ATP: ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గ్రీవెన్స్ కార్యక్రమంలో పాల్గొని ప్రజలు, కార్యకర్తల నుంచి అర్జీలు స్వీకరించారు. ఐదేళ్ల వైసీపీ పాలన కక్షలు, కార్పణ్యాలతో సాగిందని, గ్రీవెన్స్‌లో అరాచకాలపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. టిడ్కో ఇళ్ల కోసం డబ్బులు చెల్లించిన బాధితులు ఆవేదన వ్యక్తం చేయగా, మార్చి చివరి నాటికి లబ్ధిదారులకు ఇళ్లు అప్పగిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.