మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao)తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం (Khammam) బయల్దేరే ముందు తన అనుచరులను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత తన అనుచరులతో కలిసి 2 వేల కార్లతో కూడిన భారీ కాన్వాయ్‌తో ఆయన వెళ్లారు. నాయకన్ గూడెం దగ్గర తమ నేతకు అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున తరలివచ్చారు. ఎక్కడా బీఆర్ఎస్, సీఎం కేసీఆర్ (CM KCR) జెండాలు లేకుండా, కేవలం తుమ్మల ఫొటోలు, ఫ్లెక్సీలనే పెట్టారు. నాయకన్ గూడెం నుంచి ఖమ్మం వరకు ర్యాలీ చేపట్టారు.
మరోవైపు కాంగ్రెస్ (Congress) నుంచి ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావుకు ఆహ్వానం అందింది. దీంతో ఆయన ఆ పార్టీలోకి వెళ్తారా? లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. తనను ఎన్నికల్లో పోటీ చేయకుండా కొందరు కుట్ర చేస్తున్నారని తుమ్మల ఆరోపించారు. పదవులు (Positions) తనకు అలంకారం, అహంకారం. కోసం కాదన్నారు. తనను మంత్రిని చేసిన ఖమ్మం ప్రజల అభిమానం, ఆదరణకు జీవితాంతం రుణపడి ఉన్నారు. రాజకీయ అనుబంధం తెంచుకోవాలని ఉన్నా.. ప్రజల కోసం మరోసారి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కాగా ఏ పార్టీ నుంచి పోటీ చేయబోతున్నది ఆయన ప్రకటన చేయలేదు.