నిత్యం రాష్ట్ర పాలనా వ్యవహారాలతో బిజీ బిజీగా గడిపే సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) వీకెండ్ వచ్చిందంటే చాలు ఏదో వెకేషన్‌కి వెళ్లిపోయి హాయిగా ఫ్యామిలి, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేస్తుంటారు. ఈ మేరకు తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన స్వీట్ మూమెంట్స్‌ని కూడా ఆమె అభిమానులతో సోషల్‌మీడియా(Social media)లో షేర్ చేస్తుంటారు. తాజాగా తన ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ ఇంట్రెస్టింగ్ రీల్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మరింది. దీంతో నెటిజన్లు.. మేడమ్ సార్.. మేడమ్ అంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2001 బ్యాచ్‌కు చెందిన స్మిత సబర్వాల్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి తన పనితీరుతో ఎంతో గుర్తింపు పొందారు.
తెలంగాణ (Telangana) సీఎంవో అధికారిణిగా బాధ్యతలు చేపట్టిన మొదటి మహిళా కలెక్టర్‌గా మరింత పాపులర్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో నిత్యం టచ్‌లో ఉంటారు స్మిత సబర్వాల్. ప్రభుత్వ పనులు సమర్థవంతంగా నిర్వహిస్తూనే, మరోవైపు సమయం దొరికినప్పుడల్లా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానలను ప్రశ్నించువుంటారు.ఏప్రిల్ 2011లో, ఆమె కరీంనగర్ జిల్లా (Karimnagar District) కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు, అక్కడ ఆమె ఆరోగ్యం మరియు విద్యా రంగంలో గణనీయమైన కృషి చేశారు. అమ్మలాలనగా ప్రసిద్ధి చెందిన ప్రభుత్వ రంగంలో సంస్థాగత ప్రసవాలను మెరుగుపరచడానికి ఆరోగ్య కార్యక్రమం జిల్లాలో ప్రారంభించబడింది మరియు విజయవంతంగా అమలు చేయబడింది.
తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింటెక్స్ కంపెనీ రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా మరో 1000 మందికి ఉద్యోగాలు రానున్నాయి.