»Mlc Kavitha Inspected The Nizamabad It Hub Building Complex
IT Hub : నిజామాబాద్ ఐటీ హబ్ భవన సముదాయాన్ని పరిశీలించిన ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను త్వరలో ప్రారంభించనున్నామని ఎమ్మెల్సీ కవిత (MLC KAVITHA) తెలిపారు. శనివారం ఐటీ హబ్(IT Hub) భవన సముదాయాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా,(MLA Ganesh Gupta) బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్టినేటర్ మహేశ్ గుప్తాతో కలిసి పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న పనులను, భవనంలో మౌలిక సదుపాయాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను త్వరలో ప్రారంభించనున్నామని ఎమ్మెల్సీ కవిత (Mlc kavitha) తెలిపారు. శనివారం ఐటీ హబ్(IT Hub) భవన సముదాయాన్ని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా,(MLA Ganesh Gupta) బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్టినేటర్ మహేశ్ గుప్తాతో కలిసి పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న పనులను, భవనంలో మౌలిక సదుపాయాల వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలని సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఐటీ హబ్ లను నిర్మిస్తున్నారని కవిత తెలిపారు.
నిజామాబాద్ లో ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ధ తీసుకున్న సీఎం కేసీఆర్(CM KCR), కేటీఆర్ (KTR)కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అతి త్వరలో కేటీఆర్ చేతుల మీదుగా ఐటీ హబ్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్‌కు రానున్నాయన్నారు. జిల్లాలో విమానాశ్రయ (Air port) ఏర్పాటు అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని కవిత తెలిపారు. తెలంగాణలో కలలు కన్న ప్రగతి సాధ్యమవుతుందని ఆమె అన్నారు.రూ. 50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఐటీ హబ్‌లో 750 మంది యువతకు, నాలుగు వేల మంది ఇతర ప్రాంతవాసులకు ఉద్యోగ, ఉపాధికి (employment) అవకాశం లభిస్తుందని తెలిపారు.‘ ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్ కు రానున్నాయి. ఇప్పటికే 200 పై చిలుకు సీట్లు ఒప్పందాలు పూర్తి అయ్యాయ’ ని అన్నారు. దేశ వ్యాప్తంగా ఐటీ ఎక్స్‌పోర్ట్‌లో రాష్ట్రం రెండవ స్థానం లో ఉందని కవిత తెలిపారు.