• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

నూతన విద్యుత్ దీపాలు ఏర్పాటు

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో కౌన్సిలర్ దిలీప్ కాలనీలో నూతన వీధి దీపాలను ఏర్పాటు చేయించారు. గత కొన్ని రోజులుగా ప్రజలు వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో స్పందించిన కౌన్సిలర్ వీధిదీపాలను ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వార్డులో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, మౌలిక సదుపాయాల రూపకల్పనకు తన వంతు కృషి చేస్తానన్నారు.

February 22, 2026 / 10:21 AM IST

ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు

JGL: పెగడపల్లి మండల కేంద్రంలోని టీఎస్ మోడల్ స్కూల్, కాలేజీలో, ఈనెల 25 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పెగడపల్లి మోడల్ స్కూల్లో ప్రభుత్వం మొదటిసారిగా ఇంటర్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి మార్చి 13 వరకు ఇంటర్మీడియట్ రెగ్యులర్ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు.

February 22, 2026 / 10:20 AM IST

ఆలయానికి రూ.4,09,519 ఆదాయం

SDPT: హుస్నాబాద్ మండలం పందిళ్ల గ్రామంలోని మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 15న నిర్వహించిన మహాశివరాత్రి ఉత్సవాల ద్వారా రూ.4,09,519 ఆదాయం లభించినట్లు సర్పంచ్ తోడేటి రమేశ్ తెలిపారు. ఉత్సవాల అనంతరం ఆలయ ఆవరణలో గ్రామ పెద్దల సమక్షంలో ఆదాయం, వ్యయాలు, మిగులు వివరాలను వెల్లడించారు. ఉత్సవంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం విశేషంగా ఉందన్నారు.

February 22, 2026 / 10:20 AM IST

‘పోలీస్ క్రీడల్లో జిల్లా మహిళా కానిస్టేబుల్‌కు పథకాలు’

ADB: తెలంగాణ రాష్ట్ర పోలీసు గేమ్స్ స్పోర్ట్స్ మీట్‌లో జిల్లాకు సంబంధించిన మహిళా కానిస్టేబుళ్లు అద్భుత ప్రదర్శన ప్రదర్శించి 400, 800 మీ. పరుగులో పూజ, యోగ కానిస్టేబుల్‌లు స్వర్ణ పథకాలు సాధించారు. 70 కిలోల క్యాటగిరిలో వెయిట్ లిఫ్టింగ్‌లో రూప్ సింగ్ కాంస్య పతకం పొందారు. జిల్లాకు పథకాలు రావడం పట్ల SP అఖిల్ మహాజన్ వారిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.

February 22, 2026 / 10:20 AM IST

జిన్నారంలో స్వచ్ఛందంగా మూతపడ్డ మాంసం దుకాణాలు

SRD: జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ఆదివారం మాంసం దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. జీవన జ్యోతిర్లింగా శివాలయ ఉత్సవాల సందర్భంగా గ్రామ పెద్దల సూచన మేరకు భక్తులు మాంసాహారం వర్జిస్తూ నియమ నిష్టలు పాటిస్తున్నారు. దుకాణదారులు కూడా భక్తి భావంతో సహకరించారు. దేవాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.

February 22, 2026 / 10:19 AM IST

సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి భూమి పూజ

SRCL: తంగళ్ళపల్లి మండలం కస్బెకట్కూర్ గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణానికి ఆదివారం భూమి పూజ నిర్వహించారు. బహుజన వీరుడు పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి గ్రామంలో ఆయన విగ్రహాలు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేతలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు పొన్నం తిరుపతి గౌడ్‌తో పాటు, సభ్యులు పాల్గొన్నారు.

February 22, 2026 / 10:18 AM IST

అసభ్యంగా ప్రవర్తించిన సిహెచ్ పై కేసు నమోదు

ఖమ్మం జిల్లా ఎదులాపురంలో ఇందిరమ్మ ఇళ్ల జియో ట్యాగింగ్ కోసం వచ్చిన గృహ నిర్మాణ శాఖ ఏఈ బొమ్మకంటి లావణ్యతో అసభ్యంగా ప్రవర్తించిన సిహెచ్ భాస్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. విధుల్లో ఉన్న ఏఈని దూషించి, చేయి చేసుకున్నట్లు బాధితురాలి ఫిర్యాదు మేరకు చర్యలు తీసుకున్నట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.

February 22, 2026 / 10:17 AM IST

కలెక్టర్‌కు ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ ఆహ్వానం

జనగామ మండలం ఎల్లంల గ్రామంలో నిర్వహించనున్న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌ను కమిటీ సభ్యులు నేడు ఆహ్వానించారు. ఈ నెల 23న ఉదయం 9:30 గంటలకు గ్రామంలో విగ్రహావిష్కరణ మహోత్సవం జరగనుందని కమిటీ ప్రతినిధులు వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో ఛత్రపతి శివాజీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

February 22, 2026 / 10:16 AM IST

‘ఎమ్మెల్యే సహకారంతో డివిజన్ అభివృద్దికి కృషి’

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ 42వ డివిజన్ అభివృద్దికి కట్టుబడి ఉంటానని కార్పొరేటర్ చిందం సత్యవతి శ్రీనివాస్ అన్నారు. డివిజన్ పరిధిలోని గౌతమేశ్వర కాలనీలో అధ్యక్షుడు లక్కాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నాయకత్వంలో సమగ్ర ప్రణాళికతో మున్సిపల్ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.

February 22, 2026 / 10:13 AM IST

భార్యపై హత్యాయత్నం.. భర్త అరెస్ట్

PDPL: జిల్లాలో విడాకుల కేసు విచారణకు వచ్చిన నూనె పద్మపై ఆమె భర్త వెంకటేశ్ హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెయింటెనెన్స్ కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించి, ఆమె ఒప్పుకోకపోవడంతో జాఫర్ ఖాన్ పేట శివారుకు తీసుకెళ్లి తలపై రాయితో కొట్టి గాయపరిచాడు. అపస్మారక స్థితిలో పడి ఉన్న పద్మను కుటుంబ సభ్యులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

February 22, 2026 / 10:09 AM IST

ప్రతి సోమవారం యధావిధిగా ప్రజావాణి: కలెక్టర్

VKB: ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి ఇకనుంచి యధావిధిగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి గత కొన్ని వారాలుగా మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున నిలిపివేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.

February 22, 2026 / 10:08 AM IST

లైన్ క్లియర్ కోసం విద్యుత్ అంతరాయం

GDWL: శాంతినగర్‌-2 33 కేవీ ఫీడర్ కింద తాకే చెట్ల కొమ్మలను తొలగించడానికి, 33/11 కేవీ రాజోలి సబ్ స్టేషన్లో మెయింటెనెన్స్‌కి లైన్ క్లియర్ (LC) తీసుకుంటామని ఏఈ హరి శనివారం ప్రకటించారు. రాజోలి, తూర్పు, పడమటి గార్లపాడు, తుమ్మలపల్లి గ్రామాలకు ఆదివారం మధ్యహ్నం ఒంటి గంట నుంచి సాయత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

February 22, 2026 / 10:08 AM IST

కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక పై ఉత్కంఠ

BHPL: మున్సిపాలిటీ ఎన్నికలు ముగియడంతో కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక పై అందరి దృష్టి సారించారు. 30 వార్డులున్న మున్సిపాలిటీలో నలుగురు కో-ఆప్షన్ సభ్యులకు అవకాశం దక్కనుంది. నిబంధనల ప్రకారం ఇద్దరు మైనారిటీలకు, ఒకరు మాజీ కౌన్సిలరుకు కేటాయించాలి. ఇందులో ఒక స్థానం మహిళకు రిజర్వ్ అవుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ పదవులకు తీవ్ర పోటీ నెలకొంది.

February 22, 2026 / 10:04 AM IST

స్వర్ణోత్సవాలకు కేయూ సిద్ధం..!

వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయాన్ని 1976లో స్థాపించారు. 50వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా స్వర్ణోత్సవాలకు సిద్ధమవుతోంది. ఉన్నత విద్యను అందిస్తూ NAAC నుంచి A+ గ్రేడ్ గుర్తింపు పొందింది. 27 విభాగాలు, అనేక అనుబంధ కళాశాలలతో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్ట్స్, సైన్స్‌లో సుమారు 95+ కోర్సులను అందిస్తోంది.UG, PG, Ph.Dతో పాటు దూరవిద్య కోర్సులు అందిస్తుంది.

February 22, 2026 / 10:02 AM IST

సీఎం రేవంత్ రెడ్డి పర్యటన వివరాలు ఇలా..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇవాళ CM రేవంత్ రెడ్డి పర్యటించనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన పర్యటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యహ్నం 1:30 గం HYD నుంచి MHBD జిల్లాకు రానున్నారు. మ. 2:15 గంగారం మండలం రెడ్యాల గ్రామానికి వెళ్తారు. 3 గం ములుగు జిల్లాకు రానున్నారు. 3:30 దేవాదాల ప్రాజెక్టును పరిశీలించి అక్కడ అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయత్రం 5 గంటలకు HYDకి తిరిగి వెళ్తారు.

February 22, 2026 / 10:00 AM IST