• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేస్తాం’

MBNR: మహబూబ్‌నగర్ పట్టణంలోని 31వ, 32వ డివిజన్ల పరిధిలో ఉన్న ఎర్రకుంట చెరువును డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ రామాంజుల రెడ్డి సంబంధిత అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువును పునరుద్ధరించి, చుట్టూ సుందరీకరణ పనులు చేపట్టి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు.

March 18, 2026 / 08:01 PM IST

హిందుస్థాన్ ఏరోనాటికల్ పరిశ్రమలో ఘనంగా ఉగాది వేడుకలు

HYD: హెచ్.ఎల్.ఏలో వెల్ఫేర్ ఫండ్ మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో ‘పరాభవ’ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని ఈ.డీ రామ్మోహనరావు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ ఏడాది కూడా పరిశ్రమ అభివృద్ధికి ఉద్యోగులందరూ ఐకమత్యంతో కృషి చేయాలని ఆయన కోరారు. ఈ వేడుకల్లో జనరల్ మేనేజర్ సతీష్, కర్కా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

March 18, 2026 / 08:00 PM IST

రేపు తిరుపతికి ఆర్టీసీ బస్సు రద్దు

NGKL: రేపు ఉగాది పర్వదినం సందర్భంగా అచ్చంపేట ఆర్టీసీ డిపో నుంచి తిరుపతి పుణ్య క్షేత్రానికి బయలుదేరే ఆర్టీసీ బస్సును రద్దు చేసినట్లు అచ్చంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రసాద్ తెలిపారు. అదేవిధంగా ఈ నెల 20న తిరుపతి నుంచి అచ్చంపేటకు వచ్చే బస్సును రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు గమనించాలని ఆయన కోరారు.

March 18, 2026 / 08:00 PM IST

రేపు భారీ కుస్తీ పోటీలు

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలో రేపు గురువారం భారీ కుస్తీ పోటీలు నిర్వహిస్తున్నట్లు స్థానిక సర్పంచ్ శ్రీనివాసరావు పాటిల్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం పురస్కరించుకొని ఈసారి కూడా బస్తీమే సవాల్ పోటీలు జరుగుతాయన్నారు. చుట్టుపక్క ప్రాంతాల నుంచి మల్ల యోధులు పెద్ద ఎత్తున పాల్గొనాలన్నారు. విజేతలకు బహుమతులు ఇస్తామన్నారు.

March 18, 2026 / 08:00 PM IST

హ్యాకథాన్‌కు క్రీడాకారులకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

KMR: వరల్డ్ తెలుగు ఐటి అసోసియేషన్ (WTIT) ఆధ్వర్యంలో ఈనెల 28, 29 తేదీల్లో HYD గచ్చిబౌలి స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ హ్యాకథాన్ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నారు. ఈ పోటీలకు జిల్లాలోని క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచించారు. ఆసక్తి గలవారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని, లేదంటే 97365 60909 సంప్రదించాలని పేర్కొన్నారు.

March 18, 2026 / 07:59 PM IST

అగ్ని ప్రమాదాలతో జాగ్రత్త: ఫైర్ ఆఫీసర్ అశోక్

GDWL: అగ్ని ప్రమాదం జరిగినప్పుడు భయాందోళనకు గురికాకుండా చాకచక్యంగా వ్యవహరించాలి అని జిల్లా ఫైర్ ఆఫీసర్ అశోక్ ఓ ప్రకటనలో సూచించారు. బుధవారం గద్వాలలో ఓ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించి, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.

March 18, 2026 / 07:58 PM IST

వరుస సెలవులతో బస్సుల్లో రద్దీ

NLG: ఉగాది, రంజాన్ పండుగలతో వరుసగా నాలుగు రోజులు సెలవులు రావడంతో జనం సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి నల్గొండ వైపు వచ్చే బస్సుల్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. గురువారం ఉగాది, శనివారం రంజాన్ కావడంతో మధ్యలో శుక్రవారం సెలవు తీసుకుని ఊర్లకు వెళ్తున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి.

March 18, 2026 / 07:55 PM IST

‘పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి’

PDPL: పర్యావరణన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని, HDK యూనివర్సిటీ అసిస్టెంట్ సైంటిస్ట్ కనక జ్యోతి సూచించారు. గోదావరిఖని HDK యూనివర్సిటీ PG కాలేజ్ ఆవరణలో ప్లాస్టిక్ నిషేధంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ సైంటిస్ట్ కనక జ్యోతి పాల్గొని ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి కలిగే హానికర ప్రభావాలను వివరించారు.

March 18, 2026 / 07:51 PM IST

ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రైతు సంఘం ఆందోళన

KMM: రైతాంగ సమస్యల పరిష్కారంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట అధ్యక్షులు బాగం హేమంతరావు ఆరోపించారు. రైతులకు ఇచ్చిన ఏ హామీని ఈ ప్రభుత్వం అమలు చేయలేదని తెలిపారు. బుధవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ప్రభుత్వ ధోరణి మారకపోతే రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

March 18, 2026 / 07:51 PM IST

గేదెని ఢీకొట్టిన బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు

MDK: రామాయంపేట మండలం రాయిలాపూర్ శివారులో పాడి గేదెను ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అతివేగంగా వచ్చిన ఒక ద్విచక్ర వాహనం ఎదురుగా పాడి గేదేను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పాడి గేదె అక్కడికక్కడే మృతి చెందింది. ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

March 18, 2026 / 07:50 PM IST

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న చిత్ర యూనిట్

WGL: భద్రకాళి అమ్మవారి ఆలయాన్ని “బ్యాండ్ మేళం” చిత్ర యూనిట్ సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చిత్ర యూనిట్‌కు స్థానిక ప్రజలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ మేళం చిత్రాన్ని ప్రజలు ఆదరించాలని చిత్ర యూనిట్ సభ్యులు కోరారు.

March 18, 2026 / 07:50 PM IST

ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎంపీ కడియం కావ్య..

JN: వరంగల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎంపీ కడియం కావ్య ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగాది పండుగ మన తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే రోజు అని, శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ప్రతి ఇంట సుఖశాంతులు, ఐశ్వర్యం, ఆనందం నిండాలని ఆకాంక్షించారు. ఉగాది పండుగ ప్రతి కుటుంబంలో కొత్త ఆశలు, కొత్త అవకాశాలు తీసుకురావాలని ఎంపీ ఆకాంక్షించారు.

March 18, 2026 / 07:49 PM IST

ఆసిఫాబాద్‌లో పీఎం శ్రీ పాఠశాలలపై సమీక్ష

ASF: జిల్లా కలెక్టర్ కె. హరిత, కేంద్ర నోడల్ అధికారి అమిత్ కటోచ్‌తో కలిసి పీఎం శ్రీ పాఠశాలల అమలుపై ఐడీవోసీలో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యా ప్రమాణాల మెరుగుదలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, డీఈవో, ఇతర అధికారులు పాల్గొని క్షేత్రస్థాయి పురోగతిని వివరించారు.

March 18, 2026 / 07:48 PM IST

ఉద్యాన పంటల సాగుపై అవగాహన, శిక్షణ సదస్సు

BHPL: మొగుళ్లపల్లి(M) ఇసిపేటలో బుధవారం ఉద్యాన శాఖ జిల్లా అధికారి ఏ. సునిల్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యాన పంటల సాగు, ప్రభుత్వ పథకాల పై అవగాహన, శిక్షణ సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు ద్వారా స్థిర మార్కెట్, అధిక దిగుబడి, దీర్ఘకాల ఆదాయం లభిస్తాయని, ఉద్యాన శాఖ సబ్సిడీలు, డ్రిప్ ఇరిగేషన్, మినీ కిట్‌లు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

March 18, 2026 / 07:47 PM IST

ముస్లింలకు రంజాన్ కానుకల పంపిణీ

JGL: కథలాపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలో ముస్లింలకు రంజాన్ కానుకలను గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం పంపిణీ చేశారు. రంజాన్ పండుగ వేళ పేద ముస్లింలు అందరితో పాటు సంతోషంగా ఉండాలని ప్రభుత్వం రంజాన్ కానుకలను పంపించిందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, ఉప సర్పంచ్ లక్ష్మి, కార్యదర్శి రాజేష్, నాయకులు గంగారాం, నరేష్, రఫీ పాల్గొన్నారు.

March 18, 2026 / 07:46 PM IST