NZB: రాబోవు వేసవి కాలానికి విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా అన్ని రకాల నిర్దిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని సర్కిల్ సూపరిండెంట్ ఇంజనీర్ శ్రవణ్ కుమార్ తెలిపారు. గత వేసవి కాలం డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని, రాబోయే వేసవిలో పెరగబోయే డిమాండ్ అంచనా మేరకు ప్రణాళిక బద్ధంగా అంచనాలు సిద్ధం చేస్తామన్నారు. సమయానుగుణంగా తగిన మంజూరును తీసుకుంటామని తెలిపారు.