»All Set To Manchu Manoj Bhuma Mounika Marriage At Film Nagar
Manchu Manoj నేడు రాత్రి ఫిల్మ్ నగర్ లో మనోజ్ పెళ్లి..
ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతోపాటు అతికొద్ది మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. బంధుమిత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు కొద్ది మంది మాత్రమే హాజరవుతున్నారు. త్వరలోనే అందరి కోసం పెద్ద ఎత్తున వివాహ విందు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
ఎప్పటి నుంచో యువ నటుడు మంచు మనోజ్(Manchu Manoj) పెళ్లి చేసుకోబోతున్నాడంటూ వస్తున్న వార్తలు నిజమయ్యాయి. నేడు శుక్రవారం మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అందరూ ఊహించినట్టే ప్రముఖ రాజకీయ కుటుంబం భూమ (Bhuma Family) వారసురాలినే మనువాడబోతున్నాడు. హైదరాబాద్ (Hyderabad)లోని ఫిల్మ్ నగర్ (Film Nagar)లో రాత్రి మౌనిక మెడలో మూడు ముళ్లు వేయబోతున్నాడు. దీనికోసం భారీ ఎత్తున ఏర్పాట్లు జరిగాయి.
కాగా మనోజ్ పెళ్లి సందర్భంగా మంచు వారి ఇంట (Manchu Family) సందడి నెలకొంది. ముఖ్యంగా మంచు లక్ష్మి పసన్న నివాసంలో ఉత్సాహ వాతావరణం అలుముకుంది. సంగీత్ (Sangeet), పసుపు (Haldi)స్నానాల వేడుక ఆనందోత్సాహాల మధ్య జరిగాయి. దీనికి సంబంధించిన ఫొటోలను మంచు లక్ష్మి వైరల్ (Viral)గా మారాయి. ఇక నేడు రాత్రి 8.30 నిమిషాలకు శుభ ముహూర్తాన మనోజ్- మౌనిక ఏకం కానున్నారు. కాగా ఈ పెళ్లికి మోహన్ బాబు (Manchu Mohan Babu), మంచు విష్ణు (Manchu Vishnu), లక్ష్మీ ప్రసన్న (Manchu Laxmi Prasanna) సందడి చేస్తున్నారు. ఈ వేడుకకు ఇరు కుటుంబసభ్యులతోపాటు అతికొద్ది మంది మాత్రమే హాజరవుతున్నట్లు సమాచారం. బంధుమిత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు కొద్ది మంది మాత్రమే హాజరవుతున్నారు. త్వరలోనే అందరి కోసం పెద్ద ఎత్తున వివాహ విందు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.
పెళ్లికి ముందు చేసే పూజా కార్యక్రమాలు మంచు వారి ఇంట్లో జరిగాయి. బంధుమిత్రులతో మంచు వారి ఇల్లు కళకళలాడుతోంది. బుధవారం మెహందీ వేడుకలు ఘనంగా జరిగాయి. గురువారం సంగీత్ కార్యక్రమం జోరుగా సాగింది. ఫిల్మ్ నగర్ లోని నివాసంలోనే జరిగే వేడుకకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరిగాయి. ప్రత్యేక అలంకరణతో ఇల్లు దేదీప్యమానంగా వెలుగుతోంది. ఇక నేటితో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న భూమ మౌనికతో మనోజ్ ఏడడుగులు వేయనున్నాడు. ఇక నేటితో తనకు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న భూమ మౌనికతో మనోజ్ ఏడడుగులు వేయనున్నాడు.
మనోజ్ కు 2015 సంవత్సరంలో ప్రణతి (Pranathi) అనే అమ్మాయితో వివాహమైంది. వారి మధ్య విబేధాలు రావడంతో 2019లో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్నాడు. కాగా మౌనికకు కూడా గతంలో వివాహమైంది. ఆమె కూడా భర్తకు దూరంగా ఉంటోంది. అయితే మనోజ్, మౌనికకు చాలా ఏళ్ల నుంచే పరిచయం ఉంది. వీరిద్దరూ స్నేహితులు. వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. గతంలో చాలాసార్లు వీరిద్దరి కలిసి కనిపించారు. ఆలయాలకు వెళ్లారు. ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ కెమెరాలకు చిక్కారు. గతంలోనే వీరిద్దరికి రహాస్యంగా పెళ్లయ్యిందనే వార్తలు కూడా వినిపించాయి. కానీ అవి పుకార్లేనని తేలిపోయాయి. తమ ప్రేమ బంధాన్ని వివాహంతో అధికారికంగా జంటగా కాబోతున్నారు. మంచు మనోజ్-మౌనిక జంట త్రిబుల్ ఎం (MMM)గా కానుంది.