత హాస్టల్ 3 ఏళ్లు సౌకర్యం కల్పించనున్నట్లు నిర్వాహకులు చెప్పారు.

February 21, 2026 / 06:22 PM IST

కులమతాలకు అతీతంగా ప్రజాసేవ

RR: నందిగామ మండలం అప్పారెడ్డి గూడ గ్రామంలో రంజాన్ ఉపవాస దీక్షలు పురస్కరించుకొని గ్రామంలో ఉన్న మసీదుకు కాంగ్రెస్ సీనియర్ నేత మాణిక్యం రూ. 30 వేల నగదును మజీద్ నిర్వాహకులకు అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజా సేవలో భాగంగా తన వంతు సహకారం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజాసేవలో భాగంగా సేవ గుణాన్ని చూపిన మాణిక్యంను నిర్వాహకులు ప్రశంసించారు.

February 21, 2026 / 06:21 PM IST

సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో రూరల్ ఎమ్మెల్యే

NZB: డిచ్‌పల్లిలో శ్రీ సంతు సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని అధికారికంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, సేవాలాల్ మహారాజ్ చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి భోగ్ బండారు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సేవాలాల్ విగ్రహ ఆవిష్కరణకు భూమిపూజ చేశారు.

February 21, 2026 / 06:21 PM IST

నిత్యం రైల్వే గేట్ తిప్పలు

VKB: బషీరాబాద్ మండల కేంద్రంలోని రైల్వే గేటు స్థానిక వాహనదారులకు తీరని సమస్యగా మారింది. ప్రతిరోజూ రైళ్లు రాకపోకలు సాగించే సమయంలో గేటు పడటంతో 15 నుంచి 20 నిమిషాలు నిరీక్షిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఈ రూట్లో నిత్యం ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్, సరుకు రవాణా రైళ్లు వెళ్తుంటాయి. ఎన్నో ఏళ్ల నుంచి ఈ సమస్యతో స్థానిక వాహనదారులు సతమతమవుతున్నారు.

February 21, 2026 / 06:20 PM IST

వేధింపులపై భయపడకుండా ఫిర్యాదు చేయాలి: ఎస్సై స్వాతి

WGL: నర్సంపేట మండలం రాజుపేట జిల్లా పరిషత్ పాఠశాలలో షీ టీమ్స్ ఎస్సై స్వాతి ఆధ్వర్యంలో శనివారం మహిళల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఎదుర్కొనే వేధింపులు, ఫిర్యాదు చేసే విధానం, షీ టీమ్స్ సేవలను ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై వివరించారు. మహిళల రక్షణకు షీ టీమ్స్ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఎస్సై స్వాతి తెలిపారు.

February 21, 2026 / 06:15 PM IST

చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు: SP

KMR: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద పోలీసులను లక్ష్యంగా చేసుకుని కారుతో అతివేగంగా దూసుకెళ్లిన నిందితుడు గిరెడ్డి మహేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాత నేర చరిత్ర కలిగిన ఇతడిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోవద్దని, విద్వేషాలకు తావులేకుండా మత సామరస్యాన్ని కాపాడాలన్నారు.

February 21, 2026 / 06:11 PM IST

క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్

NGKL:  జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో సీఎం కప్ క్రీడలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఘనంగా ప్రారంభించారు. స్వయంగా వాలీబాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహం నింపిన ఆయన, క్రీడల్లో గెలుపోటములు సహజమని పేర్కొన్నారు. ప్రతి క్రీడాకారుడు నిరంతరం నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటేనే క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని కలెక్టర్ ఆకాంక్షించారు.

February 21, 2026 / 06:10 PM IST

‘పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి’

SRPT: పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నూతనంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన ఎర్నేని కుసుమ బాబును సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే పద్మావతి సహకారంతో వైద్యశాలకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

February 21, 2026 / 06:10 PM IST

సొంత ఇంటి కల కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం: ఎమ్మెల్యే

వనపర్తి: నిరుపేదల సొంత ఇంటి కల నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో సాధ్యమవుతుందని వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి తెలిపారు. శనివారం వనపర్తిలోని పలు మండలాల్లో ఆయన పర్యటించి నూతనంగా ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్న లబ్ధిదారుల గృహప్రవేశాలకు హాజరై నూతన వస్త్రాల అందజేశారు. ఎన్నో ఏళ్లుగా సొంత ఇంటి నిర్మాణం కోసం కలలుగన్న కుటుంబాల ఇంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వెలుగు నింపిందన్నారు.

February 21, 2026 / 06:08 PM IST

శాంతియుతంగా పండుగలు జరుపుకుందాం: సీపీ

NZB: రాబోయే ఉగాది, హోలీ, రంజాన్ పండుగలను ప్రజలందరూ సోదరభావంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని పోలీస్ కమిషనర్ పి.సాయిచైతన్య పిలుపునిచ్చారు. శనివారం కమిషనరేట్‌లో నిర్వహించిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా గంగా జమునా తెహజీబ్‌కు ప్రతీక అని కొనియాడారు. రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 21, 2026 / 06:08 PM IST

సంక్షేమ పథకాలు అందేలా కృషి: MLA

ADB: అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా తనవంతుగా కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం బేల మండలంలో నిర్వహించిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.

February 21, 2026 / 06:07 PM IST

పెద్దమ్మ టెంపుల్‌లో జరిగిన చోరి కేసులో నిందితుడు అరెస్ట్

మంచిర్యాల పట్టణం హమాలివాడలోని పెద్దమ్మ టెంపుల్‌లో జరిగిన చోరి కేసులో నిందితుడు గుమ్మడి సారయ్యను పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. SI తిరుపతి వివరాల ప్రకారం. నిందితుడు సారయ్య టెంపుల్‌లో హుండీ పగలగొట్టి రూ. 3,000 దొంగతనం చేయడం జరిగిందన్నారు. విచారణలో నిందితుడు నిజం ఒప్పుకున్నట్టు తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచామన్నారు.

February 21, 2026 / 06:07 PM IST