• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే రాగమయి

KMM: క్రిస్మస్ పర్వదినం సందర్భంగా బుధవారం వేంసూరు మండలంలోని పలు చర్చీల్లో ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు చెప్పారు. క్రైస్తవులకు ముఖ్యమైన పండగ క్రిస్మస్ అని, ఏసుక్రీస్తు జన్మించిన శుభ దినాన అందరికి శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు.

December 25, 2024 / 08:47 AM IST

బీజేపీ బూత్ కమిటీలకు ముగిసిన ఎన్నికలు

HNK: ధర్మసాగర్ మండలం మల్లక్‌పల్లి గ్రామంలో బీజేపీ బూత్ కమిటీ ఎన్నికలను నేడు ఏకగ్రీవంగా జరుపుకున్నారు. మండల ఇన్‌ఛార్జ్ బొజ్జపల్లి సుభాష్ ఆధ్వర్యంలో బూత్ కమిటీల అధ్యక్షులుగా బైరపాక సురేష్, బైరపాక యాదగిరిలు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా సురేష్, బి.కుమార్ లకు నియామక పత్రాలను అందజేశారు.

December 25, 2024 / 08:40 AM IST

నేడు, రేపు వ్యవసాయ మార్కెట్‌లో భూసార బీట్ బంద్

NRML: భైంసా వ్యవసాయ మార్కెట్‌లో బుధ, గురువారం రెండు రోజులు క్రయవిక్రయాలు జరగవని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత కార్యదర్శి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బుధవారం క్రిస్మస్, గురువారం బాక్సింగ్ డే సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కార్యాలయానికి సెలవు ఉండడంతో భూసార బీట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

December 25, 2024 / 08:34 AM IST

భద్రాచలంలో రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

KMM: భద్రాచలం రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న భద్రాచలం రోడ్డు-కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.2,155 కోట్ల అంచనా వ్యయంతో పనులు మంజూరు చేయడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ పనులు పూర్తయితే తెలుగు రాష్ట్రాల ప్రయాణ సమయం తగ్గనుంది.

December 25, 2024 / 08:29 AM IST

రైల్వే లైన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

KMM: భద్రాచలం రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ మేరకు సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న భద్రాచలం రోడ్డు-కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు రూ.2,155 కోట్ల అంచనా వ్యయంతో పనులు మంజూరు చేయడంతో త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. ఈ పనులు పూర్తయితే తెలుగు రాష్ట్రాల ప్రయాణ సమయం తగ్గనుంది.

December 25, 2024 / 08:29 AM IST

ఆర్థిక సాయం అందజేత

కామారెడ్డి: జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని రంగంపేటకి చెందిన మున్సిపల్ కార్మికుడు పాసుల రేవన్ విధులు నిర్వహించుకుని ఇంటికి వెళ్తుండగా ఆక్సిడెంట్‌లో చనిపోయారు. వెంటనే విషయం తెలుసుకున్న మున్సిపల్ ఛైర్‌పర్సన్ గడ్డం ఇందు ప్రియా ప్రభుత్వ ఆసుపత్రి వెళ్లి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి వారి కుటుంబనికి రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.

December 25, 2024 / 08:21 AM IST

సికింద్రాబాద్-ముజాఫర్‌పూర్ మధ్య వీక్లీ స్పెషల్స్ రైలు

HYD: సికింద్రాబాద్-ముజాఫర్ పూర్ మార్గంలో జనవరి 7నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు (కొద్దిరోజులు మినహా)వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ముజాఫర్ పూర్ నుంచి సికింద్రాబాద్‌కు జనవరి 7 నుంచి ప్రతీ బుధవారం, సికింద్రాబాద్ నుంచి ముజాఫర్‌పూర్‌కు ఈనెల 9 నుంచి ప్రతీ శుక్రవారం రైళ్లు నడుస్తాయని CPRO శ్రీధర్ తెలిపారు.

December 25, 2024 / 08:21 AM IST

సికింద్రాబాద్-ముజాఫర్‌పూర్ మధ్య వీక్లీ స్పెషల్ రైలు

HYD: సికింద్రాబాద్-ముజాఫర్ పూర్ మార్గంలో జనవరి 7నుంచి తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు (కొద్దిరోజులు మినహా)వీక్లీ స్పెషల్ రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. ముజాఫర్ పూర్ నుంచి సికింద్రాబాద్‌కు జనవరి 7 నుంచి ప్రతీ బుధవారం, సికింద్రాబాద్ నుంచి ముజాఫర్‌పూర్‌కు ఈనెల 9 నుంచి ప్రతీ శుక్రవారం రైళ్లు నడుస్తాయని CPRO శ్రీధర్ తెలిపారు.

December 25, 2024 / 08:21 AM IST

ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలి

MNCL: తాండూర్ మండలంలోని మాదారం టౌన్ షిప్‌లో గత వారం రోజులుగా పంపులు సరిగా పనిచేయక పోవడంతో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారని ఏఐటీయీసీ నాయకులు తెలిపారు. ఈ మేరకు సింగరేణి అధికారులను కలిసి సమస్యను వారి దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకు స్పందించిన అధికారికి రెండు రోజుల్లో మంచినీటి పంపులను సరిచేసి నీటిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.

December 25, 2024 / 08:16 AM IST

నేడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీటి విడుదల

NZB: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ ప్రధాన కాలువ ద్వారా బుధవారం ఉదయం 10 గంటలకు నీటిని విడుదల చేయనున్నట్లు పోచంపాడ్ ఇరిగేషన్ సర్కిల్ SE శ్రీనివాస్ రావు గుప్తా తెలిపారు. ఆన్ అండ్ ఆఫ్ పద్ధతిలో జోన్-1 (D5 నుంచి D53) ఆయకట్టుకు 7 రోజులు, జోన్-2 (D54 నుంచి D94) ఆయకట్టుకు 8 రోజులు సాగునీటి సరఫరా చేస్తామన్నారు.

December 25, 2024 / 08:15 AM IST

ఘనంగా క్రిస్మస్ వేడుకలు

MNCL: జిల్లా కేంద్రంలో బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే పట్టణంలోని చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు స్థానిక హమాలివాడలోని సీఎస్ఐ చర్చిలో క్రైస్తవులను కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

December 25, 2024 / 08:12 AM IST

రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపిక

నిజామాబాద్: నగర శివారులోని గూపన్‌పల్లి ఉన్నత పాఠశాలకు చెందిన మద్దుల శీర్షిక రాష్ట్రస్థాయి ఆర్చరీ పోటీలకు ఎంపికైంది. ఈ పోటీలు నేడు హైదరాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరగనున్నాయి. విద్యార్థినిని పాఠశాల హెచ్ఎం శకుంతల దేవి, ఉపాధ్యాయులు , విద్యార్థులు అభినందించారు.

December 25, 2024 / 08:11 AM IST

మియాపూర్ మెట్రో పార్కింగ్ వద్ద చెత్తా చెదారం

RR: మియాపూర్ మెట్రో పార్కింగ్ వద్ద పరిసరాలు దారుణంగా మారాయి. కల్వరి టెంపుల్ వద్ద చెత్తను క్లియర్ చేసే సిబ్బంది అక్కడే తగలబెట్టడంతో పరిసరాలు అధ్వానంగా కనిపిస్తున్నాయి. వాహనాలు పార్కింగ్ చేసే వారికి, అటువైపుగా వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇంత అస్వచ్ఛంగా ఉన్నా సరే అధికారులు సిబ్బంది చూసి చూడనట్లు వ్యవహరించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు.

December 25, 2024 / 08:11 AM IST

అంగన్వాడి టీచర్ల సస్పెండ్

BNR: చిన్నారులకు ఇవ్వాల్సిన బాలామృతాన్ని పక్కదారి పట్టించారని విచారణలో తేలడంతో జిల్లా కలెక్టర్ హనుమంతరావు అంగన్వాడి టీచర్లను సస్పెండ్ చేశారు. వారి వివరాలిలా.. జిల్లాలో ఓ పశువుల పాకలో బాలామృతం లభ్యమవ్వగా అధికారులు విచారణ జరిపి కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారు. గుట్ట కేంద్రంలో -3,మోత్కూర్‌లోని 7 కేంద్రాల్లోని టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

December 25, 2024 / 08:07 AM IST

‘మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించాలి’

KMR: ఎల్లారెడ్డి మత్స్యకారులు ప్రభుత్వ సహకారంతో ఆర్థికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. లింగంపేట మండలం బాయంపల్లి గ్రామంలో ఐకేపీ ఆర్థిక సహకారంతో చేపల పెంపకం, చేపల దాణా తయారీ, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం యూనిట్లను పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా మత్స్య శాఖాధికారి శ్రీపతి ఉన్నారు.

December 25, 2024 / 08:03 AM IST