MLC Kavitha : మంత్రి కేటీఆర్ కుమారుడు, మేనల్లుడు హిమాన్షుపై ఎమ్మెల్సీ కవిత ప్రశంసల వర్షం కురిపించారు. హిమాన్షు ఇటీవల ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. కాగా..... హిమాన్షు పాట తనకు ఎంతో గర్వంగా ఉందని కవిత ఆనందం వ్యక్తం చేశారు. అదరగొట్టావ్ అల్లుడు అంటూ కవిత సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
మంత్రి కేటీఆర్ కుమారుడు, మేనల్లుడు హిమాన్షుపై ఎమ్మెల్సీ కవిత ప్రశంసల వర్షం కురిపించారు. హిమాన్షు ఇటీవల ఓ పాట పాడిన సంగతి తెలిసిందే. కాగా….. హిమాన్షు పాట తనకు ఎంతో గర్వంగా ఉందని కవిత ఆనందం వ్యక్తం చేశారు. అదరగొట్టావ్ అల్లుడు అంటూ కవిత సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
హిమాన్షు పాడిన పాటను ముందుగా… కేటీఆర్ షేర్ చేశారు. తన కొడుకు పాడిన పాట తనకు ఎంతో నచ్చిందంటూ ఆయన షేర్ చేయగా… దానికి కవిత రియాక్ట్ అయ్యారు.
అల్లుడూ.. నువ్వు సూపర్, అదరగొట్టేశావ్ అంటూ హిమాన్షుని మెచ్చుకున్నారు కవిత. తన మేనల్లుడు పాడిన పాట అదుర్స్ అంటూ ఆమె ట్వీట్ చేశారు. తన అల్లుడు కల్వకుంట్ల హిమాన్షు పాడిన పాట తనకు ఎంతో గర్వంగా ఉందన్నారు. గాడ్ బ్లెస్ యు అంటూ తన అల్లుడిని దీవించారు కవిత.
‘అల్లూడు నీ పాట బాగుంది. నిన్ను చూసి గర్వపడుతున్నా. నీ నుంచి ఇలాంటి అందమైన సంగీతం వినడానికి వేచి ఉన్నా’ అని ట్వీట్ చేశారు కవిత.‘గోల్డెన్ అవర్’ పాటను పాడింది అమెరికాకు చెందిన గాయకుడు, గేయ రచయిత జాకబ్ లాసన్. అదే సాంగ్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు రావు అద్భుతంగా ఆలపించాడు. ఈ ఇంగ్లిష్ సాంగ్ అలాపనలో హిమాన్షు ఆంగ్ల యాసను ఉచ్ఛరించిన తీరు ఆమోఘంగా ఉందంటున్నారు అంతా. అచ్చం జాకబ్ లాసన్‌ను తలపించేలా హిమాన్షు ఈ కవర్ సాంగ్ పాడాడని మెచ్చుకుంటున్నారు.