Breaking News : తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రలో కలకలం రేగింది. హనుమకొండలో యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు.
తెలంగాణలో (Telangana) మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. ఇటీవలు కేంద్ర ఎన్నికల సంఘం ఎమ్మెల్సీ ( MLC) ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎన్నికల జరగనుంది. వీటిలో ఒకటి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక కాగా.. మరొకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక.
తెలంగాణ ప్రభుత్వం క్రీడాకారు (Sportsmen)లకు పెద్ద పీట వేస్తోంది. ఇటీవల భారత షూటర్ ఇషాసింగ్ (Esha Singh) కు కూడా స్థలం పత్రాలను ఇచ్చారు. గతంలోనూ సానియా మీర్జా, పీవీ సింధు తదితరులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నగదు బహుమతితో పాటు ఉద్యోగాలను ప్రకటించింది. ఒలింపిక్స్ లో తెలంగాణ క్రీడాకారులు సత్తా చాటేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఈ మేరకు క్రీడాకారులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నది.
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర సందర్భంగా వరంగల్ జిల్లాలో తీవ్ర ఘర్షణ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ యాత్రలో యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తోట పవన్ పైన దాడి జరిగింది.
హైదరాబాద్ (Hyderabad) నుంచి పొరుగు రాష్ట్రలకు వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ (TSRTC) శుభవార్త చెప్పింది. ప్రైవేటుకు దీటుగా అత్యాధునిక హంగులతో ఆర్టీసీ కొత్తగా 16 ఏసీ స్లీపర్ (AC sleeper) బస్సులను తీసుకురానున్నది. మార్చి నెలలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.
కాంగ్రెస్ పార్టీ నేతలం అందరం కలిసే ఉన్నామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి అన్నారు.
యువతలో క్రీడా స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా వారిని అంతర్జాతీయ క్రీడాపోటీల్లో సత్తాచాటేలో తీర్చిదిద్ధడమే ధ్యేయంగా.. ప్రధాని మోదీ పిలుపుతో నిజాం కాలేజీ (Nizam College) గ్రౌండ్ లో “ఖేలో తెలంగాణ జీతో తెలంగాణ” స్పోర్ట్స్ ఫెస్టివల్ (Sports Festival)నిర్వహించారు.
పెట్టుబడుల ప్రకటన మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అయితే ఈ ట్వీట్ పై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భిన్నంగా స్పందించారు. ‘తెలంగాణలో ఉన్న సంస్థలు తమ కార్యకలాపాలు విస్తరిస్తుండడం.. కొత్త పెట్టుబడులు రావడం జరుగుతుంటే పక్క రాష్ట్రంలో మాత్రం ఉన్న సంస్థలు మూతపడుతున్నాయి.. కొత్త సంస్థలు రావడం లేదు’ అని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఏపీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ గుడ్డు చుట్టూ తిరు...
ప్రజా సమస్యలపైనే తన పోరాటం అంటున్న ప్రముఖ నేత ఇందిరా శోభన్ స్పెషల్ ఇంటర్య్వూ మీకోసం
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అధికారులు దూకుడు పెంచారనే చెప్పవచ్చు. దర్యాప్తును వేగవంతం చేస్తూ క్రమంగా పలువురిని అరెస్ట్ చేసి ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అరెస్టైన ఏపీ వైఎస్సార్ సీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ రెడ్డిని తీహార్ జైలుకు తీసుకెళ్లారు. రాఘవకు విధించిన కస్టడీ గడువు ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
మంచి బాడీ షేప్స్, కండలు తిరిగిన మజిల్స్, సిక్స్ ప్యాక్ కోసం యువకులు ఎక్కువగా జిమ్ సప్లిమెంట్లను వాడుతూ ఉంటారు. అయితే వీటి వాడకం విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఇటీవల ఢిల్లీలో ఓ 22 ఏళ్ల యువకుడు దీర్ఘకాలంగా జిమ్ సప్లిమెంట్స్ వాడుతూ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఆస్పత్రిలో వెంటిలేటర్ పై చికిత్స చేయించుకున్నాడు.
bandla ganesh:నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ ఇటీవల కాంట్రవర్సీ పోస్టులు చేస్తున్నారు. పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ గురించి ఇష్యూ అయిన సంగతి తెలిసిందే. తారకరత్న చనిపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పక్క పక్కనే కూర్చొన్నారు. ఆ ఫోటోను ట్వీట్ చేసి కామెంట్ చేశారు.
school holidays in telangana:తెలంగాణ రాష్ట్రంలో అప్పుడే ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఉదయం, సాయంత్రం చలి ఉన్నా.. ఉక్కపోత ఎక్కువే ఉంది. పిల్లలకు ఒంటి పూట బడులపై విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15వ తేదీ నుంచి హాఫ్ డే స్కూల్ ఉంటుందని ప్రకటన చేశారు. ఏప్రిల్ 23 నుంచి స్కూళ్లకు సెలవులను ప్రకటించారు.
హైదరాబాద్(Hyderabad) లో వేసవి తాపం ప్రారంభమైంది. ఫిబ్రవరిలోనే ఎండలు దంచికొడుతున్నాయి. ఈ వారం ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో మోటార్లకు మీటర్లు పెడతాం లోన్ కావాలని తెలంగాణ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసిందన్నారు. ఈ అంశంపై చర్చకు సిద్ధమా అంటూ కేసీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. మరోవైపు సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం వాటా ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలా ప్రైవేటు పరం చేస్తుందని నిలదీశారు.