సింగర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడో బస్తీ నుంచి మొదలైన రాహుల్ కెరీర్.. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ రేంజ్‌కి వెళ్లిపోయింది. అందుకే ఇప్పుడు రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తున్నాడనే పుకార్లు వస్తున్నాయి. తాజాగా దీని పై రాహుల్ క్లారిటీ ఇచ్చేశాడు.
మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. తనతోపాటు కుమారుడికి టికెట్ ఇస్తే చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వారం రోజులపాటు నియోజకవర్గంలో తిరుగుతానని.. ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.
గోదావరిఖనికి చెందిన సాయి విజ్ఞత.. అమెరికాలో ఉంటున్నారు. ఐటీ కంపెనీలో మంచి పొజిషన్‌లో ఉన్నారు. చంద్రమండలంపై ఎకరం భూమిని కొనుగోలు చేశారు. ఆ భూమిని తన తల్లికి అందజేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తాను ఎవరికీ భయపడనని.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్.. అవసరమైతే ప్రధానిని కూడా లెక్క చేయనని చెబుతున్నారు.
జనశక్తి నేత కూర రాజన్న, అతని సోదరుడు కూర దేవేందర్ అలియాస్ అమర్ సహా మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అమర్ విమలక్క భర్త అనే సంగతి తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళా కొత్త నోటిఫికేషన్లు వస్తున్నాయి. గడిచిన నాలుగున్నర ఏళ్లలో లేని పోస్టులు ఇప్పుడే వేయడానికి కారణం కేవలం ఎన్నికల స్ట్రాటజీయేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. విద్యార్థులు కూడా దీనికి సుముఖంగ లేరని తెలుస్తోంది.
బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్ గౌడ్(84)(Bathini Harinath Goud) ఇక లేరు. అతను చాలా కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం పంపిణీ చేయడంలో ప్రసిద్ధి చెందింది.