ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతోపాటు అతికొద్ది మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. బంధుమిత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు కొద్ది మంది మాత్రమే హాజరవుతున్నారు. త్వరలోనే అందరి కోసం పెద్ద ఎత్తున వివాహ విందు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన వరంగల్ (Warangal) మెడికో ప్రీతి కేసులో కాకతీయ మెడికల్ కాలేజీ (KMC) అధికారిపై వేటు పడింది. కేఎంసీ అనస్థీషియా హెచ్ఓవీ నాగార్జున రెడ్డి (Nagarjuna Reddy)బదిలీ అయ్యారు. కేఎంసీ నుంచి భూపాలపల్లికి బదిలీ అయ్యారు. ఈ మేరకు వైద్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ ప్రీతి కేసులో నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం.
మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని(Women's Day) పురుస్కరించుకొని మహిళలందరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ (Green India Challenge) కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటాలని బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh Kumar)పిలుపునిచ్చారు. పిల్లలను పెంచే చేతులే మొక్కలు నాటితే ప్రకృతి మరింత అభివృద్ధి చెందుతుందని సంతోష్‌కుమార్ అన్నారు.
ts government file writ petition:తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ (governer Tamilisai Soundararajan ) మధ్య వివాదం సద్దుమణగలేదు. బిల్లుల పెండింగ్ అంశంపై బీఆర్ఎస్ సర్కార్ (government) సీరియస్‌గా ఉంది. ఇదే అంశంపై పలుమార్లు గవర్నర్ దృష్టికి తీసుకొచ్చినా.. ఫలితం లేదు. ఇక చేసేది లేక సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (supreme court) తలుపు తట్టింది.
మూడేళ్ల చిన్నారి 6 గంటలపాటు చీకటి గదిలో నరకయాతన అనుభవించింది. ఏడ్చి ఏడ్చి స్పృహ కోల్పోయింది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా జిన్నారం మండలం ఖాజీపల్లి అంగన్వాడిలో విషాద ఘటన జరిగింది. అంగన్‌వాడీ(Anganwadi) కేంద్రంలో మూడేళ్ల చిన్నారిని మరిచిపోయి తాళం వేసి ఆయా వెళ్లిపోయింది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ (Telanagna) రాష్ట్రం పారిశ్రామిక వేత్తలకు భూతల స్వర్గంగా మారింది. హైదరాబాద్ (Hyderabad) కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ప్రపంచ స్దాయి కంపెనీలు తమ సంస్దలను రాష్ట్రంలో స్థాపించి కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. తాజాగా మరో మెగా పెట్టుబడి రాష్ట్రనికి వచ్చింది. తెలంగాణలో పెట్టుబడులు పెడుతున్నట్లు ఫాక్స్ కాన్( Foxconn ) సంస్థ గురువారం ప్రకటించింది. ఈ పెట్టుబడుల ద్వార...
బీఆర్ఎస్ (BRS ) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దేశ రాజధాని ఢిల్లీలోని ఒక రోజు ధర్నాకు పిలుపునిచ్చారు. మార్చి 10న జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద కవిత ఆధ్వర్యంలో నిరసన చేపట్టనున్నరు. మహిళా దినోత్సవం పురుస్కరించుకొని మహిళా రిజర్వేషన్ బిల్లు ( Woman Reservation Bill )ను పార్లమెంట్ ముందుకు తీసుకురావాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత( MLC Kavitha ) డిమాండ్ చేశారు
రంగారెడ్డి జిల్లా నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ దగ్గరకు భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి వెళ్లి నిరహార దీక్ష చేస్తున్నారు. సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన వారిని ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
నందమూరి తారకరత్న (Tarakaratna ) పెద్దకర్మ హైదరాబాదు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో నిర్వహించారు. జూనియర్ ఎన్టీఆర్ (Jr ntr) తన సోదరుడు తారకరత్నకు భావోద్వేగ అంజలి ఘటించారు. తారకరత్న చిత్రపటం ముందు శిరసు వచ్చి నివాళి అర్పించారు.
కేంద్ర ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచడంపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్ పార్టీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. మోదీ ప్రభుత్వం వచ్చాక గ్యాస్ ధరలు దాదాపు రూ.600కు పైగా ధర పెంచడంపై మండిపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనను తప్పుబడుతూ గురు, శుక్రవారాల్లో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతోంది.
తీవ్ర గాయాలవడంతో బాలుడి కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఏం జరిగిందని ఆరా తీయగా పిల్లాడు నోరు విప్పాడు. ఈ దారుణ ఘటన విషయమై బాలుడి తల్లిదండ్రులు మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ (Mylardevpally Police Station)లో ఫిర్యాదు చేశారు. కాగా గాయాలపాలైన బాలుడిని ఆస్పత్రికి తరలించారు.
పెళ్లి వేడుకలకు హెలీకాప్టర్ల వినియోగం భారీగా పెరుగుతోంది. ఇతర ప్రాంతాల్లో హెలీకాప్టర్లు వధూవరులను తీసుకురావడానికి వినియోగించారు. ఇక వారిపై పూల వర్షం కురిపించేందుకు వాడారు. కానీ ఇలా పెళ్లి పిలుపుల కోసం హెలీకాప్టర్ వాడడం ఇదే మొదటిసారి కావొచ్చు. కాగా పెళ్లి కోసం హెలీకాప్టర్ వాడడం ఇదే తొలిసారి అయ్యిండొచ్చు. పెళ్లి పిలుపులకే ఇంత హడావుడి చేస్తున్న ఆ వ్యాపారి ఇక పెళ్లి నాడు ఎంత హడావుడి చేస్తున్నాడో ఊహ...
sharmila on write letter:వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల రాష్ట్రంలోని ప్రతిపక్షాలకు లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు కలిసి పోరాటం చేద్దామని అందులో పేర్కొన్నారు. అందరం కలిసి ఢిల్లి వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని అందులో కోరారు. రాష్ట్రంలో అప్రకటిత, అత్యయిక పరిస్థితులు ఉన్నాయని చెప్పారు.
బీజేపీకి అదానీతో సంబంధం ఉంది కానీ, ఆమ్ ఆద్మీతో సంబంధం లేదని మరోసారి రుజువైంది. బీజేపీ అంటే.. భారత జనులను పీడించే పార్టీ. గల్లి మీటింగ్ కి వచ్చే బీజేపీ నాయకులను తరిమికొట్టాలి. అన్ని సంక్షేమ పథకాలపై కోతలు పెట్టి పేదల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి