»The Curious Case Of Fake Currency Notes From The Children Bank Of India
fake currency : ‘చిల్ట్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో నకిలీ కరెన్సీ!
ఎన్నికల వేళ పేక్ కరెన్సీని మార్పిడి చేసేందుకు ఇద్దరు వ్యక్తులు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని పట్టుకుని అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
fake currency notes : నకిలీ కరెన్సీ నోట్లను చలామణీ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరు వ్యక్తుల్ని పోలీసులు అరెస్టు చేశారు. చిల్ట్రన్స్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో ఉన్న 6.62 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను వారి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎస్వోటీ, మైలార్దేవుపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన గంగరాజు స్టాక్ బ్రోకరేజీ వ్యాపారం చేసి నష్టపోయాడు. దీంతో నకిలీ కరెన్సీ(fake currency) నోట్లతో సులువుగా డబ్బులు సంపాదించాలని అనుకున్నాడు. మిత్రుడు అభినందన్‌తో కలిసి రెండు నెలల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ పవార్, సురేష్ పవార్లో వీడియోకాల్‌లో మాట్లాడాడు. వారిద్దరూ ఫేస్బుక్లో నకిలీ కరెన్సీ గురించి వీడియో పోస్ట్ చేశారు. వెయ్యికి ఐదు వేల చొప్పున నకిలీ కరెన్సీ ఇస్తామని వారు చెప్పారు.
దీంతో గంగరాజు, అభినందన్లు మహారాష్ట్ర వెళ్లారు. వారికి 3.5 లక్షల నగదు ఇచ్చి రూ.17 లక్షల నకిలీ కరెన్సీ నోట్లను తీసుకుని హైదరాబాద్ వచ్చారు. శుక్రవారం మల్కాజ్‌గిరిలోని సాయిరామ్ థియేటర్ దగ్గర ఓ బైక్‌ని అద్దెకు తీసుకున్నారు. మైలార్ దేవుపల్లి మెహఫిల్ హోటల్‌కి చేరుకున్నారు. అక్కడి నుంచి నకిలీ నోట్లను చలామణీ చేయడానికి ప్రయత్నించారు. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు శంషాబాద్ ఎస్వోటీ, మైలార్ దేవుపల్లి పోలీసులు కలిసి నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నకిలీ నోట్లపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బదులుగా చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Children Bank of India) అని ఉందని పోలీసులు తెలిపారు.