GDWL: ఇంటర్ పరీక్షలు రాసేందుకు విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతిపాదిత కళాశాలల కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు ఉండాలని జిల్లా కలెక్టర్ బి. ఎం. సంతోష్ అన్నారు. ఈ నెల 25 నుంచి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో సోమవారం గద్వాలలో ప్రభుత్వ మహిళ జూనియర్ కళాశాలల్లో పరీక్షల ఏర్పాటు కేంద్రాలను కలెక్టర్ పరిశీలించారు.
MNCL: జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చీఫ్ సూపర్డెంట్ బాపురావు తెలిపారు. సోమవారం వారు మాట్లాడుతూ.. బుధవారం నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు. మొదటి సంవత్సరంలో 125 మంది, రెండో సంవత్సరంలో 120 మంది మొత్తం 245 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
NRPT: కావలి మల్లప్ప అనే రైతు మద్దూరు శివారు కాజీపురం రోడ్డులోని పొలం వద్ద 4 ఎద్దులను గుడిసెలో కట్టివేశాడు. దోమల బెడద తగ్గించేందుకు ఆదివారం మంట పెట్టి రాత్రి 9:30 గంటలకు ఇంటికి వెళ్లాడు. ఇదే సమయంలో గుడిసెకు మంటలు అంటుకుని పూర్తిగా దగ్ధమైంది. దీంతో గుడిసెలో ఉన్న 3 ఎద్దులు తాడు తెంచుకుని బయటపడగా, ఒక ఎద్దు అక్కడికక్కడే కాలిపోయి మృతిచెందింది. దీంతో రైతు కన్నీరుమున్నీరుగా విలపించాడు.
NZB: రాష్ట్రంలో గిరిజన అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ధర్పల్లిలోని శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ ఆలయ ఐదవ వార్షికోత్సవం సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండల కాంగ్రెస్ నాయకులతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
BDK: బూర్గంపహాడ్ మండలం, బట్టిగూడెం గ్రామంలో పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్న ప్రజలు ఫారెస్ట్ అధికారుల చర్యలపై సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యను ఉప సర్పంచ్ భూక్య మోహన్ రావుకు తెలియజేయగా, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు తమ జీవనాధారాన్ని కాపాడాలని అధికారులను కోరుతున్నారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలో సోమవారం BJP మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్ ఆధ్వర్యంలో BJP నాయకులు నల్లబ్యార్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు గుండా గురిని ఖండిస్తూ నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే షబ్బీర్ అలీని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కార్యకర్తలు ఉన్నారు.
MNCL: లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మణరావు అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ బుధవారం నుండి ఇంటర్ ప్రధమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయని తెలిపారు. మొదటి సంవత్సరంలో 453, ద్వితీయ సంవత్సరంలో 211 మొత్తం 463 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని వివరించారు.
MNCL: జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎండి.అస్మా రాష్ట్రస్థాయి కరాటే పోటీలలో విజేతగా నిలిచారు. అస్మా రాష్ట్ర స్థాయిలో జరిగిన కరాటే పోటీలలో మూడో స్థానంలో సాధించారు. దీంతో నిర్వాహకులు ఆమెకు ట్రోఫీతో పాటు రూ.5000 నగదు బహుమతిని అందజేశారు. ఆమెను కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, అధ్యాపకులు అభినందించారు.
SDPT: అక్కన్నపేట(M) మల్లంపల్లిలో నిర్మించిన పల్లె దవాఖానా ప్రారంభానికి ముందే శిథిలావస్థకు చేరుకుంది. భవన నిర్మాణ పనులు పూర్తికాకముందే తలుపులు, కిటికీలు ఊడిపోయి భద్రతా సమస్యలు తలెత్తుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు లేకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
MNCL :కన్నెపల్లి మండలం జంగంపల్లికి చెందిన టకిరే నాగేశ్ (23) సోమవారం పంటలకు వాడే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, మూడేళ్ల కుమార్తెతో పాటు 3నెలల శిశువు ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్న కుటుంబంలో నాగేశ్ మరణం తీవ్ర విషాదాన్ని నింపింది.
NRML: జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాలలో విద్యుత్ మీటర్ల బిగింపు ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. జిల్లాలోని మొత్తం 381 అంగన్‌వాడీ కేంద్రాలకు మీటర్లు అవసరమవగా, ఇప్పటికే 290 కేంద్రాల్లో మీటర్లు ఏర్పాటు చేశారు. మిగిలిన కేంద్రాల్లో త్వరలోనే పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు నేటి ప్రకటనలో తెలిపారు.
HYD: సర్పంచ్ ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సర్పంచులకు సరికొత్త కానుకగా గ్రామీణ అభివృద్ధికి నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మాట్లాడుతూ.. ఆయా గ్రామాలలో కలిపి మొత్తం రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. త్వరలో వార్డుల వారిగా అభివృద్ధి చేపడుతానని వెల్లడించారు.
SRCL: మంత్రి పొన్నం ప్రభాకర్‌ను సిరిసిల్ల మున్సిపాలిటీకి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్లు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మంత్రిని కలిసిన వారిలో ఆడెపు చంద్రకళ, బొద్దుల శ్రీనివాస్, వెంగళ లీల, కూరపాటి శ్రీశైలం, లింగంపల్లి గంగరాజు ఉన్నారు. ఈ సందర్భంగా వారిని మంత్రి అభినందించారు.
WGL: పట్టణ కేంద్రంలోని ఎనుమాముల మార్కెట్ 2 రోజుల విరామం అనంతరం సోమవారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మార్కెట్లో సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ. 7,545 పలికింది. అలాగే 341 రకం మిర్చి క్వింటాకు రూ. 22,100 ధర పలకగా.. వండర్ హాట్(WH) మిర్చి రూ. 37,000పలికింది. తేజ మిర్చి ధర రూ. 18,300 కి చేరింది. మార్కెట్లో క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
NLG: సెకండ్ ఎడిషన్ సీఎం కప్ జిల్లా స్థాయిలో నిర్వహించిన వివిధ రకాల ఆటలలో దేవరకొండలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు వివిధ ఆటలలో విజయాన్ని సాధించారు. అనంతరం తదుపరి ఆటలకు ఎన్నికైనట్లు ప్రిన్సిపల్ ఎం.హరిప్రియ సోమవారం తెలిపారు. అథ్లెటిక్స్, సాఫ్ట్ బాల్, జూనియర్ యోగ, యోగ పోటీల్లో పాల్గొని బంగారు, వెండి పథకాలు సాధించినట్లు పేర్కొన్నారు.