• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇలా

MDK: జిల్లాలో నేడు బుధవారం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉదయం 11 గంటలకు కొల్చారం మండలం ఘనపూర్కు హెలికాప్టర్లో వస్తారు. అనంతరం వనదుర్గమాతను దర్శించుకుని పూజలో పాల్గొంటారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, 11:45కి మెదక్ చర్చికి వెళ్తారు. అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఎస్పీ కార్యాలయం వద్ద గల హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్లో హైదరాబాద్ వెళ్తారు.

December 25, 2024 / 10:14 AM IST

లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన గ్రంథాలయ ఛైర్మన్

WNP: పాన్‌గల్ మండలం మహ్మదాపూర్ గ్రామంలోని అర్హులైన 10 మందికి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ గోవర్ధన్ సాగర్ ఆధ్వర్యంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను బుధవారం పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఆపద సమయంలో పేద కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సీఎంఆర్ఎఫ్ పథకాన్ని అర్హులైన ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

December 25, 2024 / 10:12 AM IST

క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జాన్సన్ నాయక్

NRML: ఖానాపూర్ పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో పాస్టర్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. క్రిస్మస్ సందర్భంగా బుధవారం ఆ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. యేసుక్రీస్తు అందించిన శాంతి బోధనలు అందరికీ ఆచరణీయమన్నారు.

December 25, 2024 / 10:09 AM IST

‘అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటాం’

NZB: రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. గత వేసవి కాలం డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని, రాబోయే వేసవిలో పెరగబోయే డిమాండ్ అంచనా మేరకు ప్రణాళిక బద్ధంగా అంచనాలు సిద్ధం చేస్తామన్నారు. సమయానుగుణంగా తగిన మంజూరును తీసుకుంటామని తెలిపారు.

December 25, 2024 / 10:09 AM IST

క్రిస్మస్ ఆనందం నింపాలి: డిప్యూటీ సీఎం భట్టి

KMM: మధిర మండలం బయ్యారం చర్చిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదర, సోదరీమణులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు బోధనలు ప్రేమ, మానవత్వానికి మార్గదర్శకమని, క్రిస్టియన్ మైనారిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పండుగ వేళ ప్రతీ ఇంట ఆనందం నిండాలని ఆకాంక్షించారు.

December 25, 2024 / 10:05 AM IST

చర్చికి ప్రత్యేక బస్సులు

MDK: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు స్థానిక డిపో మేనేజర్ తెలిపారు. సికింద్రాబాద్, జూబ్లీ బస్టేషన్, ఎల్లారెడ్డి, నర్సాపూర్, బాలానగర్ క్రాస్రోడ్స్ తదితర ప్రాంతాల నుంచి అదనంగా బస్సులు నడుపుతామన్నారు. ఏఏ ప్రాంతాల నుంచి ఎకువ మంది భక్తులు మెదక్ చర్చికి వస్తారో ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ బస్సులు నడుపుతామన్నారు.

December 25, 2024 / 10:03 AM IST

చర్చికి ప్రత్యేక బస్సులు

MDK: జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నట్లు స్థానిక డిపో మేనేజర్ తెలిపారు. సికింద్రాబాద్, జూబ్లీ బస్టేషన్, ఎల్లారెడ్డి, నర్సాపూర్, బాలానగర్ క్రాస్రోడ్స్ తదితర ప్రాంతాల నుంచి అదనంగా బస్సులు నడుపుతామన్నారు. ఏఏ ప్రాంతాల నుంచి ఎకువ మంది భక్తులు మెదక్ చర్చికి వస్తారో ఆ ప్రాంతాల నుంచి ఎక్కువ బస్సులు నడుపుతామన్నారు.

December 25, 2024 / 10:03 AM IST

పార్టీల విలీన సభ పోస్టర్లను ఆవిష్కరించిన నాయకులు

KMM: ఈనెల 28న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు పార్టీల విలీన సభను జయప్రదం చేయాలని ఇల్లందు మండలం బొంబాయి తండాలో బుధవారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు పోస్టర్ ఆవిష్కరించారు. సబ్ డివిజన్ కార్యదర్శి పొడుగు నరసింహారావు పాల్గొని సభ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు హర్జ్య, పాండ్యా, బిక్షం, మంగిలాల్, తేజ పాల్గొన్నారు.

December 25, 2024 / 10:02 AM IST

హైదరాబాద్‌లో OYOకు ఫుల్ డిమాండ్..!

HYD: OYO బుకింగ్స్ టాప్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇందుకు ప్రధాన కారణం.. గల్లీల్లో ఉండే లాడ్జిలను సైతం అధునాతన హంగులతో తీర్చిదిద్ది, అందుబాటు ధరలకే ఇస్తున్నారు. అయితే, నగరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ సారి గ్రాండ్‌గా నిర్వహిస్తున్నారు. దేశ విదేశాల నుంచి మన నగరానికి టూరిస్టులు వస్తుంటారు. దీంతో హోటల్స్ ఫుల్ డిమాండ్ పెరిగింది.

December 25, 2024 / 10:01 AM IST

ధర్మపురి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

JGL: హరిహర క్షేత్రంగా విరాజిల్లుతున్న జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో మార్గశిర మాసం కృష్ణపక్షం ఏకాదశి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్ప స్వామి మూల విగ్రహానికి పంచామృతాభిషేకం, క్షీరాభిషేకం వేదమంత్రాల మధ్య నిర్వహించారు. అలంకరణ స్వామి అష్టోత్తర శతనామార్చనలు, ధూప దీప నైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు.

December 25, 2024 / 09:51 AM IST

బీర్కుర్‌లో యువకుడి సూసైడ్

KMR: యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బీర్కుర్‌లో చోటుచేసుకుంది. మండలానికి చెందిన హరీశ్ (19) వారి పాత ఇంట్లో నిద్రించాడు. మంగళవారం ఉదయం అతడి తండ్రి తలుపు తెరిచి చూసేసరికి ఉరేసుకొని కనిపించినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్సై రాజశేఖర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు.

December 25, 2024 / 09:51 AM IST

ఈ-కోర్టు కేంద్రాలు ప్రారంభించిన న్యాయమూర్తులు

NGKL: కల్వకుర్తి మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మంగళవారం సాయంత్రం సేవా కేంద్రాన్ని నాగర్ కర్నూల్ జిల్లా న్యాయమూర్తి రాజేష్ బాబు ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం జ్యుడిషియల్ ఈ-కేంద్రాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం 29 ఈ-సేవా జ్యుడిషియల్ కేంద్రాలు ప్రారంభమయ్యాయని న్యాయమూర్తి వివరించారు.

December 25, 2024 / 09:46 AM IST

డిగ్రీ కళాశాలలో దరఖాస్తుల ఆహ్వనం

KMR: బిచ్కుంద, మద్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్లు కళాశాల ప్రిన్సిపల్ అశోక్ తెలిపారు. బిచ్కుంద కళాశాలలో ఆంగ్లం, అర్థశాస్త్రం, మద్నూర్ కళాశాలలో తెలుగు, ఆంగ్లం, బొటని, జూవాలజీ, కెమిస్ట్రీ పోస్టులు ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఆయా సబ్జెక్టులలో పీజీలో 55% మార్కులు అర్హత కలిగి ఉండాలన్నారు.

December 25, 2024 / 09:23 AM IST

నర్సాపూర్‌లో క్రమక్రమంగా తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

MDK: నర్సాపూర్ నియోజకవర్గంలో ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా తగ్గుతున్నాయి. వాతావరణ శాఖ లెక్కల ప్రకారం నర్సాపూర్‌లో బుధవారం ఉదయం 21. 2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. గాలిలో తేమశాతం 84. 1%గా ఉంది. ఉదయం వేళలో చలి గాలులతో వాహనదారులు, పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

December 25, 2024 / 09:23 AM IST

బ్లైండ్ స్పాట్స్.. బీ కేర్ ఫుల్!

HYD: రాచకొండ పోలీసులు బ్లైండ్ స్పాట్లలో డ్రైవింగ్‌కు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ సురక్షితమైన ప్రయాణం కోసం సూచనలు చేస్తున్నారు. ‘బ్లైండ్ స్పాట్లను తప్పించి, మీ వాహనం ఇతరులకు స్పష్టంగా కనిపించేలా ఉండండి’ అంటూ అవగాహన పుస్తకాలు విడుదల చేశారు. ప్రయాణంలో ప్రమాదాలు నివారించేందుకు ఈ సూచనలు కీలకమని పోలీసులు తెలిపారు.

December 25, 2024 / 09:20 AM IST