• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

‘టికెట్ ఇస్తే పార్టీని మోసం చేశాడు’

ASF: నమ్మి కౌన్సిలర్ టికెట్ ఇస్తే పార్టీని మోసం చేసిన ఘనత మాజీ యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌దని స్థానిక నాయకులు ఆరోపించారు. శుక్రవారం ఆసిఫాబాద్‌లో మాట్లాడుతూ.. జిల్లాలో యూత్ కాంగ్రెస్‌లో ఇచ్చిన ఏకైక టికెట్ శ్యామ్ వాళ్ళ భార్యకే అన్నారు. వారిని గెలిపించేందుకు తాము తీవ్రంగా కష్టపడినట్లు తెలిపారు. మరోసారి పార్టీ పైన తప్పుడు ఆరోపణ చేస్తే సహించేది లేదన్నారు.

February 20, 2026 / 04:02 PM IST

యువత స్వయంకృషితో ఎదగాలి: ఎస్సై

NLG: యువత స్వయంకృషితో ఎదగాలని చిట్యాల ఎస్సై రవి కుమార్ అన్నారు. చిట్యాల మండలం, పెద్దకాపర్తిలో ఏర్పాటు చేసిన బెల్లం చాయ్ షాప్‌ను శుక్రవారం ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని యువకులు ఆర్థికంగా ఎదగడం కోసం వ్యాపారాలను ఎంచుకోవాలని సూచించారు. నిర్వాహకులను ఎస్సై అభినందించారు.

February 20, 2026 / 04:01 PM IST

సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి: MLA

WGL: వర్ధన్నపేట నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. ఆకేరు వాగుపై చెక్ డాం పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. రైతుల సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తూ ముందుకు వెళుతుందని, నియోజకవర్గంలోని పంటల సాగుకు నీటిని అందించేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు.

February 20, 2026 / 04:01 PM IST

చేగుంటలో ఏఎంసీ తొలి సమావేశం

MDK: చేగుంట ఏఎంసీ పాలకవర్గ తొలి సమావేశం ఛైర్మన్ తాడేం వెంగల్ రావు అధ్యక్షతన నిర్వహించారు. రైతులకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు. సెక్రటరీ ఉష, సర్పంచ్ సండ్రుగు స్రవంతి సతీష్, కమిటీ డైరెక్టర్లు కుర్మ లక్ష్మి, మొహమ్మద్ ముజామిల్, స్టాలిన్ నర్సిములు, ఆంజనేయులు, కాషబోయిన శ్రీనివాస్, బాల్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

February 20, 2026 / 03:56 PM IST

’22 నుంచి సిటీ పోలీస్ యాక్ట్’

సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 22 నుంచి మార్చి 9 వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని CP రష్మీ పెరుమాళ్ తెలిపారు. కమిషనరేట్ పరిధిలో ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు నిర్వహించకూడదన్నారు. పైన పేర్కొన్న కార్యక్రమాల నిర్వహణకు ముందుగా సీపీ అనుమతి తీసుకోవాలని సూచించారు. బంద్‌ల పేరిట కారణాలు చెబుతూ సంస్థలు, కార్యాలయాలు మూసివేయాలని చూస్తే చర్యలు తప్పవన్నారు.

February 20, 2026 / 03:56 PM IST

పోలీస్ విభాగానికి చేరిన ట్రెయిన్డ్ జాగిలం ‘ఆర్య’

GDWL: ఎనిమిది నెలల బేసిక్ శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగిలం ‘ఆర్య’ను జిల్లాకు కేటాయించారు. ఐఐటీఏ మొయినాబాద్‌లో శిక్షణ పొందిన ‘ఆర్య’ పేలుడు పదార్థాలను గుర్తించడంలో నైపుణ్యం సాధించిందని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం డాగ్ హ్యాండ్లర్ భీమేష్, డాగ్ స్క్వాడ్ ఎస్పీకి ఆర్యను పరిచయం చేశారు.

February 20, 2026 / 03:55 PM IST

బాదేపల్లి మార్కెట్‌లో వేరుశనగ ధరల మార్పు

MBNR: జడ్చర్ల మండల కేంద్రంలోని బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌కు శుక్రవారం 2,082 క్వింటాళ్ల వేరుశనగ చేరింది. ఈ సందర్భంగా గరిష్ట ధర క్వింటాకు రూ.10,269గా నమోదైంది. కనిష్ట ధర రూ.4,500 కాగా, సాధారణ ధర రూ.9,169గా ఉంది. గతంలో క్వింటాకు రూ.12,000కు పైగా ధర పలికిన సందర్భాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

February 20, 2026 / 03:55 PM IST

జీవన్ రెడ్డికి అభిమానం జరగకుండా చూడాలి: జగ్గారెడ్డి

SRD: మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డికి కాంగ్రెస్‌లో అవమానం జరగకుండా ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం కోరారు. పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఆఫర్లు వచ్చిన బయటకు వెళ్లలేదని గుర్తు చేశారు.

February 20, 2026 / 03:51 PM IST

దుప్పల్లి గ్రామ వాసికి రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కు

MBNR: చిన్నచింతకుంట మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మన్న కుమారుడికి మంజూరైన రూ.లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (GMR) అందజేశారు. శుక్రవారం గ్రామ సర్పంచ్, నాయకుల సమక్షంలో ఈ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

February 20, 2026 / 03:49 PM IST

పాఠశాలలో ‘సామాజిక న్యాయ దినోత్సవం’

NLG: చిట్యాలలోని ఒక ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం ‘సామాజిక న్యాయ దినోత్సవం’ జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ‘మాక్ కోర్టు’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు న్యాయమూర్తులు, లాయర్ల పాత్రల్లో అభినయించి, న్యాయ ప్రక్రియపై అవగాహన కల్పించేలా మెప్పించారు. ప్రజా ప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.

February 20, 2026 / 03:46 PM IST

తప్పిపోయిన బాలుడికి సర్పంచ్ ఆసరా

WNP: హైదరాబాద్ నుంచి రైలులో ప్రయాణిస్తున్న క్రమంలో కరీంనగర్‌కు చెందిన గణేష్ అనే బాలుడు తప్పిపోయి మదనాపురం మండలం బౌసింగ్ తండా వాసుల వెంట వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్ సీతారాం నాయక్ తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. బాలుడి వివరాలు సేకరించిన అనంతరం పోలీసుల సహకారంతో సురక్షితంగా సఖీ కేంద్రానికి తరలించారు.

February 20, 2026 / 03:44 PM IST

టేబుల్ బుక్‌ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క

MLG: ప్రజా భవన్లో “Goddess of Folk–Sammakka Saralamma Jatara” కాఫీ టేబుల్ బుక్‌ను మంత్రి సీతక్క నేడు ఆవిష్కరించారు. బుక్‌ను రూపొందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. జాతర అరుదైన ఫోటోలతో ఆకర్షణగా మేడారం కాఫీ టేబుల్ బుక్ ఉందని మంత్రి సీతక్క అన్నారు.

February 20, 2026 / 03:43 PM IST

ఉచిత కంటి వైద్య పరీక్షలు…!

NZB: పోతంగల్ మండలం గన్నారం, లింగాపూర్ గ్రామాల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ బీర్కూర్ ఆధ్వర్యంలో బోధన్ లయన్స్ క్లబ్ సహకారంతో శుక్రవారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. గ్రామంలో సుమారు 65 మందికి పరీక్షలు చేయగా, 14మందికి మోతెబిందు ఆపరేషన్ కొరకు బోధన్ లయన్స్ క్లబ్ ఆసుపత్రికి పంపించినట్లు వెల్లడించారు.

February 20, 2026 / 03:40 PM IST

ప్రజా ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి ధ్యేయం: ఎమ్మెల్యే

BDK: అశ్వరావుపేట మున్సిపాలిటీలో శుక్రవారం నూతన పాలకవర్గం అధికారికంగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జారే నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఇచ్చిన బాధ్యత ఎంతో ఉన్నతమైందని ప్రజల సమస్యలు పరిష్కరించడానికి ముందుండాలని ఎమ్మెల్యే సూచించారు. ప్రజా ప్రభుత్వ లక్ష్యం అభివృద్ధి ధ్యేయమన్నారు.

February 20, 2026 / 03:37 PM IST

కేంద్ర గ్రంథాలయాన్ని సదర్శించిన ప్రాజెక్టు అధికారి

భద్రాద్రి జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని భద్రాచలం ఐటీడీఏ పీవో రాహుల్ ఈరోజు సందర్శించారు. గ్రంథాలయ పరిసరాలు, పుస్తకాలు, అందుబాటులో ఉన్న వనరులు, పని వేళలు, సిబ్బంది పనితీరును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇంత మంచి గ్రంథాలయం మనకు అందుబాటులో ఉండటం అదృష్టకరమని, విద్యార్థుల భవిష్యత్తుకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు.

February 20, 2026 / 03:33 PM IST