• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

వృద్ధుడి ఆత్మహత్య

JGL: పెగడపల్లి మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన రాచకొండ ధర్మయ్య అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. ధర్మయ్య కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. దవాఖానలో చికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. అయినప్పటికీ వ్యాధి నయం కాకపోవడంతో సోమవారం ఇంట్లోనే దూలానికి ఊరు వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు

February 24, 2026 / 08:04 AM IST

రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేదు: బ్రహ్మానంద్

ADB: తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పతంగి బ్రహ్మానంద్ అన్నారు. బాన్స్ వాడలో హిందువులపై జరిగిన దాడిని ఖండిస్తూ పట్టణంలో నిన్న నిరసన కార్యక్రమం చేపట్టారు. రానున్న రోజుల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

February 24, 2026 / 08:03 AM IST

జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన ఎమ్మెల్యే

NLG: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో 99. 56 పర్సంట్తెల్ సాధించిన రేస్ ఐఐటీ మెడికల్ అకాడమీ విద్యార్థులు ముక్కా చరణ్ సాయి గౌడ్, ఐ. కృష్ణ చరణ్, 95.63, సిహెచ్ భాను శంకర్ 94.78 విజయ్ చరణ్ 92.52, జె ప్రవీణ్ 92.16 లను. సోమవారం కోదాడ పట్టణంలో ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

February 24, 2026 / 08:00 AM IST

విద్యార్థులకు చట్టాలపై షీ టీమ్ అవగాహన

NRPT: దామరగిద్ద మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో షీ టీమ్ (SHE Teams) పోలీసులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. మహిళల రక్షణ, సైబర్ నేరాలు, బాల్య వివాహాల నివారణ, ర్యాగింగ్ పై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి స్వయం సమృద్ధి సాధించాలని పోలీసులు బాలరాజ్, చెన్నప్ప, జ్యోతి పేర్కొన్నారు.

February 24, 2026 / 07:56 AM IST

రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో కాంస్య పతకం

NGKL: HYDలోని జి.ఎం.సి. బాలయోగి స్టేడియంలో సైబరాబాద్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోలీస్ క్రీడల్లో జిల్లా పోలీసులు ప్రతిభ చాటారు. లాన్ టెన్నిస్ నాన్-గెజిటెడ్ అధికారుల టీమ్ ఈవెంట్‌లో జిల్లా జట్టు 3వ స్థానం సాధించి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. విజేతలను ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ ప్రత్యేకంగా అభినందించారు.

February 24, 2026 / 07:55 AM IST

‘హత్య కేసులో నిందితుడి అరెస్ట్’

PDPL: రామగిరి మండలం సెంటినరీ కాలనీలో ఇటీవల మొలుగూరి కొమురయ్యపై కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటనలో నిందితుడు బుర్ర రాజ కొమురయ్యను ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేష్ తెలిపారు. పాత కక్షలతో తమ్ముడిపై దాడి చేస్తుండగా అడ్డుకోబోయిన అన్న కొమురయ్య పై దాడి చేయడంతో అక్కడికక్కడే మరణించాడని పేర్కొన్నారు.

February 24, 2026 / 07:55 AM IST

అసంక్రమిత వ్యాధుల నియంత్రణకు శిక్షణ

WNP: అసంక్రమిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా బీపీ, డయాబెటిస్ రోగులకు అందించే సేవలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని వనపర్తి DMHO సాయినాథెడ్డి వైద్య సిబ్బందికి సూచించారు. అందుకు సంబంధించి సోమవారం DMHO కార్యాలయంలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. బీపీ, షుగర్కు మందులను పీహెచ్సీలో అందుబాటులో ఉంచి, జీవనశైలి మార్పులపై అవగాహన పెంచాలన్నారు.

February 24, 2026 / 07:49 AM IST

’25న దివ్యాంగుల కలెక్టరేట్ ముట్టడి’

SRD: దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 25వ తేదీన కలెక్టరేట్ ముట్టడి జయప్రదం చేయాలని దివ్యాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి అడివయ్య మంగళవారం కోరారు. ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన విధంగా దివ్యాంగులకు 6 వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాకు దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

February 24, 2026 / 07:48 AM IST

‘గ్రామపంచాయతీ సిబ్బంది పెండింగ్ వేతనాలు చెల్లించాలి’

NZB: మోపాల్ మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న కారోబార్స్, పారిశుద్ధ్య సిబ్బంది పెండింగ్ వేతనాలను చెల్లించాలని నిజామాబాద్ కలెక్టర్కు సోమవారం వినతిపత్రాన్ని అందజేశారు. గ్రామపంచాయతీలో వేతనాలు లేక కుటుంబ పోషణ కష్టంగా మారిందని వారు తెలిపారు. కుటుంబ సర్వే నిర్వహించి సంవత్సర కాలం గడుస్తున్నా ఎన్యుమరేటర్లు గౌరవ వేతనం అందలేదన్నారు.

February 24, 2026 / 07:47 AM IST

చిన్నారితో ముచ్చటించిన తేజస్ పవర్..

SRPT: అధికారిక పర్యటనలో భాగంగా సోమవారం కోదాడకు వచ్చిన జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సామాన్య ప్రజలతో కలిసిపోయారు. రాజేష్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం తిరిగి వెళ్తుండగా, దారిలో తల్లి ఒడిలో ఉన్న చిన్నారిని చూసి చిరునవ్వుతో పలకరించారు. పాప పేరు అడిగి తెలుసుకున్న కలెక్టర్, ఆమెను అంగన్‌వాడీకి పంపిస్తున్నారా లేదా అని ఆరా తీశారు.

February 24, 2026 / 07:46 AM IST

పరీక్షా కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు: కలెక్టర్

NLG: జిల్లాలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఈనెల 25 నుంచి మార్చి 18 వరకు జరిగే పరీక్షల దృష్ట్యా కేంద్రాల వద్ద బీఎన్ఎస్ఎస్-163 సెక్షన్ అమలు చేయాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. జిల్లాలోని 45 కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.

February 24, 2026 / 07:43 AM IST

దమ్ముంటే నిరూపించండి: ఎంపీ

MBNR: ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఎమ్మెల్యే వెంకటరమణరెడ్డి ఇంటిపై దాడికి కార్యకర్తలను ప్రేరేపించారని సోమవారం MBNR ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కామారెడ్డి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను ఎంపీ పరామర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నిరాధార ఆరోపణలు చేయడం సులభమని, వాటిని రుజువు చేయాలేదంటే క్షమాపణ చెప్పాలన్నారు.

February 24, 2026 / 07:41 AM IST

నేడు పరిగిలో డయల్ యువర్ డీఎం కార్యక్రమం

VKB: ప్రయాణికుల సమస్యల పరిష్కారానికి నేడు ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆర్టీసీ డీఎం కృష్ణమూర్తి తెలిపారు. బస్సు సేవలు, ఇతర ఫిర్యాదుల కోసం ప్రయాణికులు ఉదయం నిర్ణీత సమయంలో 9959225253 నంబర్‌కు నేరుగా కాల్ చేసి సూచనలు ఇవ్వవచ్చని ఆయన పేర్కొన్నారు.

February 24, 2026 / 07:39 AM IST

విద్యుత్ షాక్‌తో మేక, గొర్రె మృతి

JN: లింగాల గణపురం మండలంలోని సిరిపురంలో విద్యుత్ షాక్‌తో రెండు మూగజీవాలు మృతి చెందాయని గ్రామస్థులు తెలిపారు. గ్రామంలోని హనుమాన్ ఆలయం వెనుక ఉన్న విద్యుత్ స్తంభం వద్ద బర్ల ఐలయ్యకు చెందిన ఒక మేక, ఒక గొర్రె మేత మేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాయన్నారు.

February 24, 2026 / 07:36 AM IST

భూ సమస్యల్ని పరిష్కరించాలని వినతి

RR: భూ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిరక్షణ కమిటీ ధర్మన్నగూడ గ్రామ కమిటీ సభ్యులు జిల్లా కలెక్టర్‌కు వినతి అందజేశారు. మాజీ ఎంపీటీసీ గౌర మల్లేశ్ ప్రజలందరిని మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలంతా కలిసి ఐక్యంగా పోరాడి ఆలయ భూమిని దక్కించుకోవాలని తెలిపారు. సభ్యులు శశిధర్ రెడ్డి, నరసింహ, ఇతరులన్నారు.

February 24, 2026 / 07:35 AM IST