• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గంగమ్మ ఆలయ ప్రతిష్టలో పాల్గొన్న మంత్రి

JGL: ధర్మపురి పట్టణంలోని గోదావరి నది ఒడ్డున నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి బోరుబావి, ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు సమకూర్చుతానని ఆయన హామీ ఇచ్చారు.

February 22, 2026 / 11:15 AM IST

లింగేశ్వర స్వామి ఆలయంలో మున్సిపల్ నూతన ఛైర్మన్

KNR: ఆబాది జమ్మికుంట శ్రీ మహాదేవ లింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజల్లో మున్సిపల్ నూతన ఛైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కౌన్సిలర్లు, ఆలయ అర్చకులు ఘనంగా సన్మానం చేశారు. ఆలయ పరిసరాల సమస్యలపై కమిటీ సభ్యులు వినతిపెట్టగా, పరిష్కరిస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు.

February 22, 2026 / 11:15 AM IST

గచ్చిబౌలిలో సైక్లింగ్ ఈవెంట్

HYD: సైక్లింగ్ ఈవెంట్ విజయవంతంగా ముగిసింది. ఆదివారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది సైక్లిస్టులు పాల్గొన్నారు. రాయదుర్గం ట్రాఫిక్ పోలీసులు మార్గమంతా పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఫిట్ నెస్, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఈ ఈవెంట్ సాఫీగా పూర్తయింది.

February 22, 2026 / 11:14 AM IST

​మండేపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

SRCL: తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామ సర్పంచ్ గాధగోని సాగర్ ఆధ్వర్యంలో ఆదివారం రెడ్డి సంఘం భవనంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో అన్ని రకాల కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు సర్పంచ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

February 22, 2026 / 11:14 AM IST

జిల్లాలోని 248 GPలకు నిధులు మంజూరు

BHPL: భూపాలపల్లి జిల్లాలోని 248 గ్రామాలకు ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. గ్రామపంచాయతీ ఎన్నికల అనంతరం తొలిసారిగా రూ.4.65 కోట్లు విడుదల చేసినట్లు DPO శ్రీలత ఇవాళ తెలిపారు. 2011 జనాభా ఆధారంగా ఒక్కో వ్యక్తికి రూ.865 చొప్పున లెక్కించి నేరుగా పంచాయతీ ఖాతాల్లోకి జమ చేశామని DPO వెల్లడించారు.

February 22, 2026 / 11:12 AM IST

టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు

KMR: బిక్కనూరు మండల పరిధిలోగల టోల్ ప్లాజా వద్ద ఆదివారం పోలీసులు ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో పలు వాహనాలను ఆపి తనిఖీలు చేశారు. వాహనదారులు రోడ్డు నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సూచించారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

February 22, 2026 / 11:12 AM IST

రైస్ మిల్‌ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

NLG: మిర్యాలగూడ మండలం ఆలగడపలో నూతనంగా ఏర్పాటు చేసిన RSN రైస్ మిల్‌ను మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు ఇవాళ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ ఆధారంగా ఉన్న మన ప్రాంతంలో రైస్ మిల్లుల స్థాపన రైతులకు ఎంతో ఉపయోగకరమన్నారు. మిల్ యాజమాన్యాన్ని అభినందిస్తూ, వ్యాపారం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

February 22, 2026 / 11:11 AM IST

బరంపూర్ గుట్ట బ్రహ్మోత్సవాలకు వెళ్లొద్దామా..!

ఆదిలాబాద్: తలమడుగు మండలం బరంపూర్ గ్రామం సమీపంలో చుట్టూ అందమైన కొండల మధ్యలో గుట్టపై వెలసిన పురాతన వేంకటేశ్వర స్వామి ఆలయం ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం ఉండడంతో ఈ ఆలయానికి ఆదిలాబాద్ జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి సైతం భక్తులు తరలివస్తున్నారు. కాగా, నేడు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల చివరి రోజు.

February 22, 2026 / 11:10 AM IST

ఆధ్యాత్మికతతో ముందుకు పయనించాలి: MLA

ADB: గ్రామస్తులు కలిసికట్టుగా ఉండి ఆధ్యాత్మికతతో ముందుకు పయనించాలని అభివృద్ధి సాధించాలని MLA అనిల్ జాదవ్ అన్నారు. ఆదివారం బోథ్ మండలంలోని కౌట గ్రామంలో పోచమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు డప్పుల చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, బీఆర్ఎస్ నాయకులు తదితరులున్నారు.

February 22, 2026 / 11:09 AM IST

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు అమ్మవారిని విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. నేడు సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని.. కొబ్బరికాయ కొట్టి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

February 22, 2026 / 11:05 AM IST

ఈ నెల 24న మినీ జాబ్ మేళా

మంచిర్యాల ప్రభుత్వ ITI కళాశాలలో ఈ నెల 24న మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ ఆదివారం ప్రకటనలో తెలిపారు. శృతి గోలిస్ బర్త్ రూట్ ఆస్పత్రిలో డాటా ఎంట్రీ ఆపరేటర్, స్టాఫ్ నర్స్, హౌస్ కీపింగ్, ఫార్మసిస్ట్, సిస్టం ఆపరేటర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అర్హత, ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 22, 2026 / 11:05 AM IST

రహదారి గుంతలమయం.. వాహనదారులకు నరకయాతన

PDPL: రామగుండం కార్పొరేషన్ పరిధి 47వ డివిజన్ మార్కండేయ కాలనీలోని కృష్ణుడి ఆలయం సమీప ప్రధాన రహదారి గుంతలతో దెబ్బతింది. వాహనదారులు తరచుగా వాహన మరమ్మతులతో ఆర్థిక నష్టానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలలుగా మ్యాన్‌హోల్ లీకేజీ కారణంగా మురుగునీరు నిల్వ ఉండటంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

February 22, 2026 / 11:04 AM IST

‘గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలి’

KMM: సత్తుపల్లి పట్టణంలో పాకలగూడెం గ్రామ నూతన సర్పంచ్ సునీత TGIDC ఛైర్మన్ మువ్వా విజయబాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడిన పాలకవర్గం కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి పనులు ప్రతి ఒక్కరికి చేరవేయాలని సర్పంచ్‌కు సూచించారు. గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని తెలిపారు.

February 22, 2026 / 11:02 AM IST

టార్గెట్ ఫిక్స్ అయింది .. ఇక పనుల జాతరే..!

NLG: జిల్లా కేంద్రం ‘వీబీ జీ రామ్ జీ’ పథకంలో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 లక్షల కుటుంబాలకు 125 రోజుల పని దినాలు కల్పించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నల్లగొండ జిల్లాలో 7.44 లక్షల జాబ్ కార్డు ఉండగా ఇందుకోసం రూ.1.16 కోట్ల పని దినాలను అంచనా వేశారు. అవినీతిని అరికట్టేందుకు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు.

February 22, 2026 / 11:02 AM IST

నూతన పాలకవర్గానికి మంత్రి అభినందనలు

RR: చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఆధ్వర్యంలో మొయినాబాద్ మున్సిపాలిటీ నూతన పాలకవర్గం సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. ఇటీవల మోయినాబాద్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకోవడంతో ఎమ్మెల్యే కాలె యాదయ్యకు, నూతన పాలకవర్గానికి మంత్రి అభినందనలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించి మున్సిపాలిటీ అభివృద్ధి దిశగా ముందుకు పోవాలన్నారు.

February 22, 2026 / 11:01 AM IST