Monthly Maintenance Cost Of Telangana New Secretariat
New Secretariat:తెలంగాణలో కొత్త సచివాలయం (New Secretariat) ఏర్పాటు చేశారు. రూ. 1200 కోట్లతో కొత్త సచివాలయం నిర్మించగా.. దాని నిర్వహణ వ్యయం కూడా భారీగా అవుతుంది. 23 ఎకరాల ప్రాంగణంలో తెలంగాణ కొత్త సచివాలయాన్ని(New Secretariat) ప్రభుత్వం నిర్మించింది.. సచివాలయం 10.5 లక్షల చదరపు అడుగులలో విస్తరించి ఉంది. చదరపు అడుగుకు పది రూపాయల చొప్పున నెలకు నిర్వహణ ఖర్చు కోటి రూపాయలు (Crore rupees) కానుంది. ఆరు అంతస్తులు నిర్మించిన ఈ భవనంలో చివరి అంతస్తులో ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి తో పాటు ప్రభుత్వ ప్రధాన సలహాదారులు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జిఏడి కార్యాలయాలు ఆరో అంతస్తులో ఉన్నాయి.
సీఎం కార్యాలయం పక్కనే ముఖ్యమంత్రిని కలిసేందుకు వీలుగా ప్రజా దర్బార్ కోసం జనహిత హాల్ (Janahita hall) ఏర్పాటు చేశారు. ఇందులో ఒకేసారి 250 మంది (250 people) కూర్చునేలా ఏర్పాటు చేశారు. మంత్రి కేటీఆర్ (ktr) కోసం మూడో అంతస్తు కేటాయించారు. ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలను పర్యవేక్షిస్తున్న కేటీఆర్.. ఆదివారం కొత్త సచివాలయం ప్రారంభం అనంతరం తన కార్యాలయంలోకి ప్రవేశించారు.
కొత్త సచివాలయంలో (New Secretariat) ఏ ఏ చాంబర్లలో మంత్రులు కొలువు తీరుతారో ప్రభుత్వం జాబితా విడుదల చేసింది. గ్రౌండ్ ఫ్లోర్లో మంత్రులు చామకూర మల్లారెడ్డి (malla reddy), కొప్పుల ఈశ్వర్ (eshwar) కార్యాలయాలు ఉంటాయి. మొదటి అంతస్తులో హోం మంత్రి మహమ్మద్ అలీ (Mahamood ali), ఎర్రబెల్లి దయాకర్ రావు (dayakar rao), సబితా ఇంద్రారెడ్డికి (sabitha indra reddy) కార్యాలయాల కేటాయించారు.
రెండవ అంతస్తులో శ్రీనివాస్ యాదవ్ (srinivas yadav), జగదీష్ రెడ్డి (jagadish reddy), హరీష్ రావు (harish rao) కార్యాలయాలు, మూడవ అంతస్తులు నిరంజన్ రెడ్డి (niranjan reddy), తారక రామారావు (ktr), సత్యవతి రాథోడ్ (satyawathi rathode), నాలుగవ అంతస్థులో ఇంద్రకరణ్ రెడ్డి (indrakaran reddy), శ్రీనివాస్ గౌడ్ (srinivas goud), గంగుల కమలాకర్ (gangula kamalakar), 5 అంతస్తులో వేముల ప్రశాంత్ రెడ్డి (prashanth reddy), పువ్వాడ అజయ్ కుమార్ (ajay kumar) కార్యాలయాలు ఉంటాయి. సచివాలయం భద్రతను పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 300 సీసీ కెమెరాలతో 24 గంటల పాటు బాధ్యతను పర్యవేక్షించనుంది.