KMR: రేషన్ దుకాణాల ద్వారా రేపట్టి నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు భిక్నూ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. డీలర్లు నిర్ణీత సమయానికి దుకాణాలను తెరిచి ఉంచాలని, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంపిణీ వివరాలను లబ్ధిదారులకు ముందుగానే తెలియజేయాలని కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌ను పీఎంశ్రీ నోడల్ అధికారి ప్రవీర్ కుమార్ జిల్లా సమీకృత సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా విద్యాలయాల్లో పీఎంశ్రీ కింద అమలు అవుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ ప్రవీర్ కుమార్ జిల్లాకు వచ్చారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలో విలియన్స్ హో సంస్కారణార్ధం టైలర్స్ & వర్కర్స్ అసోసియేషన్, మేరు సంఘం ఆధ్వర్యంలో శనివారం టైలర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు కీర్తి రాము మాట్లాడుతూ.. టైలర్స్ డే కుట్టు కళకు గౌరవం తెలిపే రోజు అన్నారు. దర్జీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడకుండా ప్రత్యేక శ్రద్ద వహించి, సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు.
BHPL: చిట్యాల మండలం గిద్దెముత్తారం అందుకుతండా గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్ పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్ మాట్లాడాలంటే ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, టెలికాం సంస్థలు తక్షణమే టవర్లు ఏర్పాటు చేసి నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించాలన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం పీఎం శ్రీ జిల్లాస్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఈఓ భోజన్న ప్రారంబించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటూ క్రీడల్లో రాణించాలని అన్నారు. జిల్లాలోని ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
VKB: మోమిన్‌పేట్ మండలంలో నివాసం ఉండే రహుఫ్ అనే వ్యక్తిపై తన బంధువులు వారసత్వపు భూతగాదాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 3 గంటలకు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో రహుఫ్‌కు బలమైన గాయం తగలడంతో సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటిల్ తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి HYD తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
BDK: భద్రాచలం రామాలయంలో తయారవుతున్న జైశ్రీరామ్ పేరు గల ఇటుకలను ఆదివారం నుంచి విక్రయించనున్నారు. ఇంటి నిర్మాణంలో తొలి ఇటుకగా వాడితే శుభం కలుగుతుంది. ఒక్కో ఇటుక ధర రూ. 60 ఉంటుందని అంచనా. ఇసుక, మట్టి, సిమెంట్ మిశ్రమంతో ఇవి తయారవుతున్నాయి. ఒక్కోటి సుమారు 2 కిలోల బరువు ఉంటుంది. ఈ ఇటుకలను చిత్రకూట మండపం సమీపంలో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.
JGL: రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో కుట్టు మెషీన్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరితో రూ. వెయ్యి వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. ‘ఐ క్యు మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ పేరుతో రశీదులు ఇస్తూ 100 రోజుల్లో మెషీన్ అందజేస్తామని, లేకపోతే డబ్బులు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.
RR: షాద్ నగర్‌లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అర్హులైన లబ్ధిదారులకు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పట్టాలు పంపిణీ చేశారు. తొలివిడతగా లబ్ధిదారులకు 1,200 ఇళ్లను అందజేస్తున్నట్లు ఆయన వివరించారు. 28 వార్డుల్లో ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్టీలకతీతంగా కౌన్సిలర్లు లబ్ధిదారులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలన్నారు.
KMM: మధిర మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు శనివారం వార్డులో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వీధుల వెంబడి పెరిగిన సర్కారు కంప, పిచ్చి మొక్కలు, డ్రైనేజీ మట్టి దిబ్బలు జేసీబీతో గత రెండురోజులుగా తొలగిస్తున్నారు. రజకబజారు వీధిలో రోడ్ పక్కన దట్టంగా పెరిగిన సర్కారు కంప, పిచ్చి మొక్కలను తొలగించి పారిశుద్ధ్యం చేపట్టారు.
KMM: జిల్లాలో 9 నుంచి 14 ఏళ్ల వయస్సు గల బాలికలకు HPV వ్యాక్సినేషన్ చేపట్టేందుకు పటిష్ట కార్యాచరణ చేపట్టామని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. దీని వల్ల మహిళల్లో సర్వైవల్ క్యాన్సర్ రాకుండా చేయవచ్చని తెలిపారు. అటు ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మధ్యాహ్నం భోజన నాణ్యతను జిల్లా అధికారులు పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామన్నారు.
WNP: బీజేపీ పార్టీ ఎంపీ రాష్ట్ర చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్‌ను వారి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా జిల్లా నాయకులు కలిశారు. అనంతరం పార్టీ గురించి పలు విషయాలు చర్చించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కానీ హామీలు ఇచ్చి ప్రజలను ఏ విధంగా మోసం చేసిందో అనే విషయాన్ని ప్రజలకు వివరించాలని తెలిపారు.
SRPT: పాఠశాలల్లో విద్యార్థులకు చదవడం, రాయడం వంటి కనీస సామర్ధ్యాలతోపాటు గణితంలో చతుర్వధ ప్రక్రియపై పట్టు సాధించిన ఉపాధ్యాయులు కృషి చేయాలని కోదాడ మండల విద్యాధికారి సలీం షరీఫ్ సూచించారు. శనివారం కోదాడ పట్టణంలోని శ్రీరామ్ నగర్ ప్రాథమిక పాఠశాలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల పరిసరాలు పరిశీలించారు.
SRD: కంగ్టి మండలం తుర్కవడ్గం పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు విద్యాసామాగ్రిని పంపిణీ చేసినట్లు ప్రధానోపాధ్యాయులు కిషన్ పవార్ తెలిపారు. పాఠశాల, విద్యాభివృద్ధి కోసం దాతలు సహకరించారని చెప్పారు. ఈ సందర్భంగా దాత రేణీ గ్రేస్, సామాజిక సేవ కర్త చంద్రశేఖర ఆచార్యకు పాఠశాల బృందం తరపున HM కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.
GDWL: గట్టు మండల నూతన ఏపీఎంగా మారుతి బాధ్యతలు స్వీకరించారు. మండల సమాఖ్య భవనంలో జరిగిన కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు మహేశ్వరి, సీసీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. మహిళా సంఘాల బలోపేతంతో పాటు ప్రభుత్వ పథకాలు అర్హులందరికీ చేరేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని మారుతి హామీ ఇచ్చారు.