• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరుస్తా: సర్పంచ్ అభ్యర్థి

BDK: చర్ల మండలం మేజర్ గ్రామపంచాయతీలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పూజారి సామ్రాజ్యం విజయ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరే విధంగా కృషి చేస్తానని తెలిపారు. పేదల పక్షాన నిలబడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కొనియాడారు.

December 5, 2025 / 09:21 AM IST

కురవిలో రాష్ట్రస్థాయి ఎంపిక క్రీడోత్సవాలు

MHBD: కురవి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీపాఠశాల మైదానంలో సెపక్ తక్రా రాష్ట్రస్థాయి ఎంపిక క్రీడోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని ఉమ్మడి పది జిల్లాల నుంచి క్రీడాకారులు ఈ ఎంపికలకు హాజరయ్యారు. కురవి SI గండ్రాతి సతీష్ క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లాల వారిగా క్రీడాకారులు గౌరవవందనం సమర్పించారు.

December 5, 2025 / 09:20 AM IST

సర్పంచ్ బరిలో 106 మంది..హోరాహోరీ పోటీ

KMM: రఘునాథపాలెం మండలంలోని 37 పంచాయతీల్లో ఐదు పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన 32 పంచాయతీల్లో హోరాహోరీ పోటీ నెలకొంది. కొన్ని పంచాయతీల్లో 8 మందిపైగా అభ్యర్థులు తలపడుతున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు స్వంత పార్టీ అభ్యర్థులు పోటీకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది. మొత్తం పంచాయతీల్లో 106 మంది అభ్యర్థులు తలపడుతున్నారు.

December 5, 2025 / 09:19 AM IST

‘GP ఎన్నికల్లో సమస్యలుంటే కాల్ చేయండి’

రంగారెడ్డి జిల్లాలో 3 విడతల్లో జరుగుతున్న 2025 గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సాధారణ పరిశీలకుడిగా IAS అధికారి ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను ఎన్నికల సంఘం నియమించింది. జిల్లాలోని ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి సమస్యలైనా 8978462694 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చన్నారు.

December 5, 2025 / 09:16 AM IST

పూర్తైన నామినేషన్ల పరిశీలన: కలెక్టర్

JGL: మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి 7 మండలాల పరిధిలోని 122 గ్రామపంచాయతీలు, 1,172 వార్డు స్థానాలకు నామినేషన్ల పరిశీలన పూర్తయ్యింది. ఇందులో 4 సర్పంచ్ పదవులు, 349 వార్డు మెంబర్ స్థానాలు ఏకగ్రీమైనట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బి.సత్యప్రసాద్ తెలిపారు. అన్ని మండలాల్లో ఎన్నికల ప్రక్రియ శాంతియుతంగా కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

December 5, 2025 / 09:16 AM IST

‘ఈ చదువు నావల్ల కాదు’.. విద్యార్థి సూసైడ్

HYD: చదువుల ఒత్తిడి తట్టుకోలేక హైదరాబాద్‌లో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కుషాయిగూడ HB కాలనీకి చెందిన సిద్ధార్థ(18) ఇంటర్ పూర్తి చేసి, IIT కోసం కోచింగ్ తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో ‘ఈ ఒత్తిడి నావల్ల కాదు, జీవితంపై విరక్తి చెందా’ అంటూ ఉరేసుకున్నాడు. బయటకు వెళ్లొచ్చిన తల్లిదండ్రులు కొడుకు బలవన్మరణానికి పాల్పడటం చూసి కన్నీరుమున్నీరవుతున్నారు.

December 5, 2025 / 09:14 AM IST

చెన్నూర్‌లో సర్పంచ్ స్థానాలకు గాను 264 నామినేషన్‌లు

MNCL: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చెన్నూర్ నియోజకవర్గంలో 3వ విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. నియోజకవర్గంలోని 5 మండలాల్లో 102 సర్పంచ్ స్థానాలకు గాను 264 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. 868 వార్డు స్థానాలకు 584 నామినేషన్లు నమోదయ్యాయి. అభ్యర్థుల కోసం కేంద్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వెల్లడించారు

December 5, 2025 / 09:14 AM IST

ఖమ్మం రూరల్ మండలంలో 47 నామినేషన్ల తిరస్కరణ

KMM: ఖమ్మం రూరల్ మండలంలోని 21 పంచాయతీల్లో 47 నామినేషన్లు తిరస్కరణ గురైనట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు 148 మంది సర్పంచ్ అభ్యర్థులు నామినేషన్ వేయగా 202 వార్డులకుగాను 574 మంది నామినేషన్లు దాఖలు చేయగా 18 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు తెలిపారు. కాగా, సర్పంచ్‌కు 119 మంది, వార్డు సభ్యులకు 556 మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు.

December 5, 2025 / 09:11 AM IST

గోరికొత్తపల్లిలో మొదలైన ప్రచారం

BHPL: గోరికొత్తపల్లి మండలంలోని 9, 10వ వార్డుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఓం ప్రకాష్ గడపగడపకు మహా ప్రచారం నిర్వహించారు. రోడ్లు, మౌలిక వసతుల సమస్యలను పరిష్కరిస్తానని, ప్రభుత్వ పథకాలు అందరికీ సకాలంలో అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను పుస్తకంలో రాసుకుంటూ “నన్ను గెలిపిస్తే సమస్యలు నాకు వదిలేయండి” అని అన్నారు.

December 5, 2025 / 09:10 AM IST

సీఎంని సన్మానించిన మాజీ ఎమ్మెల్యే

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలో జరిగిన ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాల’ కార్యక్రమంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డిని ASF మాజీ MLA ఆత్రం సక్కు కలిశారు. ఈ సందర్భంగా సక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. పుష్పగుచ్చం అందించి ‘ప్రజా పాలన దినోత్సవ’ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ది ఇలానే సహకరించాలని కోరారు. 

December 5, 2025 / 09:08 AM IST

గ్యాస్ డెలివరీ బాయ్ నేడు సర్పంచ్ అభ్యర్థి

VKB:బొంరాస్పేట మండల కేంద్రంలో వాహనాన్ని నడుపుకుంటూ ఇంటింటికీ గ్యాస్ సిలిండర్ అందజేసే డెలివరీ బాయికి రిజర్వేషన్ కలిసొచ్చింది. దీంతో తుంకిమెట్ల బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులు బ్యాట్ గుర్తు కేటాయించడంతో ఒక్క అవకాశం ఇచ్చి గెలిపిస్తే అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానంటున్నారు.

December 5, 2025 / 09:00 AM IST

రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీల్లో పోత్కపల్లి విద్యార్థుల ప్రతిభ

PDPL: తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలలో ఓదెల మండలం పోత్కపల్లి పాఠశాల విద్యార్థులు ప్రతిభ చాటారు. విద్యార్థినులు అల్ల శరణ్య రెడ్డి, వేల్పుల స్వాతి కబడ్డీ పోటీలలో రాణిస్తున్నారు. విద్యార్థినుల రాష్ట్రస్థాయిలో రాణిస్తు కీలకపాత్ర పోషిస్తున్నారని, పీడీ హరికృష్ణ తెలిపారు. విద్యార్థులను అభినందించారు.

December 5, 2025 / 08:59 AM IST

సర్పంచ్ ఎన్నికలు.. కలెక్టర్ హెచ్చరిక

MDK: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ రాహుల్ రాజ్ హెచ్చరించారు. కౌడిపల్లి ఎంపీపీ కార్యాలయంలో జరుగుతున్న ఎన్నికల నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. నిబంధనలకు లోబడి ఎన్నికలలో ఖర్చులు చేయాలని సూచించారు. రూ.50 వేలకు మించి డబ్బులు వెంట తీసుకు వెళ్లవద్దని, అందుకు సరైన ఆధారాలు ఉండాలన్నారు.

December 5, 2025 / 08:58 AM IST

రూ. 3 కోట్లతో దంపతుల పరారీ

MDCL: ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న జె. సురేష్, జె. శాంతి దంపతులు స్థానికుల వద్ద చిట్టీలు, అధిక వడ్డీ ఆశచూపి సుమారు రూ. 3 కోట్లకు పైగా వసూలు చేశారు. గత రాత్రికి రాత్రే అద్దె ఇంటికి తాళం వేసి, తమ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి పత్తా లేకుండా పోయారు. మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

December 5, 2025 / 08:58 AM IST

GP ఎన్నికలు వాట్సాప్ గ్రూపుల్లో జాగ్రత్త!

RR: గ్రామపంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలపై సోషల్ మీడియాలో ప్రత్యేక నిఘా ఉంటుందని తలకొండపల్లి ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వాట్సాప్ గ్రూపుల్లో ఇతర వ్యక్తులను లేదా వేరే పార్టీ వారిని కించపరిచేలాగా, రెచ్చగొట్టేలాగా పోస్టులు పెడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

December 5, 2025 / 08:52 AM IST