• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘కార్మికుల సమస్యలను పరిష్కరించాలి’

ADB: భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాజు శుక్రవారం ఆదిలాబాద్‌లోని సంఘం కార్యాలయంలో మాట్లాడుతూ.. నిర్మాణ రంగంలో పనిచేసే లేబర్ వెల్ఫేర్ బోర్డును ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని ఆరోపించారు. భవన నిర్మాణ రంగంలో పనిచేసే కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నట్లు తెలిపారు.

February 20, 2026 / 03:01 PM IST

‘తొలి తీర్మానంలోనే చౌరస్తా విస్తరణ పనులు చేపట్టాలి’

RR: షాద్‌నగర్‌లోని ప్రధాన చౌరస్తా విస్తరణ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కోరుతూ సామాజిక కార్యకర్త రాజు నూతన మున్సిపల్ చైర్మన్‌కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కౌన్సిల్‌లో ప్రవేశపెట్టే తొలి తీర్మానంలోనే చౌరస్తా విస్తరణ అంశాన్ని చేర్చాలన్నారు.

February 20, 2026 / 03:00 PM IST

‘గ్రంథాలయాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి’

BDK: ప్రాజెక్టు అధికారి టేకులపల్లిలో గ్రంథాలయ భవనాన్ని కట్టిస్తామని పీవో రాహుల్ చెప్పారు. టేకులపల్లి శాఖ గ్రంథాలయాన్ని శుక్రవారం భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రాహుల్, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పసుపులేటి వీరబాబు సందర్శించారు. స్థానిక గ్రంథాలయాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వారితో గ్రంథ పాలకుడు నాగన్న పాల్గొన్నారు.

February 20, 2026 / 03:00 PM IST

‘ముదిరాజ్ బిడ్డకు అన్యాయం చేశారు’

NRPT: మద్దూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ పదవి ఇస్తామని ముదిరాజ్ బిడ్డకు అన్యాయం చేశారని దౌల్తాబాద్ మాజీ జడ్పీటీసీ మైపాల్ మండిపడ్డారు. గోవిందుకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అడిగినందుకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి ముదిరాజ్ బిడ్డలపై లాఠీ ఛార్జ్ చేయించడం తగదని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు.

February 20, 2026 / 02:58 PM IST

‘ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం’

NGKL: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని MLA రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్‌‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డులో ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ తీగల సునేంద్ర, వైస్ ఛైర్మన్ బదం రమేష్ పాల్గొన్నారు.

February 20, 2026 / 02:56 PM IST

తెలంగాణ ఉద్యమంలో పొన్నం కీలక పాత్ర

SDPT: తెలంగాణ ఉద్యమంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ క్రియా శ్రీలంక పాత్ర పోషించారు. 2009-2014 మధ్య కరీంనగర్ ఎంపీగా పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వాదించారు. ‘సకల జనుల సమ్మె’, మిలియన్ మార్చ్‌లో పాల్గొంటూ, పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారుడుగా నిలిచారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడుతున్నప్పుడు గాయపడ్డారు.

February 20, 2026 / 02:56 PM IST

‘తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేయాలి’

MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో తెలంగాణ ఉద్యమాకారుల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన ఘనత ఉద్యమకారులదన్నారు. గుర్తింపు కార్డులు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు, 25 లక్షల ఎక్స్‌గ్రేషియా తదితర హామీలు అమలు చేయాలన్నారు.

February 20, 2026 / 02:52 PM IST

‘మధిర పట్టణాన్ని ప్రగతి వైపు నడిపిస్తాం’

KMM: మధిర ప్రజలకు కావాల్సిన వైద్యం, రహదారులు, విద్యుత్, మంచినీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి మధిర పట్టణాన్ని ప్రగతివైపు పరుగులు పెట్టిస్తానని మధిర మున్సిపల్ ఛైర్మన్ సామినేని సుజాత రామనాథం అన్నారు. 3 వార్డు కౌన్సిలర్ బెజ్జం రాజు శుక్రవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ సామినేని సుజాతని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.

February 20, 2026 / 02:47 PM IST

నిజామాబాద్ చేరుకున్న మంత్రి పొన్నం, మహేశ్ కుమార్ గౌడ్

NZB: నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. శుక్రవారం హెలికాప్టర్ ద్వారా గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానానికి చేరుకున్న వారికి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు పాల్గొని నేతలకు పుష్పగుచ్ఛాలు అందజేశారు.

February 20, 2026 / 02:47 PM IST

గట్టుప్పల్‌లో బెల్ట్ షాపులపై కఠిన చర్యలు

NLG: గట్టుప్పల్ మండలంలో బెల్ట్ షాపులు, నాటు సారా విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సంజీవరెడ్డి హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు రూ.5 లక్షల వరకు బైండోవర్ చర్యలు ఉంటాయని తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.

February 20, 2026 / 02:42 PM IST

వాగులో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

MHBD: తొర్రూరు మండలంలోని జమస్తాన్ పురం శివారు సుందర్ నాయక్ తండాకు చెందిన నేతావత్ రవి అనే వ్యక్తి నిన్న పాడి గేదెలకు నీళ్లు తాగించేందుకు ఆకేరు వాగు వద్దకు తోలుకెళ్లగా, ప్రమాదవశాత్తు అదే వాగు గుంతలో పడి గల్లంతైన విషయం తెలిసిందే. వారి మృతదేహం శుక్రవారం లభ్యం కాగా, మృతదేహన్ని బయటకు తీసి పోస్టుమార్టంకు తరలించారు.

February 20, 2026 / 02:40 PM IST

వనపర్తి పురపాలక పీఠంపై మాధవి బాధ్యతల స్వీకరణ

WNP: వనపర్తి మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా మిడిదొడ్డి మాధవి శుక్రవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఛైర్‌పర్సన్ పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం వైస్ ఛైర్మన్ మధుసూదన్ గౌడ్‌ను శాలువాతో సత్కరించారు. మున్సిపల్ కమిషనర్, నూతన కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్య కర్తలు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:38 PM IST

తెలంగాణలో కుల మతాలకతీతంగా పండుగలు

SRPT: తెలంగాణలో కుల మతాలకతీతంగా పండుగలు నిర్వహించడం ఆనవాయితీ అని మున్సిపల్ వైస్ ఛైర్మన్ షఫీ ఉల్లా తెలిపారు. శుక్రవారం సూర్యాపేటలోని శ్రీసంతోషిమాత దేవాలయంలో అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి మాట్లాడారు. శ్రీ సంతోషిమాత దేవాలయం కమిటీ సభ్యులు ప్రతి ఏటా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించడం అభినందనీయమన్నారు.

February 20, 2026 / 02:37 PM IST

ఆలయ నిర్మాణానికి భూమి పూజ

SRCL: చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో హనుమాన్ ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు శుక్రవారం భూమి పూజా చేశారు. గ్రామంలోని అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో, దాతల సహకారంతో ఆలయ నిర్మాణ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పోతరాజు భారతి నగేష్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామంలోని కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

February 20, 2026 / 02:36 PM IST

ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపిన పాలకవర్గం

RR: షాద్‌నగర్ మున్సిపల్ కొత్త పాలకవర్గం కొలువుతీరిన వేళ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు నూతన పాలకవర్గం శాలువతో సత్కరించి పూల బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే ఎల్లప్పుడూ వెంట ఉండి ముందుకు నడిపించడంతో ఈ విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కౌన్సిలర్లు, పాలక వర్గ సభ్యులు బాధ్యతలు చేపట్టడంతో అక్కడ ఆనందం వెళ్లి విరిసింది.

February 20, 2026 / 02:36 PM IST