PDPL: రాష్ట్రస్థాయి పోటీల్లో కమాన్‌పూర్ విద్యార్థిని బంగారు పతకం సాధించింది. హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియంలో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి సీఎం కప్ అథ్లెటిక్స్ పోటీలో కమాన్‌పూర్ మండలానికి చెందిన నల్లవెల్లి ఆనంది 18 ఏళ్ల విభాగం 400 మీటర్ల పరుగులో బంగారు పతకం సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆమెను పలువురు అభినందించారు.
జనగామ జిల్లా ఐదు పైలట్ జిల్లాల్లో ఒకటిగా ఎంపిక కావడం సంతోషకరమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పేర్కొన్నారు. RPRP కింద అమలవుతున్న 46 కేంద్ర ప్రభుత్వ పథకాల సమగ్ర తనిఖీ కోసం ఈ నెల 23న కేంద్ర బృందం జిల్లా పర్యటన జరగనుంది. కలెక్టర్ అధికారులు అన్ని కేంద్ర పథకాల అమలు వివరాలు, లబ్ధిదారుల సమాచారాన్ని సిద్ధం చేయాలని సూచించారు.
KNR: మార్చి 14 నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని కేంద్రాల్లో పూర్తి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లో మొబైల్ ఫోన్లకు అనుమతి లేకుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని, తాగునీరు, విద్యుత్, బెంచీలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
NRML: కుంటాల మండలం ఓలా గ్రామంలో ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమం ఆదివారం ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు విగ్రహ కమిటీ సభ్యులు వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కావున హిందూ బంధువులందరూ అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
MBNR: జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్లో 5 నెలల ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకునే గడువు నేటితో ముగియనున్నట్లు డైరెక్టర్ కాడం శ్రీనివాస్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని డిగ్రీ అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గ్రూప్ 1, 2, 3, 4తో పాటు ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తామన్నట్లు ఆయన వెల్లిడించారు.
KMM: ఖమ్మం జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 206 నుంచి రూ. 230 మధ్య ఉండగా, స్కిన్‌లెస్ చికెన్ కేజీ ధర రూ. 234 నుంచి రూ. 260 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 5 వరకు తగ్గింది. దీంతో చికెన్ షాప్ దగ్గర వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి.
GDWL: కేంద్రంలోని BJP ప్రభుత్వం పార్లమెంటులో ఏకపాత్రాభినయం చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పేర్కొన్నారు. ఆదివారం అలంపూర్ చౌరస్తాలో జరిగిన జిల్లా స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్మిక చట్టాలను కాలరాస్తూ తెచ్చిన లేబర్ కోడ్స్‌కు వ్యతిరేకంగా మార్చి 1 నుంచి నిర్వహించే ప్రచార క్యాంపెయిన్ ఉంటుందన్నారు.
VKB: కొడంగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లుగా కొనసాగుతున్న పరిస్థితిలో నామినేటెడ్ పదవుల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే గురునాథ్ రెడ్డి, మైనార్టీ నేత యూసుఫ్, బొంరాస్ పేట్ రాజేష్ రెడ్డి తదితరులకు పదవులు కేటాయించబడినప్పటికీ, యువజన కాంగ్రెస్ నేత కృష్ణంరాజుకు ఇంకా నియమిత పదవీ కోసం వేచిచూస్తున్నారు.
MHBD: కురవి మండలకేంద్రంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ పార్వతీ రామలింగేశ్వర (శివాలయం) స్వామి ఆలయం వద్ద దోపోత్సవం కార్యక్రమాన్ని ఆదివారం తెల్లవారుజామున ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో వీక్షించారు.
SRCL: గ్రామపంచాయతీ కార్మికులకు రావాల్సిన పెండింగ్ వేతనాలను ప్రభుత్వం చెల్లించాలంటూ ఈ నెల 23న కలెక్టరేట్ ఎదుట కార్మికులతో ధర్నా చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి ప్రకటించారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవనంలో శనివారం సీఐటీయూ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది.
HNK: ఐనవోలు మండలం కేంద్రంలోని ఐనవోలు గ్రామ సర్పంచ్ గడ్డం వంశీ కృష్ణా ఆదివారం గ్రామంలో వచ్చే వేసవి కాలంలో నీటి సమస్యలు రాకుండా చూసే విధంగా వార్డు సభ్యులతో కలిసి గ్రామంలోని నిరూపయోగంగా ఉన్న నీటి ట్యాంక్‌లను పరిశీలించారు. ఈ సందర్భంలో ట్యాంక్‌ల పరిస్థితి, పరికరాలు, అవసరమైతే మరమ్మతులు, శుభ్రత వంటి అంశాలను గమనించారు. సర్పంచ్ వంశీకృష్ణా తెలిపారు.
MDK: చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన తూప్రాన్ మండలం ఇమాంపూర్‌లో చోటుచేసుకుంది. స్థనికుల వివరాలు.. గ్రామానికి చెందిన రైతు అల్లాడి శంకర్ (40) నిన్న సాయంత్రం పొలానికి మందులు చల్లి స్నానం చేసేందుకు చెరువులో దిగి గల్లంతయ్యాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు చెరువు వద్ద గాలించారు. ఆదివారం ఉదయం చెరువులో శవమై తేలాడు. భార్య లావణ్య, ఇద్దరు సంతానం ఉన్నట్లు తెలిపారు.
WGL: జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిన్న సాయంత్రం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. వేసవికాలం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి100, నుంచి 150 లీ, మంచినీరు సరఫరా చేయాలని అధికారులకు ఆదేశించారు.
HYD: సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి ఇంఛార్జ్ సూపరింటెండెంట్‌గా అనస్తీషియా విభాగాధిపతి ప్రొ.ఆవుల మురళీధర్‌ను వైద్య ఉన్నతాధికారులు నియమించారు. సూపరింటెండెంట్ ప్రొ.వాణి విదేశాలకు వెళ్లడంతో ఆమె తిరిగివచ్చే వరకు ఆయన బాధ్యతలు నిర్వహిస్తారు. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్, ఉస్మానియా మెడికల్ కాలేజీలో ఎండీ పూర్తి చేశారు.
WGL: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నేడు నిర్వహించనున్న ఆర్యవైశ్య మహాసభలో పాల్గొనడానికి వరంగల్ నుంచి GT ఎక్స్‌ప్రెస్ రైల్లో ఢిల్లీకి ఆర్యవైశ్య సంఘ నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ఆర్యవైశ్యులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య జిల్లా గౌరవ అధ్యక్షుడు గంద శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ.. ఆర్యవైశ్యుల హక్కులు కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.