• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

బ్రిడ్జి నిర్మించాలని ఎమ్మెల్యే కుంభంకు వినతిపత్రం

BHNG: ధర్మారెడ్డిపల్లి గ్రామస్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. గ్రామంలోని కాలువలపై బ్రిడ్జి లేకపోవడం వల్ల ప్రయాణికులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వివరించారు. వెంటనే బ్రిడ్జి నిర్మించి తమ ప్రయాణ కష్టాలను తీర్చాలని కోరారు.

February 26, 2026 / 01:25 PM IST

తాగునీటి సమస్యకు ముందస్తు చర్యలు

GDWL: పట్టణంలోని 28వ వార్డు ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను దృష్టిలో ఉంచుకుని వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ ముందడుగు వేశారు. వేసవిలో నీటి కొరత పెరుగుతుందన్న అంచనాతో పాత బోర్వేర్లను మరమ్మతులు చేసి తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. పనిచేయకుండా ఉన్న బోర్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేపడుతున్నారు.

February 26, 2026 / 01:22 PM IST

పరీక్షా కేంద్రాల బందోబస్తును పరిశీలించిన జిల్లా ఎస్పీ

MBNR: మహబూబ్‌నగర్‌లో జరుగుతున్న ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం పరీక్షల సందర్భంగా ప్రభుత్వ బాలుర కళాశాల పరీక్ష కేంద్రాన్ని ఎస్పీ డి. జానకి సందర్శించారు. పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పరిశీలించి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కేంద్రం పరిసరాల్లో 144 సెక్షన్ అమలులో ఉందన్నారు.

February 26, 2026 / 01:21 PM IST

తాగునీటి ఎద్దడికి ముందస్తు చర్యలు చేపట్టాలి: కలెక్టర్

NGKL: రాబోయే వేసవి కాలంలో నాగర్‌కర్నూల్ జిల్లాలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని గురువారం జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశించారు. గ్రామ, పట్టణ స్థాయిలలో నీటి పంపులు, పైపులైన్ల మరమ్మతులు, పారిశుధ్య పనులు సకాలంలో పూర్తి చేసి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన అధికారులకు సూచించారు.

February 26, 2026 / 01:20 PM IST

మణిగిళ్ల పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు

WNP: మణిగిళ్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించడానికి సర్పంచ్ పలుస శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. విద్యార్థుల కార్యక్రమాల నిర్వహణ కోసం వేదిక (స్టేజ్) నిర్మాణం, బాలికల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో ఉంచుకుని టాయిలెట్ నిర్మాణం వంటి పనులు చేపట్టారు.

February 26, 2026 / 01:18 PM IST

పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డిబార్

WGL: పర్వతగిరి మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గురువారం నిర్వహించిన ఇంటర్ సెకండియర్ తెలుగు పరీక్షలో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారు అని డిఐఈఓ శ్రీధర్ సుమన్ తెలిపారు. మోడల్ స్కూల్ సెంటర్లో 177 మంది విద్యార్థుల్లో 174 మంది హాజరు అయ్యారు. ఒక్కో సెంటర్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయ్యారు.

February 26, 2026 / 01:18 PM IST

‘పాలిటెక్నిక్ కళాశాల నిర్మాణానికి సహకరించండి’

SRD: పటాన్‌చెరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, హాస్టల్ భవనాల నిర్మాణాలకు సీఎస్ఆర్ నిధులు కేటాయించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని తోషిబా యాజమాన్యాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గురువారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారంలోని తోషిబా పరిశ్రమ ప్రతినిధులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి పనులకు పరిశ్రమ సహకారం కోరారు.

February 26, 2026 / 01:16 PM IST

ఆర్మూర్​ బల్దియా పాలకవర్గం బాధ్యతల స్వీకరణ

NZB: ఆర్మూర్​ మున్సిపల్ పాలకవర్గం గురువారం కొలువుదీరింది. మున్సిపల్ ఛైర్​పర్సన్‌గా గోనె లహరి, వైస్ ఛైర్మన్​గా కాటిపల్లి వెంకటరెడ్డితో పాటు కౌన్సిలర్లు బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కమిషనర్ ఉమామహేశ్వరరావు ఛైర్​పర్సన్​, వైస్ ఛైర్మన్​లతో సంతకాలు చేయించారు. ఈ కార్యక్రమంలో మినరల్స్ రాష్ట్ర ఛైర్మన్ ఈరవత్రి అనిల్, పాల్గొన్నారు.

February 26, 2026 / 01:16 PM IST

ఇంటర్ విద్యార్థులకు ప్రత్యేక హెల్ప్‌లైన్

VKB: TGBIE స్టూడెంట్స్ & పేరెంట్స్ కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ ప్రారంభించింది. పరీక్షలు, హాల్ టికెట్లు, ఫలితాలు వంటి అంశాలపై మార్గదర్శనం, సందేహాలు నివృత్తి కోసం విద్యార్థులు కాల్ చేయవచ్చు. ఎగ్జామినేషన్ కంట్రోలర్ జయప్రదాభాయ్ పేర్కొన్నారు. హెల్ప్‌లైన్ నంబర్లు: 040-24655027, IVR 9240205555. విద్యార్థులు అవసరమైన సాయం కోసం వెంటనే సంప్రదించవచ్చని సూచించారు.

February 26, 2026 / 01:14 PM IST

కుమారుడు పెళ్ళికి రావాలని KLRకు ఆహ్వాన పత్రిక ఇచ్చిన Dy.CM

RR: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మా రెడ్డి నివాసానికి వచ్చారు. ఈనెల 5న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్లికి రావాలని కేఎల్‌ఆర్ దంపతులను ఆహ్వానించారు. కాసేపు నియోజకవర్గ అభివృద్ధిపై  ముచ్చటించారు.

February 26, 2026 / 01:09 PM IST

పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ

కామారెడ్డి పట్టణంలోని పలు ఇంటర్ పరీక్షా కేంద్రాలను SP రాజేశ్ చంద్ర పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలు రాయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని అన్నారు.

February 26, 2026 / 01:07 PM IST

వికారాబాద్ కొత్త అడిషనల్ కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్

వికారాబాద్ జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌గా ఉమాశంకర్ ప్రసాద్ నియమితులయ్యారు. ఇప్పటివరకు తాండూరు సబ్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయనకు నారాయణపేట జిల్లా ఎఫ్ఏసీ అదనపు కలెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహించామని అధికారులు తెలిపారు. తాజాగా ప్రభుత్వం బదిలీలలో ఆయనను వికారాబాద్ అడిషనల్ కలెక్టర్‌గా నియమించింది.

February 26, 2026 / 01:04 PM IST

శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు

JGL: మల్యాల మండలం లంబాడిపల్లె గ్రామంలోని వెంకటేశ్వరస్వామి దేవస్థానంలో ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు జరుగుతున్నట్లు ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఈనెల 26 నుంచి 28 వరకు జరిగే ఈ వేడుకల్లో భాగంగా, మొదటిరోజు విశ్వక్సేన పూజ, స్వస్తి పుణ్యాహవచనము, రక్షాబంధనము తదితర పూజా కార్యక్రమాలతో ప్రారంభమై, చివరి రోజు 28న శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు.

February 26, 2026 / 01:03 PM IST

నిరుపయోగంగా ఓపెన్ జిమ్ పరికరాలు

KMR: గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ నిరుపయోగంగా మారిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. సుమారు రూ. 2 లక్షల వ్యయంతో మూడు పరికరాలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రజలకు కనబడని చోట ఉంచడంతో వినియోగం లేకపోతోందని అంటున్నారు. ప్రజాధనం వృథా అయిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెంటనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని యువకులు డిమాండ్ చేస్తున్నారు.

February 26, 2026 / 01:02 PM IST

ఇందిరమ్మ ఇళ్ళు, సీసీ రోడ్డు ప్రారంభించిన ఎమ్మెల్యే BLR

NLG: వేములపల్లి మండలం తిమ్మారెడ్డిగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ళు లబ్ధిదారులు సూర్యపెల్లి జ్యోతి శ్రీను నూతన ఇందిరమ్మ ఇళ్ళు ను  ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామంలో సీసీ రోడ్లు పనులకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.

February 26, 2026 / 01:01 PM IST