• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

ఇంటర్ పరీక్షా కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్

KNR: జిల్లాలో కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా సోమవారం తనిఖీ చేశారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ కళాశాల, భగత్ నగర్‌లోని అల్ఫోర్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను, సీసీ కెమెరా వ్యవస్థను పరిశీలించారు.

March 2, 2026 / 03:52 PM IST

ఘనంగా రాష్ట్ర యువజన అధ్యక్షుడు జన్మదిన వేడుకలు

BHPL: జిల్లా కేంద్రంలో ఇవాళ తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు జిల్లా యువజన అద్యక్షుడు శ్రీకాంత్ పాణి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ నేతలు కేక్ కట్ చేసి.. శివ చరణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అమృత వర్షిణి అనాధ వృద్ధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.

March 2, 2026 / 03:48 PM IST

‘హెల్మెట్ బ్యాంక్’ ద్వారా ద్విచక్ర వాహనదారులకు చైతన్యం

MDCL: మల్కాజ్‌గిరి పరిధిలోని నేరేడ్మెట్ వాయుపురిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్ ధరించని రైడర్లకు కౌన్సెలింగ్ ఇచ్చి, ‘హెల్మెట్ బ్యాంక్’ ద్వారా తాత్కాలిక హెల్మెట్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

March 2, 2026 / 03:47 PM IST

‘ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి’

BHPL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పాల్గొని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ ఉన్నారు.

March 2, 2026 / 03:47 PM IST

‘శ్రీపాద రావు సేవలు చిరస్మరణీయం’

MDK: స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయమని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీపాదరావు జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు. దుద్దిళ్ల శ్రీపాదరావు సౌమ్య స్వభావం, సరళ జీవనశైలి కలిగిన నాయకుడిగా ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములై ప్రజానాయకునిగా గుర్తింపు పొందారన్నారు.

March 2, 2026 / 03:46 PM IST

ఘనంగా శివచరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు

BHPL: రేగొండ మండల కేంద్రంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జక్కిడి శివ చరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల యువజన అద్యక్షుడు క్రాంతి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ నేతలు కేక్ కట్ చేసి.. శివ చరణ్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం స్థానిక PHCలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

March 2, 2026 / 03:46 PM IST

వైద్యురాలిని బురిడీ కొట్టించిన సైబర్ నేరగాళ్లు

HYD: ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.10 లక్షలు కాజేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. బంజారాహిల్‌కు చెందిన ఓ వైద్యురాలు ఆన్‌లైన్ ట్రేడింగ్ ప్రకటన చూశారు. అనంతరం వాట్సాప్‌లలో సైబర్ నేరగాళ్లు ఆమెను సంప్రదించారు. మొదటగా రూ.10,000 పెట్టిన బాధితురాలు లాభాలు రావడంతో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టింది. దీంతో నేరగాళ్లు అదును చూసి జండా ఎత్తేశారు. 

March 2, 2026 / 03:45 PM IST

‘పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తాం’

VKB: కొండాపూర్ పాఠశాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ప్రధానోపాధ్యా యుడు గోబ్ర్యా నాయక్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. సహచర ఉపాధ్యాయుల కృషితో పాఠశాలకు స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ రేటింగ్‌‌లో జిల్లా స్థాయి అవార్డు వచ్చిందని తెలిపారు.

March 2, 2026 / 03:45 PM IST

కృష్ణవేణిని సన్మానించిన..MPDO, సర్పంచ్

MHBD: గంగారం మండలం తిరుమలగండి గ్రామం నుంచి జాతీయస్థాయి క్రికెట్ ఎంపికైన కృష్ణవేణిని సోమవారం MPDO వైష్ణవి, సర్పంచ్ కృష్ణారావు, కార్యదర్శి గోపీచంద్, HM ఆనందరావు సన్మానించారు. ఈ సందర్భంగా వారు కృష్ణవేణికి ఆర్థిక ప్రోత్సాహకంగా రూ. 7,000 అందజేశారు. ఈ కార్యక్రమంలో సెహగల్ కమ్యూనిటీ మొబైల్ (SM) కవిత, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

March 2, 2026 / 03:44 PM IST

‘ఇంటింటికి కృష్ణ వాటర్ అందించడమే లక్ష్యం’

NLG: రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకుని చిట్యాల మండలం చిన్నకాపర్తిలో ఇంటింటికీ సాగర్ నీరు అందించడమే లక్ష్యంగా సర్పంచ్ ఆవుల సుందర్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పంచాయతీ పరిధిలోని పైప్‌లైన్లకు మరమ్మతులు చేయించి, కొత్తగా 5 గేట్ వాల్స్‌ను ఏర్పాటు చేశామని తెలిపారు. వార్డుల్లో ప్రధాన పైప్‌లైన్లను సరిచేసి ఇవాళ నీటి సరఫరాను ప్రారంభించారు.

March 2, 2026 / 03:44 PM IST

‘శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు’

MBNR: జిల్లాలో హోలీ పండుగను సహజ రంగులతో ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ డి.జానకి సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, బలవంతంగా రంగులు చల్లడం, ర్యాష్ డ్రైవింగ్ వంటి చర్యలు చేయరాదన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అత్యవసర సమయంలో డయల్-100 లేదా 8712659360ను సంప్రదించాలని సూచించారు.

March 2, 2026 / 03:44 PM IST

నేడు కొత్తూరులో కామ దహనం

RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద ఈరోజు రాత్రి 8 గంటలకు కామ దహన కార్యక్రమం జరుగుతుందని మున్సిపల్ ఛైర్ పర్సన్ బాతుక లావణ్య దేవేందర్ యాదవ్ తెలిపారు. కామ దహన కార్యక్రమంలో వైస్ ఛైర్మన్, కౌన్సిలర్లు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అదేవిధంగా 4వ తేదీన హోలీ పండుగ జరుపుకోవాలని తెలిపారు.

March 2, 2026 / 03:41 PM IST

‘ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తాం’

ASF: ప్రజావాణి కార్యక్రమంలో అందిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరమే పరిష్కరిస్తారని కలెక్టర్‌ హరిత అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అర్జీ దారుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయా శాఖల అధికారులకు కలెక్టర్ సూచించారు.

March 2, 2026 / 03:40 PM IST

ఎల్లారెడ్డి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు

KMR: ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలను సోమవారం ఇంటర్ బోర్డు అధికారులు తనిఖీ చేశారు. రాష్ట్ర పరిశీలకులు రమేశ్, అబ్దుల్ నబీ ఆకస్మికంగా సందర్శించి పరీక్షలు నిర్వహణ, గదుల ఏర్పాటు, విద్యార్థులు కల్పిస్తున్న సౌకర్యాలు, ప్రశ్నపత్రాల భద్రతపై ఆరా తీశారు. అనంతరం సీసీ కెమెరాల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.

March 2, 2026 / 03:39 PM IST

కట్ర్యాలలో ఐచర్ ట్రాక్టర్ చోరీ

WGL: వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామంలో ఆదివారం రాత్రి ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ఐషర్ 380 ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. ఈ ఘటనపై బాధితుడు సయ్యద్ కరీం సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రాక్టర్‌ను వెతికేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దింపినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

March 2, 2026 / 03:39 PM IST