• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

కేయూలో శతావధానం ప్రారంభం..

HNK: కాకతీయ యూనివర్సిటీ సెనేట్ హాలులో శతావధానం కార్యక్రమాన్ని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ… శతావధానం కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని, కేయూకు ప్రత్యేక చరిత్ర ఉందని, కేయూ అభివృద్ధికి సహకరిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.

February 22, 2026 / 01:07 PM IST

‘దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుంది’

WGL: భారత ప్రధాని నరేంద్రమోదీ నిర్వహిస్తున్న “మన్ కీ బాత్” 131వ ఎపిసోడ్ కార్యక్రమాన్ని వరంగల్ తూర్పు 28వ డివిజన్ 105 బూత్‌లో కార్యకర్తలతో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ వీక్షించారు. రవికుమార్ మాట్లాడుతూ… ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని, బీజేపీకి ప్రజలు అండగా నిలవాలన్నారు.

February 22, 2026 / 01:05 PM IST

గోకారంలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NGKL: చారకొండ మండలం గోకారం పంచాయతీ ఏడవ వార్డులో సీసీ రోడ్డు పనులను సర్పంచ్ పర్శరాములు ఆదివారం ప్రారంభించారు. గ్రామాభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని, ప్రజల సహకారంతో అన్ని వార్డుల్లో మౌలిక వసతులు కల్పిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి చెన్న కేశవులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:05 PM IST

శ్రీనివాస్‌కు 100 మంది శ్రీనివాసుల సత్కారం

KNR: కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్‌ను తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తరఫున 100 మంది శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. శ్రీనివాసుల పేరుతో వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి 2 సంవత్సరాలలో 30వేల మంది శ్రీనివాసులు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రపంచ రికార్డు నమోదు చేశారు.

February 22, 2026 / 01:05 PM IST

నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మండలం రేపల్లెవాడ గ్రామపంచాయతీలో లబ్ధిదారుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కోరం కనకయ్య పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏప్రిల్ నెలలో మరల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 22, 2026 / 01:04 PM IST

ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రి

JGL: బీర్పూర్ మండలం రంగసాగర్ గ్రామంలోని గొల్ల కేతమ్మ ఆలయంలో ఆదివారం మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఆయనను సత్కరించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

February 22, 2026 / 01:03 PM IST

వీధి కుక్కలకు వైరస్… భయాందోళనలో గ్రామస్తులు..

MLG: ఏటూరునగారం మండల కేంద్రంలో వీధి కుక్కలకు వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కొన్ని వీధులలో వెంట్రుకలు పూర్తిగా ఊడిపోయి, శరీరంపై గాయాలతో తిరుగుతున్న కుక్కలు కనిపించడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. రేబిస్ వంటి ప్రమాదకరమైన వ్యాధి అయితే ప్రజలకు ప్రాణహాని కలగొచ్చని, అధికారులు తక్షణమే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు.

February 22, 2026 / 01:02 PM IST

పదవి అనేది అధికారం కాదు బాధ్యత: మంత్రి

KMM: ఏదులాపురం ఎన్నికల వరకే రాజకీయం గెలిచిన తర్వాత ఏ పార్టీ వారైనా ప్రజా ప్రభుత్వం తరపున పేదవాడికి సేవ చేయాల్సిందేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. పదవి అనేది అధికారం కాదు, బాధ్యత అని గుర్తించాలన్నారు. ఆదివారం పెద్దతండాలోని మున్సిపల్ కార్యాలయంలో నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనిత బాధ్యతల స్వీకరణ మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

February 22, 2026 / 01:01 PM IST

లయన్స్ ఉత్తమ రీజినల్ ఛైర్మన్‌గా డీకే.రాజేష్

NZB: ఆర్మూర్‌కు చెందిన డీకే.రాజేష్ లయన్స్ క్లబ్ ఉత్తమ రీజినల్ ఛైర్మన్ అవార్డును అందుకున్నారు. సికింద్రాబాద్లోని లయన్స్ భవనంలో గవర్నర్ లయన్ నగేష్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డ్స్ నైట్లో ఈ పురస్కారం ప్రదానం చేశారు. 12 క్లబ్ల పరిధిలో సభ్యత్వ నమోదు, విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు ఆయనను అభినందించారు.

February 22, 2026 / 01:00 PM IST

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

SRPT: అనారోగ్యంతో మృతి చెందిన అడిగోడు మండలం సిరిపురం గ్రామానికి చెందిన కాంపాటి సాయిలు కుటుంబానికి ఆయన బాల్య మిత్రులు అండగా నిలిచారు. ఆదివారం సాయిలు భార్య జానమ్మకు మిత్రబృందం రూ.15,000 ఆర్థిక సాయాన్ని అందజేసి, తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భవిష్యత్తులోనూ ఆ కుటుంబానికి తోడుగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.

February 22, 2026 / 12:58 PM IST

బ్రిడ్జి నిర్మాణంతో గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం

BDK: పినపాక పోతిరెడ్డిపల్లి క్రింది గుంపు వాగుపై సుమారు రూ. 65 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి పనులను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదివారం పరిశీలించారు. పనుల పురోగతిని స్వయంగా వీక్షించి, నిర్మాణ నాణ్యతపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే స్థానిక గ్రామాల మధ్య రాకపోకలు సులభతరం అవుతుందని తెలిపారు.

February 22, 2026 / 12:57 PM IST

విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని సాయిబాబా ఆలయం వద్ద నిర్మించిన శ్రీ సంత్ గాడ్గే బాబా మహరాజ్ మూర్తి ఆవిష్కరణ కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరై ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేను సమాజ సభ్యులు శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తిరుమల గౌడ్, రవి నాయక్, మాధవ్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 12:53 PM IST

‘ప్రజలు నచ్చే విధంగా పాలన అందిస్తాం’

RR: స్థానిక సంస్థల ఎన్నికల్లో గిరిజనులు గెలుపొందడం పట్ల సేవాలాల్ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. షాద్‌నగర్ పట్టణంలోని సేవాలాల్ కమిటీ సభ్యులు 6వ వార్డు కౌన్సిలర్ రాజునాయక్, దేవుని బండ తండా సర్పంచ్ శ్రీను నాయక్‌ను కలిసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారికి నచ్చే విధంగా పాలన అందిస్తామన్నారు.

February 22, 2026 / 12:51 PM IST

యావపూర్‌లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం

MDK: తూప్రాన్ మండలం యావపూర్‌లో చేపడుతున్న స్వచ్చ భారత్ కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ స్వచ్ఛ భారత్ పురస్కరించుకుని సర్పంచ్ యంజాల స్వామి పాలకవర్గం ఆధ్వర్యంలో గ్రామంలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగింపజేశారు. అనంతరం వీధులను శుభ్రం చేశారు. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో గ్రామ యువత, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

February 22, 2026 / 12:50 PM IST

జిల్లాలో పత్తి రైతులకు శుభవార్త…!

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (CCI) ఆధ్వర్యంలో జరుగుతున్న పత్తి కొనుగోళ్ల గడువును ఫిబ్రవరి 27 వరకు పొడిగించినట్లు ఆయా జిల్లాల మార్కెట్ ఉన్నత శ్రేణి అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ వద్ద ఉన్న పత్తిని మద్దతు ధరకు అమ్ముకోవాలని సూచించారు.

February 22, 2026 / 12:50 PM IST