MBNR: కార్పొరేషన్ పరిధిలోని తొమ్మిదవ డివిజన్ క్రిస్టియన్ పల్లి ఆదర్శనగర్ ప్రాంతాలలో మున్సిపల్ కమిషనర్ రామానుజులు రెడ్డి బుధవారం పర్యటించారు ఈ సందర్భంగా డివిజన్లో నెలకొన్న సమస్యలను గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. శానిటేషన్ పారిశుద్ధ్యం రోడ్లు వీధి బల్బుల విషయంలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు తలెత్తకూడదని సిబ్బందిని ఆదేశించారు.
MDK: ఉపాధి హామీ కూలీలకు బకాయి వేతనాలు చెల్లించాలని, ఫోటో క్యాప్చర్ విధానాన్ని రద్దు చేయాలని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం. అడవయ్య డిమాండ్ చేశారు. బుధవారం మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉపాధి హామీ కేంద్రాన్ని సందర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కూలీల సంఖ్య తగ్గించేందుకు ప్రభుత్వం ఫోటో క్యాప్చర్ విధానం తీసుకువచ్చిందని ఆరోపించారు.
MDCL: పరీక్షా కేంద్రాల్లోకి ఫోన్లు తీసుకెళ్లడం నిషేధం. కానీ పదో తరగతి పరీక్షల నిర్వహణలో HYD, పెద్దపల్లి జిల్లాల్లోని 12% కేంద్రాల్లో ఇన్విజిలేటర్లు బయోమెట్రిక్ హాజరు తర్వాత కూడా ఫోన్లను తమవద్దే ఉంచుకుంటున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో వెల్లడైంది. కొన్నిచోట్ల వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచారం బయటకు వెళ్తాందన్న ఆరోపణలపై ఇప్పటికే అంతర్గత విచారణ నడుస్తోంది.
HYD: తాండూరు మాజీ MLA రోహిత్ రెడ్డి వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. 2018 నుంచి డ్రగ్స్ కేసు, ఎమ్మెల్యేల ఎర కేసు, పోలీసులతో గొడవలు వంటి అనేక ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. తాజాగా మున్సిపల్ ఎన్నికల సమయంలో పోలీసులతో గొడవ పడి, వారంపాటు అజ్ఞాతంలో ఉండి బెయిల్ పొందారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాల మేరకు ప్రతి సోమవారం తాండూరు పోలీస్ స్టేషన్‌లో హాజరవుతున్నారు.
SRPT: జిల్లా ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ ప్రతి కుటుంబానికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉగాది పండుగ కొత్త ఆశలు, కొత్త లక్ష్యాలకు శ్రీకారం చుట్టాలన్నారు.
ASF: కాగజ్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేని, గడువు ముగిసిన దుకాణాలపై బుధవారం అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శానిటరీ ఇన్‌పెక్టర్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ సిబ్బందితో కలిసి పలు దుకాణాలను పరిశీలించారు. లైసెన్స్ లేకుండా లేదా రీన్యువల్ చేయని యజమానులను గుర్తించి, చట్ట ప్రకారం నోటీసులు జారీ చేసి జరిమానాలు విధించారు.
NRML: ముధోల్ మండలం అష్ట గ్రామంలోని పదవ తరగతి పబ్లిక్ పరీక్షా కేంద్రంలో బుధవారం గ్రామ సర్పంచ్ రావుల లావణ్య శ్రీనివాస్ విద్యార్థులకు అల్పాహారం పంపిణీ చేశారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులకు పాలు, బిస్కెట్లు అందజేసి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థులు భయాందోళనలు లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.
WNP: పోలీసు కేవలం విధుల్లోనే కాకుండా క్రీడల్లో కూడా ప్రతిభ కనపరచడం అభినందనీయం అని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో క్రీడాకారులకు క్రికెట్ జట్టుకు జెర్సీలను అందజేశారు. ఆమె మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయన్నారు. పోలీసు క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలన్నారు.
BDK: అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను అదనపు కలెక్టర్ విద్యాచందన ఆదేశించారు. చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఆమె నేడు పర్యటించారు. స్వయం సహాయక సంఘాల బిల్డింగ్, సీసీ రోడ్లు నిర్మాణ పనులను పరిశీలించారు. మిగతా అభివృద్ధి పనులపై ఆరా తీశారు. ఎంపీడీవో అశోక్, సర్పంచ్, ఉప సర్పంచ్ బొర్రా లలిత, బాలు పాల్గొన్నారు.
SRCL: వేములవాడ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి వారిని హైదరాబాద్ క్రికెట్ అసోసియాన్ సెక్రటరీ తమిడి శెట్టి బసవరాజు దర్శించుకుని పూజలు చేశారు. భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం ఆంజనేయ స్వామికి పూజలు నిర్వహించారు. అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.
RR: కేశంపేట మండలం వేములనర్వ గ్రామ శివారులోని వేణు గోపాల స్వామి గుట్టపై గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత 2 రోజులుగా గుట్టపై జరుగుతున్న తవ్వకాలపై విస్తృత చర్చ జరుగుతున్న అధికారులు స్పందించడం లేదని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి గుట్టపై అక్రమ తవ్వకాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
KNR: జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి దిగుమతులు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు 8 వాహనాల్లో 75 క్వింటాళ్ల విడిపత్తిని రైతులు తీసుకువచ్చారు. గరిష్ఠంగా క్వింటాకు రూ. 7,500, కనిష్ఠంగా రూ. 7,200 ధరకు ప్రైవేట్ వ్యాపారులు బహిరంగ వేలం ద్వారా పత్తిని కొనుగోలు చేశారు. నిన్నటి కంటే తాజాగా పత్తి గరిష్ఠ ధర రూ. 50 పెరిగింది. రైతులు నాణ్యత పాటించాలన్నారు.
MBNR: అమెరికా చేస్తున్న సామ్రాజ్యవాద యుద్ధాన్ని ఖండిస్తున్నామని ప్రజాసంఘాల నాయకులు విమర్శించారు. ఇరాన్‌పై అమెరికా చేస్తున్న దాడులను నిరసిస్తూ జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. ఈనెల 22వ తేదీన ఆర్అండ్‌బీ అతిథి గృహం నుంచి తెలంగాణ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించాలని తీర్మానించారు. పాలస్తీనా ఇరాన్‌లపై, ఇజ్రాయిల్ అమెరికా దాడులు మంచిది కాదన్నారు.
MBNR: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అహంకారపూరిత వ్యాఖ్యలు మానుకోవాలని బీసీ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ విమర్శించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. పీసీసీ పదవి జగ్గారెడ్డికిస్తే 100 స్థానాల్లో గెలుస్తామని అనడం సిగ్గుచేటు అన్నారు. ముందు మీ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
SDPT: జిల్లాలో గత ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 1070 కోట్ల అభివృద్ధి పనులను రద్దు చేయడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం సిద్దిపేటలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను రద్దు చేసి సిద్దిపేట ప్రజలను వంచించడం తగదన్నారు.