VSP: AU తెలుగు శాఖలో ప్రథమ సంవత్సరం విద్యార్థుల ఆహ్వాన వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. తెలుగు శాఖాధిపతి మానవతా విలువలు, గురువుల గొప్పతనం, శాఖ సాధించిన JRF-NET విజయాలను విద్యార్థులకు వివరించారు. స్టాటిస్టిక్స్ అధిపతి విద్య, జ్ఞాన సముపార్జన ప్రాధాన్యాన్ని చెప్పగా, ప్రిన్సిపాల్ నరసింహారావు తెలుగు భాష, సంప్రదాయాల పరిరక్షణను గూర్చి వివరించారు.