మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. తనతోపాటు కుమారుడికి టికెట్ ఇస్తే చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వారం రోజులపాటు నియోజకవర్గంలో తిరుగుతానని.. ఆ తర్వాత నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు.
Mainampally Hanumantha Rao: బీఆర్ఎస్ ముఖ్యనేత, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mainampally Hanumantha Rao) ఆ పార్టీని వీడే అవకాశం ఉంది. తనతోపాటు కుమారుడికి మెదక్ (medak) అసెంబ్లీ సీటు కావాలని పట్టుబడుతున్నారు. దీనిపై హైకమాండ్ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. సో.. కొందరు కాంగ్రెస్ ముఖ్యనేతలతో సంప్రదింపులు జరిపినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఇద్దరికీ టికెట్లు ఇస్తే పార్టీలో చేరేందుకు ఎలాంటి సందేహాం లేదని తేల్చి చెప్పినట్టు సమాచారం. దీనిపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. మైనంపల్లి కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి మరికొద్దీ రోజుల్లో స్పష్టత రానుంది. మేడ్చల్ జిల్లా దూలపల్లిలో గల నివాసానికి ఇవాళ కార్యకర్తలు తరలిరాగా.. మీడియాతో మాట్లాడారు.
టికెట్ ఇవ్వకపోవడంతో
అసెంబ్లీ ఎన్నికల్లో కుమారుడు రోహిత్ (rohith) రాజకీయ రంగ ప్రవేశం చేయించాలని మైనంపల్లి (Mainampally) భావిస్తున్నారు. మెదక్ అసెంబ్లీ టికెట్ అడిగారు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి ఉన్నారు. సో.. విజయావకాశాలు, సామాజీక సమీకరణాలు.. తదితర అంశాల ఆధారంగా టికెట్ ఇవ్వడం వీలు కాలేదు. మైనంపల్లి (Mainampally) ఒక్కరికే టికెట్ కేటాయించారు. అప్పటినుంచి బీఆర్ఎస్ హైకమాండ్ లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. మంత్రి హరీశ్ రావును టార్గెట్ చేశారు. ఇప్పటికీ ఆ వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని చెబుతూ.. హీట్ పెంచుతున్నారు.
రాజకీయ భిక్ష
మెదక్ ప్రజలు తనకు రాజకీయ భిక్ష పెట్టారని ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. టీడీపీ మెదక్ జిల్లా అధ్యక్షుడిగా 8 ఏళ్లు పనిచేశానని.. తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరానని గుర్తుచేశారు. ఏ పార్టీలో ఉన్న తనకు వెన్నుపోటు పొడిచే అలవాటు లేదన్నారు. ప్రాణం పోయే వరకు మాటపై ఉంటానని చెప్పారు. ఏ రోజు తాను కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను తిట్టలేదని గుర్తుచేశారు. అందరూ ఏకమైతేనే తెలంగాణ కల సాకారమైందన్నారు. బీఆర్ఎస్ పార్టీని తాను ఏమీ అనలేదని.. పార్టీ కూడా తనను ఏమీ అనలేదని తెలిపారు. మల్కాజిగిరి నియోజకవర్గంలో వారం రోజుల పాటు అనుచరులను కలుస్తానని.. కార్యకర్తలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. ఆ తర్వాత మీడియాను పిలిచి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని పేర్కొన్నారు. తనకు సత్తా ఉందని.. ఏ పార్టీ నుంచి పోటీ చేసినా విజయం సాధిస్తాననే ధీమా వ్యక్తం చేశారు. కుమారుడు రోహిత్‌కు 25 ఏళ్లు అని.. భవిష్యత్ ఉందని చెప్పారు. తన కంటే కుమారుడు ఎక్కువగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారని మైనంపల్లి వివరించారు. మెదక్‌లో తిరిగి ప్రజాభిప్రాయం కోరతాడని మైనంపల్లి (Mainampally) పేర్కొన్నారు.
ఆడియో కలకలం
అంతకుముందు మైనంపల్లి (Mainampally) పేరుతో ఓ ఆడియో వైరల్ అయ్యింది. దానిపై మాత్రం ఆయన స్పందించలేదు. సో.. అందులో మాట్లాడిన అంశాలు నిజమేనా అనే సందేహాం కలుగుతుంది. తనకు ఏం కావాలో మైనంపల్లి (Mainampally) చెబుతున్నారు. కుమారుడితోపాటు టికెట్ ఇచ్చే పార్టీలో చేరే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఆస్కారం ఉంది.