BHNG: భువనగిరి మున్సిపాలిటీ 3వ వార్డు రాయగిరి రామాలయంలో నిర్వహించనున్న శ్రీరామనవమి ఉత్సవాల కోసం అవనగంటి శ్రవణ్ కుమార్ తన వంతు సహాయంగా రూ. 20,000 విరాళం ప్రకటించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం కౌన్సిలర్ పాల్త్య వెంకటేష్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు పల్లెర్ల యాదగిరి, యూత్ సభ్యులు అవిశెట్టి మల్లేష్, దాసరి పండు, బోజ్జ చంద్రయ్య పాల్గొన్నారు.
GDWL: ఉగాది సందర్భంగా గట్టు మండలం మాచర్లలో రైతు సంబరాలు మిన్నంటాయి. ఇందులో భాగంగా నిర్వహించిన రెండు బండ్ల గిరక పోటీలు ఆకట్టుకున్నాయి. విజేతలకు సర్పంచ్ వజ్రమ్మ, ఉప సర్పంచ్ సుదర్శన్ నగదు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను ఆస్వాదించారు.
MBNR: శాసనసభలో ప్రభుత్వ విప్‌గా ఎన్నికైన ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌లను కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శాసనసభలో పార్టీ విధానాలను సమర్ధవంతంగా నిబద్ధతతో పని చేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానన్నారు
SRPT: నడిగూడెం మండలంలో రంజాన్ తోఫా పంపిణీలో అక్రమాలు జరిగాయని ముస్లిం మైనార్టీలు తహసీల్దార్ రామకృష్ణారెడ్డికి శుక్రవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. మండలానికి 75 తోఫాలు కేటాయించగా, కేవలం 11 మాత్రమే వచ్చాయని ఆరోపించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ.. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామని ముస్లిం మైనార్టీల నాయకులకు హామీ ఇచ్చారు.
BDK: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తిరుమలకుంటకు చెందిన దారా శ్రీనివాస్కు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అండగా నిలిచారు. కుటుంబ సమస్యలతో కలుపు మందు తాగి పరిస్థితి విషమించడంతో, బాధితుడిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం నుంచి నిమ్స్‌కు తరలించేలా ఎమ్మెల్యే తక్షణ ఏర్పాట్లు చేశారు. శుక్రవారం నిమ్స్ ఆసుపత్రిని స్వయంగా సందర్శించారు.
ASF: బెజ్జూర్ మండలం నుంచి ఇద్దరు అమ్మాయిలను అక్రమ రవాణా చేసిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్టు చేసినట్లు CI సంతోష్ కుమార్ తెలిపారు. ఈ కేసులో నలుగురు సభ్యులపై కేసు నమోదు చేయగా ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. తెలంగాణకు చెందిన ప్రశాంత్, సవిత, మహారాష్ట్రకు చెందిన మహేశ్‌లను అరెస్టు చేయగా మధ్యప్రదేశ్‌కు చెందిన రాహుల్ త్వరలో అరెస్టు చేస్తామన్నారు.
VKB: ఈ నెల 23 నుంచి 26 వరకు కుల్కచర్ల మండలంలోని గ్రామాల్లో ఉచిత NCD స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో రామకృష్ణ తెలిపారు. వైద్య సిబ్బంది ప్రతి గ్రామానికి వెళ్లి బీపీ, షుగర్, హైపర్‌టెన్షన్, క్యాన్సర్ వంటి వ్యాధులపై పరీక్షలు చేయనున్నారు. గ్రామీణ ప్రజలు ఈ ఉచిత ఆరోగ్య పరీక్షలను సద్వినియోగం చేసుకుని ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
HYD: మాదాపూర్ పోలీసులు అయ్యప్ప సొసైటీ రోడ్డులో చేపట్టిన తనిఖీల్లో హాష్ ఆయిల్ పట్టుబడింది. తనిఖీల్లో పరుసముల దినేష్ (28), కార్ మెకానిక్‌ను అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 184 ప్లాస్టిక్ బాక్సుల్లో గంజాయి నుంచి తయారుచేసే వీడ్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు 920 గ్రాముల విలువ రూ. 4.5 లక్షలు ఉంటుందన్నారు. NDPS చట్టం కింద కేసు నమోదు చేసి 14 రోజుల రిమాండ్ విధించారు.
NZB: నగరంలోని 45వ డివిజన్ దేవి టాకీస్ మార్గంలో శుక్రవారం ప్రమాదవశాత్తు ఓ ఆవు డ్రైనేజీలో పడిపోయింది. విషయం తెలుసుకున్న కార్పొరేటర్ బొబ్బిలి సువర్ణ వేణు వెంటనే అక్కడికి చేరుకున్నారు. ఆమె చొరవతో ఫైర్, మున్సిపల్ సిబ్బంది రంగంలోకి దిగి ఆవును సురక్షితంగా బయటకు తీశారు. సమయానికి స్పందించిన సిబ్బందికి కార్పొరేటర్ కృతజ్ఞతలు తెలిపారు.
RR: బడంగ్‌పేట్ మున్సిపల్ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ళ (L 2) గురించి నిన్న సమావేశం జరిగింది. TUFIDC ఛైర్మన్ రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చల్లా నర్సింహా రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అర్హులందరికీ ఇళ్లులు మంజూరు చేయాలన్నారు. RDO జగదీశ్వర్ రెడ్డి, జల్ పల్లి డిప్యూటీ కమిషనర్ వెంకట్ రామ్, బడంగ్‌పేట్ డిప్యూటీ కమిషనర్ సరస్వతి పాల్గొన్నారు.
KMM: విద్యుత్ క్షేత్రస్థాయి సిబ్బంది ప్రాణరక్షణ కోసం ప్రవేశపెట్టిన ‘ఎల్సీ యాప్’ విప్లవాత్మక మార్పు అని ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి శుక్రవారం కొనియాడారు. దీనివల్ల పొరపాటున తప్పుడు ఫీడర్లను ఎంపిక చేసే అవకాశం ఉండదని, ప్రమాదాలకు తావుండదని పేర్కొన్నారు. లైన్ క్లియర్ (ఎల్సీ) అనుమతులు ఇకపై పూర్తిగా డిజిటల్ పద్ధతిలోనే జారీ అవుతాయన్నారు.
NRML: రంజాన్ పండుగ సందర్భంగా భైంసాలో ఇవాళ భూసార్ బీట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పురియా నాయక్ తెలిపారు. పండుగ సెలవు ముగిసిన అనంతరం మార్చి 23 నుంచి భూసార్ బీట్ యథావిధిగా కొనసాగుతుందని వెల్లడించారు. రైతులు, వ్యాపారులు, కమిషన్ ఏజెంట్లు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
SRCL: రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని చందుర్తి ఎస్సై రమేష్ అన్నారు. మండలంలోని మల్యాల గ్రామంలో శుక్రవారం రాత్రి అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రతి వ్యక్తి సురక్షితంగా తమ గమ్యస్థానం చేరుకోవడమే లక్ష్యంగా గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలన్నారు.
PDPL: అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి కింద ఉన్నత విద్య కోసం ఎస్సీ విద్యార్థులు మార్చి 31లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి రవీందర్ తెలిపారు. 4 సంవత్సరాల డిగ్రీ చదివి గ్రాడ్యుయేషన్‌లో 60% మార్కులు, కుటుంబ ఆదాయం రూ.5 లక్షల లోపు ఉండాలన్నారు. అభ్యర్థులు https://telanganaepass.cgg.gov.in ద్వారాదరఖాస్తు చేసుకోవాలన్నారు.
ADB: జిల్లాలో ప్రజల అవసరాలకు సరిపడినన్ని గ్యాస్ సిలిండర్‌లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. ప్రజలు తమ అవసరాలకు సిలిండర్‌లు బుక్ చేసుకున్న నిర్ణీత గడువులోపు డోర్ డెలివరీ చేయబడతాయని చెప్పారు. గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్దకు వెళ్లాల్సిన పనిలేదని అన్నారు. అసత్య వార్తలను ప్రజలు ఎట్టి పరిస్థితులలో నమ్మరాదని కోరారు.