పైన అసలైన నోట్లు ఉంచి మధ్యలో నకిలీ నోట్లను ఉంచి తిరుపతి సరఫరా చేస్తున్నాడు. లక్ష రూపాయల అసలు నోట్లకు రూ.3 లక్షల నకిలీ నోట్లను కట్టబెడుతున్నాడని విచారణలో తేలింది. మహారాష్ట్రకు చెందిన ఓ వ్యక్తితో తిరుపతి దొంగనోట్ల సరఫరా చేస్తున్నాడని గుర్తించారు.
మారుమూల గ్రామీణ ప్రాంతంలో నకిలీ నోట్లు (Fake Currency Notes) కలకలం సృష్టించాయి. వందలు కాదు వేలు కాదు ఏకంగా లక్షల విలువైన రూ.500 నోట్లు ప్రత్యక్షమయ్యాయి. ఓ వ్యక్తి నకిలీ నోట్లు తరలిస్తున్నారని గుర్తించి పోలీసులు (Telangana Police) చాకచక్యంగా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఏకంగా రూ.21 లక్షల 30 వేల విలువైన నోట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే అతడికి ఆ దొంగ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయనేది తెలియడం లేదు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా (Kumuram Bheem Asifabad District) వాంకిడికి (Wankidi) చెందిన తిరుపతి కొంతకాలంగా దొంగ నోట్లను సరఫరా చేస్తున్నాడు. గుట్టుగా ఈ వ్యవహారం నడిపిస్తున్న అతడిపై పోలీసుల కన్ను పడింది. అతడిపై నిఘా ఉంచి సోమవారం పోలీసులు దాడి చేశారు. అతడి ఇంట్లో తనిఖీలు చేపట్టగా రెడ్ హ్యాండెడ్ గా తిరుపతి పట్టుబడ్డాడు. నకిలీ నోట్లను తరలించేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు ప్రవేశించారు. పైన అసలైన నోట్లు ఉంచి మధ్యలో నకిలీ నోట్లను ఉంచి తిరుపతి సరఫరా చేస్తున్నాడు. లక్ష రూపాయల అసలు నోట్లకు రూ.3 లక్షల నకిలీ నోట్లను కట్టబెడుతున్నాడని విచారణలో తేలింది.
మహారాష్ట్రకు (Maharashtra) చెందిన ఓ వ్యక్తితో తిరుపతి దొంగనోట్ల (Counterfeit Currency) సరఫరా చేస్తున్నాడని గుర్తించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఆ మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఎవరో అని పోలీసులు ఆరా తీస్తున్నారు. అతడి వెనుక పెద్ద ముఠా ఉందా? లేదా విలాసాలకు అలవాటు పడి ఇలాంటి వాటికి పాల్పడుతున్నాడనేది పోలీసులు విచారణ చేపడుతున్నారు. ప్రస్తుతానికి అతడి నుంచి రూ.21 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా టాస్క్ ఫోర్స్ సీఐ సుధాకర్, ఎస్ఐ సందీప్ కుమార్ తెలిపారు. త్వరలోనే అతడి వెనుక ఎవరు ఉన్నదనేది తెలుసుకుంటామని చెప్పారు.