MLG: మల్లూరులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఇవాళ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఆలయం మూసివేసి, గ్రహణానంతరం మార్చి 4న సంప్రోక్షణ పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. గ్రహణ సమయంలో ఎలాంటి పూజలు ఉండవని, భక్తులు గమనించాలని నిర్వాహకులు కోరారు.
KNR: వీణవంక మండలం ఎలబాక గ్రామానికి చెందిన బావు వేదశ్విని(18) కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి కన్నుమూసింది. వేదశ్విని అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
BHPL: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు వివిధ కోర్సుల్లో ఉచిత నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ GM సిద్ధార్థ తెలిపారు. DEET, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ సహకారంతో వైఎస్కే ఇన్ఫోటెక్ ఈ శిక్షణను అందిస్తుంది. శిక్షణ పూర్తి చేసుకున్న వారికి ఉద్యోగ గ్యారంటీ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 22లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
RR: యాసంగి పంట సాగుకు యూరియా బస్తాల పంపిణీ ఇవాళ ఉంటుందని కందుకూరు వ్యవసాయ శాఖ తెలిపింది. కందుకూరులోని సొసైటీ ఆఫీస్ వద్ద ఉదయం10 గంటలకు రైతులకు యూరియా బస్తాలు పంపిణీ చేయనున్నారు. రైతులు యూరియా (ఫెర్టిలైజర్) ఆప్‌లో బుక్ చేసుకుని తర్వాత తమ పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు తీసుకురావాలంటూ తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
MDCL: ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం జరిగిన నేపథ్యంలో స్టాక్ మార్కెట్‌లో రేపు పక్కాగా లాభాలు సాధించవచ్చని అనేకమంది నాచారం పరిధి రాఘవేంద్ర నగర్, మల్లాపూర్ వెంకటేశ్వర స్వామి నగర్ కాలనీ ట్రేడర్లకు ఫేక్ కాల్స్ వస్తున్నట్లుగా తెలిపారు. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా, అలాంటి వాటిని నమ్మితే, మోసం జరిగే అవకాశం ఉందన్నారు.
SRPT: యాసంగి సీజన్‌కు గాను వారబందీ విధానంలో జిల్లాకు 1,700 క్యూసెక్కుల గోదావరి జలాలు విడుదల చేస్తుండగా శనివారం వాటిని 1,613 క్యూసెక్కులకు తగ్గించారు. ప్రస్తుతం వస్తున్న నీళ్లను వృథా చేయకుండా పంటలకు వాడుకోవాలని జలవనరుల శాఖ ఈఈ సత్యనారాయణగౌడ్, ఏఈ చంద్రశేఖర్ రైతులకు సూచించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో చికెన్ ధరలు ఆదివారం ఈ విధంగా ఉన్నాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో స్కిన్ చికెన్ కేజీ ధర రూ. 257 నుంచి రూ.260 మధ్య ఉండగా, స్కిన్లెస్ చికెన్ కేజీ ధర రూ. 292 నుంచి రూ. 300 వరకు పలుకుతోంది. గత వారంతో పోలిస్తే రూ. 20 వరకు పెరిగింది
నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలోని ఐదేళ్ల ఇంటిగ్రేట్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ పరీక్షల సమయం పట్టికను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. 8వ సెమిస్టర్ (రెగ్యులర్ బ్యాక్ లాగ్) పరీక్షలు మార్చి 11 నుంచి 20వ తేదీ వరకు జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలియజేశారు.
NZB: భద్రాచలంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవ పవిత్ర తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసేందుకు TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శనివారం బోధన్ డిపోలో దీనికి సంబంధించిన పోస్టర్లను డీఎం విశ్వనాథ్ ఆవిష్కరించారు. కేవలం రూ.151 చెల్లించి కార్గో సేవల ద్వారా నమోదు చేసుకుంటే నేరుగా భక్తుల ఇళ్లకు తలంబ్రాలు డెలివరీ చేస్తామని ఆయన తెలిపారు.
KMR: భిక్కనూర్‌లోని సిద్ధరామేశ్వర స్వామి ఆలయంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు మార్చి 7 నుంచి 11 వరకు జరగనున్నాయి. భువనేశ్వరీ సహిత స్వామి వారికి పుణ్యహవాచనం, అంకురార్పణం, రుద్రాభిషేకం, కల్యాణోత్సవం, విమాన రథోత్సవం, అవభృథ స్నానం నిర్వహించనున్నారు. అగ్నిగుండాలు, వీరభద్ర ప్రస్తావన, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
MDK: B V Raju Institute of Technology, నర్సాపూర్‌లో “మెకానికల్ బాజా SAE ఇండియా 2026” మూడో రోజు స్టాటిక్, డైనమిక్ ఈవెంట్స్ ఉత్సాహంగా సాగాయి. 42 వాహనాలు టెక్నికల్ ఇన్స్పెక్షన్ పూర్తి చేయగా, 35 బగ్గీలు బ్రేక్ టెస్ట్ ఉత్తీర్ణులై ఫైనల్ ఎండ్యూరెన్స్‌కు అర్హత సాధించాయి. అనుభవాధారిత విద్యపై ప్యానల్ చర్చ జరిగింది. ఆదివారం నుంచి ఫైనల్ రేస్ జరగనుంది.
JN: జిల్లా కేంద్రానికి నేడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి రానున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసిన భరోసా సెంటర్‌ను ఆయన ప్రారంభించనున్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు. భరోసా సెంటర్ ద్వారా బాధితులకు న్యాయ, మానసిక, వైద్య సహాయ సేవలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు.
MBNR: రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి జాతీయ రహదారి వద్ద అండర్ పాస్ నిర్మించాలని కోరుతూ రాయపల్లి సర్పంచ్ గాయత్రి మల్లేశ్ గౌడ్, ఉప సర్పంచ్ ప్రవీణ్ గౌడ్ ఎంపీ డీకే అరుణను కలిసి వినతిపత్రం అందజేశారు. బ్రిడ్జి నిర్మాణంతో స్థానికులకు ఇబ్బందులు కలగకుండా అండర్ పాస్ అవసరమని వివరించారు. అలాగే రాయపల్లి గ్రామానికి సీసీ రోడ్లు మంజూరు చేయాలని వారు కోరారు.
KNR: శంకరపట్నం మండలం కేశవపట్నం రైతు వేదికలో ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్పై మండల స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. యూరియా విక్రయాలు పూర్తిగా బుకింగ్ యాప్ ద్వారానే జరగాలని, యూరియా వచ్చిన రోజు ఉదయం 9, మధ్యాహ్నం 12 లేదా సాయంత్రం 4 గంటలకు మాత్రమే ఆన్ లైన్‌లో బుకింగ్ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ కొత్త విధానం రైతుల సౌకర్యం కోసమే అమలు చేస్తున్నారు.