PDPL: జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, శివాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం, శివాలయంలో కలశ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ సంపత్, పార్టీ నాయకులు ఎమ్మెల్యేను సత్కరించారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 20వ డివిజన్లోని రాజారెడ్డి కాలనీలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏన్నికైంది. కాలనీ అభివృద్ధి, శుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల, సామాజిక ఐక్యతను లక్ష్యంగా చేసుకొని కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా భాస్కర్, కార్యదర్శిగా విద్యాకర్, కోశాధికారిగా సంతోశ్ ఎన్నికయ్యారు.
SRPT: కోదాడ పట్టణానికి చెందిన చిత్రపు అన్నపూర్ణమ్మ (105) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు ‘శతాధికా సంబరాలు’ నిర్వహించారు. నేటికీ ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అన్నపూర్ణమ్మ తన జీవితకాలంలో ఐదు తరాలను మనుమలు, మునిమనుమలు చూసి ఆశీర్వదించారు. ఆదివారం కోదాడ పట్టణంలో కుటుంబ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు.
BHNG: ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామంలో ఆదివారం శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఉచితంగా జనరల్బి ఫిజీషియన్ డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ రాజ్ కుమార్ చే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, న్యూరోపతి, బిఎండి పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు.
MLG: గోదావరి నది జలాల వినియోగం, వివాదాలపై ప్రతిపక్షాలతో అసెంబ్లీలోనే చర్చించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నిర్వహించిన సమీక్ష సమావేశంలో CM మాట్లాడారు. చర్చలు జరగకుండా ఏ సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదని CM పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి పౌరుడికి త్రాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
JGL: పెన్షనర్ల పెండింగ్ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో ఆదివారం జరిగిన టీపీసీఏ జిల్లా స్థాయి సమావేశంలో పెన్షనర్ల సర్వీస్ రూల్స్ పుస్తకాలను సభ్యులకు అందజేశారు. ఈ సమావేశంలో టీపీసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.
KMR: నాగిరెడ్డిపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకులు పిచ్చయ్యగారి దీపక్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి ఇటీవల పరమపదించారు. ఆదివారం మృతుడు కృష్ణారెడ్డి దశదిశ కర్మ వేడుకలు నిర్వహించడంతో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కార్యక్రమంలో పాల్గొని చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఆయన ఆత్మ ఎక్కడున్న శాంతించాలని భగవంతుని వేడుకున్నారు.
ASF: కాగజ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూమి విక్రయం పేరుతో రూ. 17 లక్షలు తీసుకుని మోసం చేసిన రామటెంకి ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మాలిని గ్రామంలో 5 ఎకరాల భూమి ఉందని లేని భూమిని ఉన్నట్లు నమ్మించాడు. భూమి చూపించాలని అడిగితే బాధితుడిని బెదిరించడంతో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
MBNR: ప్రతి ఒక్కరూ మాతృభూమికి సేవ చేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాంతి కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జరిగిన శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను గౌరవించాలని, దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
SRCL: వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు పోటెత్తారు. ఆదివారం ఉదయం నుంచి రాత్రి 7:30 గంటల వరకు స్వామివారిని 47,280 ఈవో రమాదేవి తెలిపారు. స్వామివారికి 2906 కోడె మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు.
MDK: టేక్మాల్‌లోని రైతు వేదిక వద్ద ఆదివారం వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో భాగంగా రైతులకు పనిముట్లను పంపిణీ చేశారు. పేట డివిజన్ పరిధిలోని టేక్మాల్, రేగోడ్, అల్లాదుర్గ్ మండలాలకు చెందిన రైతులు ఈ సదుపాయాన్ని పొందారు. అధికారులు మాట్లాడుతూ.. ఆధునిక సాగుకు యంత్రాలు ఎంతో అవసరమని, ఆసక్తి గల రైతులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
MHBD: జిల్లా కేంద్రంలోని పలు మండలాలలో ఇవాళ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో బయ్యారం మండలం బీరోనిమాడువల గ్రామంలో గాలివానతో రైతుల మొక్కజొన్న పంట నేలవాలింది. చేతికొచ్చే దశలో ఉన్న పంట నష్టపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాలు తమను నష్టపరిచాయని, నష్టపోయిన పంటకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందించాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
NRML: వికారాబాద్ అనంతగిరిలో తెలంగాణ, ఏపీ డీసీసీ అధ్యక్షులకు 10 రోజుల శిక్షణ కేంద్రం లో రెండవ రోజు శిక్షణ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. పది రోజుల పాటు జరిగే ఈ శిబిరంలో నాయకత్వ, నైపుణ్యాలు, ప్రజా సమస్యల పరిష్కార విధానాలు, ఎన్నికల వ్యూహాలు, తదితర అంశాలపై చర్చించడం జరుగుతుందన్నారు.
RR: తంగడపల్లి మజీద్ వద్ద ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే కాలే యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మతసామరస్యానికి ప్రతీక అన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని మనుషులంతా సోదర భావంతో ఉండాలన్నారు.
NRKL: కల్వకుర్తి మార్కెట్‌లో వేరుశనగ గరిష్ఠ ధర క్వింటాలుకు రూ.10,399 పలికినట్లు అధికారులు తెలిపారు. ఇతర రకాల ధరలు రూ.10,009, రూ.4,360గా నమోదయ్యాయి. కందులు అన్ని రకాలు రూ.7,309 ధరకు అమ్ముడయ్యాయి. మార్కెట్‌కు మొత్తం 807.90 క్వింటాళ్ల వేరుశనగ వచ్చినట్లు మార్కెటింగ్ శాఖ వెల్లడించింది.