VKB: బషీరాబాద్ మండలం దామర్చేడ్ గ్రామంలోని చెరువులు విపరీతంగా లొట్టాపీచు (బేషారం) మొక్కలతో నిండిపోయాయి. దీనివల్ల నీరు కలుషితంమై మత్స్యకారులకు, పంటలకు నష్టం కలుగుతుందని గ్రమస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే చెరువుల పొదలను తొలగించి, నీటిని శుభ్రం చేయాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
MBNR: గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామంలోని జామా మసీదులో రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉపవాస-దీక్షలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొని మండల కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ దోమ పులిందర్ రెడ్డి, మాజీ సర్పంచ్ పుల్ల రెడ్డి రమేష్ చారి, రాములు గౌడ్, బాలయ్య షేక్ అలీ, ఇజాజ్ పాషా తదితరులు ముస్లిం సోదరులతో ఆనందంగా పంచుకున్నారు.
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో జిల్లా ఆరే కుల సంఘం అధ్యక్షుడు వంచనగిరి వీరేశం, రాష్ట్ర నాయకులు మటికే సంతోష్, మండల అధ్యక్షుడు తిరుపతి ఆధ్వర్యంలో ఆరే కుల సంఘం నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడిగా ఓన్నాల శివాజీ, ఉపాధ్యక్షులుగా రాజేందర్, శ్యాం రావు, గౌ.అధ్యక్షుడిగా తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా గణేష్ను ఎన్నుకున్నారు.
NZB: జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు)గా పని చేస్తున్న అంకిత్ (2019 బ్యాచ్) కలెక్టర్‌గా బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 మంది IAS అధికారులను బదిలీ చేస్తూ CS రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు అంకిత్‌ను భద్రాద్రి కొత్త గూడెం కలెక్టర్‌గా నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
JGL: రాయికల్ మండలం అల్లిపూర్ గ్రామ పంచాయతీలో బుధవారం డీఎల్పీవో, ఎంపీవోలు పారిశుధ్య పనులు, రికార్డులను తనిఖీ చేశారు. గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గౌతమి అధికారులను శాలువాతో సత్కరించారు. పంచాయతీ కార్మికులకు ప్రోత్సాహకంగా సబ్బులు, నూనెలు, బెల్లం పంపిణీ చేశారు.
KNR: జమ్మికుంటలో ఈరోజు ఉదయం 11 గంటలకు సీపీ గౌస్ ఆలం ఆధ్వర్యంలో వినాయక ఫంక్షన్ హాల్లో మోటారు వాహనాల డ్రైవర్ల కోసం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ తెలిపారు.హెవీ గూడ్స్, ఆటో ట్రాక్టర్ డ్రైవర్లు శిబిరానికి హాజరై పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అవసరమైన వారికి ఉచిత కళ్లజోడు కమిషనర్ చేతుల మీదుగా పంపిణీ చేస్తారని అన్నారు.
HYD: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్ ఆధ్వర్యంలో యూత్ 4 జాబ్స్ సహకారంతో దివ్యాంగుల కోసం ప్రత్యేక జాబ్ మేళా ఈనెల 27న సికింద్రాబాద్‌లోని NIEPID క్యాంపస్‌లో జరగనుంది. అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా, ఆధార్ కార్డు, దివ్యాంగ ధృవీకరణ పత్రం లేదా UDID కార్డు, విద్యార్హత సర్టిఫికేట్లు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలన్నారు.
MLG: రాష్ట్ర ప్రభుత్వం భారీగా కలెక్టర్‌ను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీల్లో ఏటూరునాగారం ITDA ప్రాజెక్టు అధికారి చిత్ర మిశ్రాను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా నియమించారు. చిత్ర మిశ్రా 2019లో ఏటూరునాగారం ITDA POగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు చిత్ర మిశ్రాకు శుభాకాంక్షలు తెలిపారు.
MDCL: ఉప్పల్లో ఇంటర్మీడియట్ పరీక్షకు వచ్చిన ఓ విద్యార్థినికి సెంటర్ తెలియక ఉప్పల్ చౌరస్తా వద్ద ఆందోళనతో ఏడుస్తూ ఉండగా.. అక్కడే విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ 3656 శ్రీనివాస్ పరిస్థితి తెలుసుకుని వెంటనే స్పందించారు. తన బైక్ పై కేవలం 3 నిమిషాల్లోనే విద్యార్థినిని శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్, ఐడిఏ ఉప్పల్‌కు సురక్షితంగా చేర్చారు.
BDK: చుంచుపల్లి మండలం కంకర మిల్లు సమీపంలో ఓ కంటైనర్‌లో నిషేధిత గంజాయి తరలిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు గురువారం తనిఖీ నిర్వహించారు. ఓ కంటైనర్ను తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు తేలింది. దీంతో ఆ కంటైనర్ను పోలీస్ స్టేషన్‌కు తరలించి డ్రైవర్ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
NLG: దేవరకొండ పట్టణంలో మూడవ వార్డు శాలిబండలో ఒక విద్యుత్ స్తంభం గాలి దుమారానికి వంగిపోయి కూలిపోయే స్థితికి చేరింది. ఇది ఎప్పుడైనా ఇళ్లపై పడే అవకాశం ఉండటంతో స్థానికులు ముఖ్యంగా చిన్న పిల్లల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. స్తంభం పక్కనే కొత్తది అందుబాటులో ఉన్నందున కనెక్షన్లను దానికి మార్చి పాత స్తంభాన్ని తొలగించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
SDPT: సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ అశ్రిత్ కుమార్ ఆదేశాల మేరకు పట్టణంలో పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయి. పట్టణంలోని పలు కాలనీలలో నిండుకున్న డ్రైనేజీలు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తున్నారు. ప్రధాన రోడ్లపై ఉన్న చెత్తాచెదారం మట్టిని తొలగించారు. ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలించారు.
HYD: రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైలుకు బొల్లారం స్టేషన్‌లో స్టాపేజ్ కల్పించారు. తిరుపతి నుంచి సాయంత్రం 5:35 బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5:40 సమయానికి సికింద్రాబాద్ చేరుకుంటుంది. బొల్లారం వచ్చేసరికి ఉదయం 6:15 అవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. తిరుగు ప్రయాణంలో బొల్లారంలో సాయంత్రం 4:09 గంటలకు రైలు అందుబాటులో ఉంటుందని SCR అధికారులు తెలిపారు.
KMM: ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి జి. నరసింహారావును జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి బదిలీ చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి లోకేష్ కుమార్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో మెట్‌పల్లిలో విధులు నిర్వర్తిస్తున్న ఎన్.శ్రీనివాస్ను ఖమ్మం ఆర్డీఓగా నియమించారు. పరస్పర బదిలీల్లో భాగంగా ఈ నియామకాలు జరిగాయి.
BDK: భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ బదిలీ అయినట్లు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా భద్రాద్రి జిల్లాకు నూతన కలెక్టర్గా నిజామాబాద్ అదనపు కలెక్టర్గా పని చేస్తున్న అంకిత్‌ను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. టీజీ ఎన్పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్గా ప్రస్తుత కలెక్టర్ జితేష్ వి పాటిల్ను నియమించారు.