తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) హాజరయ్యారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని సీఎం కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. దీంతో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు, 1200 పై చిలుకు గ్రామాలకు తాగునీరు అందింది.
రాష్ట్రంలో వరుసగా పలు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్న నాగర్ కర్నూల్, తర్వాత నల్గొండ జిల్లాలో జరుగగా..తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఫుడ్ పాయిజన్ అంశం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 50 మందికిపైగా విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు.
హైదరాబాద్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటి సమావేశానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అందులో తెలంగాణ ఫేమస్ వంటకాలను ప్రత్యేకంగా వడ్డిస్తున్నారు. మొత్తం 78 రకాల వంటకాలను ఈ సమావేశంలో స్పెషల్‌గా వడ్డిస్తున్నట్లు తెలిసింది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
BRS పార్టీకి ఖమ్మం జిల్లా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ కు రాజీనామా లేఖను పంపించారు. BRSలో తనకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయితే ఈరోజు హైదరాబాద్లో జరగనున్న CWC సమావేశానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. తనపాటు బీజేపీకి చెందిన మ...
ఢిల్లీలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు 2023 నవంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు జరగనుంది. అయితే ఈ సదస్సులో తెలంగాణ పెవిలియన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అందుకోసం రాష్ట్రంలోని స్టార్టప్స్, ఆయా సంస్థలు అప్లై చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలోని హైదరాబాద్లో శనివారం ఉదయం నుంచి నాలుగు చోట్ల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) సోదాలు చేపడుతోంది. దీంతోపాటు కోయంబత్తూరులో 22 చోట్ల, చెన్నైలో మూడు చోట్ల సోదాలు ప్రారంభించింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా ఈరోజు రాత్రి హైదరాబాద్ రానున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ కీలక నేతలైన రాహుల్ గాంధీ, సోనియా కూడా తెలంగాణకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు ఏదైనా పేలుళ్లకు ప్లాన్ చ...
రేపు మీరు హైదరాబాద్లో బయటకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త. ఎందుకంటే రేపు(సెప్టెంబరు 17న) హైదరాబాద్ మొత్తం రాజకీయ సభలు, ర్యాలీలతో ఫుల్ బిజీగా మారనుంది. ఈ క్రమంలో ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఉంటాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణాలు ప్లాన్ చేసుకోండి. అయితే ఈసారి ఏ పార్టీలు వేడుకలు చేస్తున్నాయో ఇప్పుడు చుద్దాం.
తెలంగాణలోని విద్యార్థులకు సీఎం కేసీఆర్ దసరా కానుకను ప్రకటించారు. దసరా తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్‌ను సర్కార్ ప్రవేశపెట్టనుంది.
హైదరాబాద్ కరాచీ బేకరీకి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ప్రపంచంలోని 150 డెజర్ట్ ప్రదేశాలలో భారత్‌కు చెందిన పలు వంటకాలు ఆ జాబితాలో నిలిచాయి. అందులో హైదరాబాద్ కరాచీ బేకరీకి 29వ స్థానం దక్కింది.