»Mulugu Zp Chairmans Wife Saved Him From Heart Attack By Performing Cpr
Mild stroke : ములుగు జడ్పీ చైర్మన్‌కు హార్ట్ స్ట్రోక్ .. సీపీఆర్ చేసి కాపాడిన భార్య
ములుగు జడ్పీ చైర్మన్,కుసుమ జగదీష్(Kusuma Jagdish) అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో ఇంట్లోనే కుప్పకూలిన జగదీశ్‌కు ఆయన భార్య రమాదేవి సిపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడారు .హనుమకొండ (Hanumakonda) లోని అజార ఆసుపత్రికి తరలించారు. జడ్పీ చైర్మన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు జగదీష్‌కు మైల్డ్ స్ట్రోక్ (Mild stroke) అని చెప్పారని ఆయన అనుచరులు తెలిపారు.
ములుగు జడ్పీ చైర్మన్,కుసుమ జగదీష్(Kusuma Jagdish) అస్వస్థతకు గురయ్యారు. ఛాతీలో నొప్పితో ఇంట్లోనే కుప్పకూలిన జగదీశ్‌కు ఆయన భార్య రమాదేవి సిపీఆర్ (CPR) చేసి ప్రాణాలు కాపాడారు .హనుమకొండ (Hanumakonda) లోని అజార ఆసుపత్రికి తరలించారు. జడ్పీ చైర్మన్‌కు చికిత్స అందిస్తున్న వైద్యులు జగదీష్‌కు మైల్డ్ స్ట్రోక్ (Mild stroke) అని చెప్పారని ఆయన అనుచరులు తెలిపారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కార్డియాక్ అరెస్ట్‌తో(Cardiac arrest) కుప్పకూలుతున్న వారికి జనాలు సకాలంలో సీపీఆర్(CPR) చేసి కాపాడుతున్నారు. హైదరాబాద్(Hyderabad) హయత్‌నగర్‌లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన ఓ వ్యక్తికి రామన్నపేట సీఐ మోతీరాం సీపీఆర్ చేసి కాపాడారు. సిద్దిపేట జిల్లా కుకునూర్ పల్లి వద్ద ఓ ఆటోడ్రైవర్ కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలిపోయాడు.
అటుగా వెళ్తున్న అంబులెన్స్‌ను స్థానికులు ఆపడంతో.. మెడికల్ టెక్నీషియన్లు (Medical technicians) మహేందర్‌రాజు, రమేశ్ సీపీఆర్ చేసి ఆటో డ్రైవర్‌ను కాపాడారు. తర్వాత అదే అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనల్లో సీపీఆర్ చేసిన వారిని అభినందిస్తూ మంత్రి హరీశ్‌రావు ట్వీట్(Minister Harish Rao tweet) కూడా చేశారు. రాష్ట్రంలో రోజూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో కార్డియాక్ అరెస్ట్ కేసులు బాగా పెరిగాయి. దీంతో సీపీఆర్ చేయడం ఎలాగో పోలీసులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు, ప్రైవేటు ఉద్యోగులకు ఆరోగ్య శాఖ ట్రైనింగ్ (Health Department Training) ఇప్పిస్తున్నది. కొంత మంది డాక్టర్లు సైతం స్కూళ్లు, కాలేజీల్లో క్యాంపులు పెట్టి స్టూడెంట్స్‌కు ట్రైనింగ్ ఇస్తూ.. ప్రజల ప్రాణాలు కాపాడడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.మన దేశంలో రోజూ సగటున 4 వేల మంది కార్డియాక్ అరెస్ట్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.
ఒక్క తెలంగాణ(Telangana)లోనే ఏటా 24 వేల మంది కార్డియాక్ అరెస్ట్‌తో కుప్పకూలుతున్నారు. సకాలంలో సీపీఆర్ చేస్తే ఇందులో కనీసం సగం మందిని కాపాడగలుగుతామని డాక్టర్లు చెబుతున్నారు. కానీ మన దేశంలో నూటికి పది శాతం మందికి కూడా సీపీఆర్ (CPR) మీద అవగాహన లేదు. దీంతో కార్డియాక్ అరెస్ట్ బారిన పడిన వారిలో 90 శాతం మంది స్పాట్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు.మన రాష్ట్రంలో లక్ష మందికి సీపీఆర్ ట్రైనింగ్ ఇచ్చే లక్ష్యంతో ఇటీవలే ఆరోగ్యశాఖ (Health Department) ఓ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తోంది. సీపీఆర్‌పై ఇంకా అవగాహన పెరగాలని, ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని డాక్టర్లు సూచిస్తున్నారు.