RR: గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమైందని ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో షాద్‌నగర్ నియోజకవర్గంలోని సర్పంచ్‌లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులకు ఆయన హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పారిశుద్ధ్యం, మౌలిక వసతుల ఏర్పాట్లకు ముందుండి ప్రజలను మెప్పించి మరింత ఉన్నత పదవులకు చేరుకోవాలన్నారు.
MDK: రెండవ విడత అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మెదక్ ఆర్టీసీ డిపోలో కంటి పరీక్షల శిబిరాన్ని అదనపు ఎస్పీ మహేందర్, ఆర్టీసీ డీఎం సురేఖ, సీఐ మహేష్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌లు ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించాలని కోరారు. నియమాలను పాటించడంతో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
SRPT: కోదాడ పట్టణ పారిశుద్ధ్యానికి ప్రజలు సహకరించాలని కోదాడ మున్సిపల్ ఛైర్‌పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు అన్నారు. శుక్రవారం కోదాడ మున్సిపల్ పరిధిలోని ఆరో వార్డు గోపిరెడ్డి నగర్‌లో కౌన్సిలర్ తుమ్మల నాగేంద్రమ్మతో కలిసి దోమల మందు పిచికారీలు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పారిశుద్ధ్యంలో కోదాడ పట్టణాన్ని జిల్లాలో అగ్ర స్థానంలో నిలుపుతామన్నారు.
HYD: డయాలసిస్ కోసం వచ్చిన సాగర్ మృతిచెందడంతో పుప్పాలగూడలోని మెడికవర్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఘటనపై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఐదుగురు వైద్యులతో ప్రత్యేక బృందం పోస్టుమార్టం నిర్వహించారు.
BDK: బూర్గంపాడు గ్రామంలోని శ్రీ శ్రీ శ్రీ గంగా పార్వతి సమేత అగస్త్యేశ్వర స్వామి వారి దేవాలయంలో నూతన ధ్వజస్తంభ పునఃప్రతిష్ట, మహోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రాంత ప్రజల సుఖశాంతి, ఐశ్వర్యాల కోసం ప్రార్థనలు చేసినట్లు తెలిపారు.
BDK: విద్యార్థులకు అందుతున్న మధ్యాహ్న భోజన నాణ్యతను సర్పంచ్ ప్రేమేందర్ నాయక్ పరిశీలించారు. లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్ ప్రభుత్వ పాఠశాలను శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని ప్రధానోపాధ్యాయురాలు భద్రమ్మ కోరగా, సర్పంచ్ సానుకూలంగా స్పందించి త్వరలోనే పనులు చేపడతామని హామీ ఇచ్చారు.
SRCL: వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి, అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ జయంత్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు.
BDK: అశ్వరావుపేట నియోజకవర్గంలో శుక్రవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దమ్మపేట మండలం పూసుకుంట, ఆర్లపెంట గ్రామంలో డ్వాక్రా మహిళల కోసం కమ్యూనిటీ భవన నిర్మాణం, జడ్పీ స్కూల్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుధాపల్లి, పాతలచ్చాపురం గ్రామంలో సీసీ రోడ్లు పనులకు శంకుస్థాపన చేశారు.
KMR: జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నట్లు నోడల్ అధికారి షేక్ సలాం తెలిపారు. శుక్రవారం జరిగిన ప్రథమ సంవత్సర పరీక్షకు 9,572 మంది విద్యార్థులకు గాను 9,258 మంది హాజరయ్యారని, 314 మంది గైర్హాజరయ్యారని వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాయాలని సూచించారు.
KMR: దోమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం మొదటి సంవత్సర ఇంగ్లీష్-I (సెట్–C) పరీక్షను విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 140 మంది విద్యార్థులకు 136 మంది హాజరయ్యారు. జనరల్ విభాగంలో 116 మంది విద్యార్థులకు 115 మంది, వొకేషనల్ విభాగంలో 24 మందికి గానూ 21 మంది పరీక్ష రాశారు. నలుగురు గైర్హాజరయ్యారని కళాశాల ప్రిన్సిపల్ శంకర్ తెలిపారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బస్టాండ్ నుంచి ఓల్డ్ చెకోపోస్ట్ వరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను జిల్లా SP నీతికా పంత్ శుక్రవారం ప్రారంభించారు. SP మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు CC కెమెరాలు మూడవ కన్నులా పనిచేస్తాయని తెలిపారు. ఒక్క CC కెమెరా 100 మంది పోలీసులతో సమానం అని పేర్కొన్నారు.
SRD: కంగి మండలంలోని ముర్కుంజాల్లో సర్పంచ్ సారంగి అనుష ఆహ్వానం మేరకు, లయన్స్ క్లబ్ ఖేడ్ శాఖ సౌజన్యంతో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఓ ఆసుపత్రి బృందం గ్రామస్థులకు పరీక్షలు చేసి, అవసరమైన వారికి ఉచిత శస్త్రచికిత్సలు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సాయి రెడ్డి, సాయ గౌడ్, లాల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
KNR: శంకరపట్నం మండలంలోని తాడికల్ రైతు వేదికలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులకు 5 రోజులుగా శిక్షణా తరగతులు కొనసాగుతున్నాయి. ఎంపీవో ప్రభాకర్ అధ్యక్షతన జరిగుతున్న ఈ కార్యక్రమంలో కొత్తగట్టు, గొల్లపల్లి, లింగాపూర్‌తో సహా 12 గ్రామాల సభ్యులకు పంచాయతీరాజ్ చట్టం-2018పై అవగాహన కల్పించారు. నేటితో ఓరియంటేషన్ శిక్షణ ముగియనుంది.
ADB: బోథ్ మండలంలోని కౌట బీ గ్రామంలో గల శ్రీ శబరిమాత ఆశ్రమంలో జరుగుతున్న 14వ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్యఅతిథిగా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. నియోజకవర్గంలో శబరిమాత భక్తులు ఎక్కువగా ఉన్నారని, ప్రజలు ఎల్లప్పుడూ ఇలాగే శాంతి, భక్తి మార్గంలో నడవాలని అన్నారు.
BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం అన్నదాన సత్రాన్ని శుక్రవారం ఆలయ ఈవో దామోదర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. అన్న ప్రసాదం తయారీ, పంపిణీ విధానాన్ని పరిశీలించారు. పరిశుభ్రత మరియు నాణ్యత విషయంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. అన్నప్రసాదానికి వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి తెలిపారు.