• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ధర్మారంలో వార్డు సభ్యులకు శిక్షణ కార్యక్రమం

PDPL: ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో వార్డు సభ్యు లకు రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బుధవారం మూడో రోజు కేంద్ర సాధికారిత కోఆర్డినేటర్ దయ అరుణ భేటీ బచావో భేటీ పడావో పథకంపై అవగాహన కల్పించారు. బాలికలను రక్షించడం, వారికి నాణ్యమైన విద్య అందించడం కుటుంబం, సమాజం బాధ్యత అని తెలిపారు.

February 26, 2026 / 05:30 AM IST

నిజాయితీని చాటిన భార్య భర్తలు

MDK: టేక్మాల్ మండల కేంద్రంలో కుర్మ నర్సింలు, లక్ష్మి దంపతులు తమ నిజాయితీని చాటుకున్నారు. కొరంపల్లికి చెందిన పాషా అనే వ్యక్తి పోగొట్టుకున్న పర్సు వీరికి రోడ్డుపై దొరకగా, వెంటనే దానిని పోలీసులకు అందజేశారు. పర్సులోని నగదు, పత్రాలు భద్రంగా ఉండటంతో పోలీసులు దానిని యజమానికి అప్పగించారు. ఈ సందర్భంగా నర్సింలు దంపతులను పోలీసులు ఘనంగా సన్మానించి అభినందించారు.

February 26, 2026 / 05:27 AM IST

ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

MNCL: మందమర్రి పట్టణంలోని ఐటీఐలో ఏఎంకేయూవై 4.0 స్కీమ్ ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సు ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ దేవానంద్ ప్రకటనలో తెలిపారు. కోర్సు కాల పరిమితి మూడు నెలలు ఉంటుందన్నారు. మార్చి 2 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు ఐటీఐ కళాశాలలో సంప్రదించాలన్నారు.

February 26, 2026 / 05:22 AM IST

జిల్లా అదనపు కలెక్టర్ గా హరిప్రియ

MBNR: జిల్లాలో రెవెన్యూశాఖ అధికారులు బదిలీ అయ్యారు. మేడ్చల్ DROగా విధులు నిర్వహిస్తున్న హరిప్రియను మహబూబ్ నగర్ జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్‌గా నియమితులయ్యారు. వెయిటింగ్‌లో ఉన్న అదనపు కలెక్టర్ పద్మజారాణి గద్వాల DROగా నియమితులయ్యారు. గద్వాల హౌసింగ్ PDగా పనిచేస్తున్న శ్రీనివాసరావు RDOగా నియామకంకాగా, RDOగా పనిచేస్తున్న అలివేలు హౌసింగ్ PDగా నియమితులయ్యారు.

February 26, 2026 / 05:13 AM IST

అక్రమ ఇసుక ట్రాక్టర్ల సీజ్

KNR: కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బొమ్మకల్ వద్ద అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను బుధవారం పోలీసులు పట్టుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న రవి, రాములును అదుపులోకి తీసుకున్నట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. వాహనాలను సీజ్ చేసి, నిందితులపై కేసు నమోదు చేశారు.

February 26, 2026 / 05:06 AM IST

విస్తృతంగా పోలీసుల తనిఖీలు

JGL: కోరుట్ల పట్టణంలోని జాతీయ రహదారిపై అరైవ్ ఆలైవ్‌లో భాగంగా బుధవారం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. సీఐ సురేష్ బాబు, ఎస్సై చిరంజీవి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనదారులను ఆపి బ్రెత్ అనలైజర్‌తో పరీక్షలు చేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదన్నారు.

February 26, 2026 / 04:41 AM IST

ప్రజల భద్రతే పోలీసులకు కర్తవ్యం: సీఐ

PDPL: సురక్షిత ప్రయాణం, ప్రజల భద్రతే పోలీసుల కర్తవ్యమని గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి అన్నారు. పట్టణంలోని గాంధీ చౌక్,కార్ టాక్సీ అడ్డా వివిధ ప్రాంతాలలో బుధవారం భారీ వాహనదారుల సీటు బెల్టు తనిఖీ డ్రైవ్ నిర్వహించారు. భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు తప్పనిసరిగా సీటు బెల్ట్ ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలన్నారు.

February 26, 2026 / 04:29 AM IST

అప్రెంటిన్షిప్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

నల్లగొండ రీజియన్ పరిధిలో ఇంజనీరింగ్ మరియు డిప్లొమా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జానీ రెడ్డి తెలిపారు. ఆటోమొబైల్, మెకానికల్ ఇంజనీరింగ్ / డిప్లొమా అభ్యర్థులు NATS వెబ్‌సైట్ https://nats.education.gov.in ను మార్చి 5 వరకు సందర్శించి నమోదు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 75691 18549 సంప్రదించాలన్నారు.

February 25, 2026 / 10:09 PM IST

న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష

SDPT: బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి సిద్దిపేట కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన శంకర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ, అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేశారు.

February 25, 2026 / 09:45 PM IST

సెక్రటరికి వినతి ప్రతం అందజేత

WGL: ఉమ్మడి జిల్లాలోని పాలకుర్తి, మహబూబాబాద్ గిరిజన గురుకుల పాఠశాల & కళాశాలలో నెలకొన్న సమస్యలపై ఇవాళ DSFI ఆధ్వర్యంలో గురుకులాల సెక్రటరీ సీత లక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా DSFI రాష్ట్ర( P) శివ వర్మ మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న మెనూని అందించని అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

February 25, 2026 / 09:21 PM IST

అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి సాయం

HYD: రేణుక నగర్‌కు చెందిన సత్యనారాయణ పక్షవాతం, గుండెపోటుతో అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు షైక్ ఫరీద్, వినీత్ కుమార్ ఆయన కుటుంబానికి 50 కిలోల బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ గుప్త, ఉమేష్ పాల్గొన్నారు.

February 25, 2026 / 09:21 PM IST

డైరీలో భారీ పేలుడు.. ముగ్గురికి తీవ్ర గాయాలు

JN: రఘునాథ్ పల్లి మండలం గోవర్ధనగిరి శక్తి డైరీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. కూలింగ్ ఛాంబర్లోని కంప్రెసర్ పేలడంతో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాజు ముక్కలు శరీరంలోకి చొచ్చుకుపోవడంతో బాధితుల పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 25, 2026 / 09:16 PM IST

పీఎం విశ్వకర్మపై అవగాహన కార్యక్రమం

WNP: పానగల్ మండలంలోని అన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఔత్సాహిక పాల్ సమీక వేతలకు విశ్వకర్మ, పీఎం ఈజిపి స్కీంలపై అవగాహన కల్పించారు. జనరల్ మేనేజర్ జ్యోతి మాట్లాడుతూ.. నిరుద్యోగులకు చేతివృత్తులు చేసుకునే వారికి ఉపయోగపడుతుందని తెలిపారు. నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

February 25, 2026 / 09:06 PM IST

సబ్ కలెక్టర్‌కు సర్పంచ్ ఫిర్యాదు

KMR: ప్రభుత్వ కార్యకలాపాలలో గ్రామ సర్పంచ్‌కు పాలకవర్గంకు భాగస్వాములను చేస్తూ అధికారులు సర్పంచ్‌లకు ఆహ్వానిస్తూ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశాలు ఉన్న డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు పెడచెవిన పెడుతున్నారంటూ సర్పంచులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. బుధవారం బాన్సువాడ సబ్ కలెక్టర్ డాక్టర్ కిరణ్మయికి ఫిర్యాదు చేశారు.

February 25, 2026 / 09:05 PM IST

మొదటి రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం.. 14 మంది గైర్హాజరు

KMR: ఎల్లారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఆదర్శ కళాశాల పరీక్ష కేంద్రాల్లో బుధవారం ఇంటర్ ప్రథమ సంవత్సర (సెట్ “బీ”) తెలుగు, హిందీ, ఉర్దూ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో 246 మందికి 243 మంది, ఆదర్శ కళాశాల కేంద్రంలో 219 మందికి 208 మంది హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.

February 25, 2026 / 08:59 PM IST