Station Ghanpur : ఎమ్మెల్సీ కడియం శ్రీహరి హాట్ కామెంట్స్
మాజీ మంత్రి కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. సీ ఎం కేసీఆర్ (CM KCR) అందరినీ కలుపుకుని ఆత్మీయ సమ్మేళనాలు (Spiritual Compounds) నిర్వహించాలని చెబితే.. స్థానిక నాయకత్వం తనను విస్మరించిందని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) నియోజకవర్గం (Constituency)లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థికి తాను సపోర్టు చేశానన్నారు.
మాజీ మంత్రి కడియం శ్రీహరి హాట్ కామెంట్స్ చేశారు. సీ ఎం కేసీఆర్ (CM KCR) అందరినీ కలుపుకుని ఆత్మీయ సమ్మేళనాలు (Spiritual Compounds) నిర్వహించాలని చెబితే.. స్థానిక నాయకత్వం తనను విస్మరించిందని ఆరోపించారు. స్టేషన్ ఘనపూర్ (Station Ghanpur) నియోజకవర్గం (Constituency)లో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ బీ ఫామ్ ఇచ్చిన అభ్యర్థికి తాను సపోర్టు చేశానన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy)కి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ సహకరించానన్నారు. కానీ ఇప్పుడు స్థానిక నాయకత్వం తనను విస్మరిస్తోందని కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక నాయకులతో చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలకు తనను పిలువట్లేదంటూ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యను ఉద్దేశించి కామెంట్ చేశారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గెలుపుకు కృషిచేశానని, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని మరీ ప్రచారం చేశానని.. అయినా తనను పార్టీ సమావేశాలకు పిలువకుండా పక్కన పెడుతున్నారని కడియం శ్రీహరి (Kadiam Srihari) అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా నిస్వార్థంగా పనిచేశానని.. ఆ విషయాన్ని ఇప్పటికే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy) స్పష్టం చేశాడని కడియం శ్రీహరి గుర్తు చేశారు. ఇకనైనా అందరిని కలుపుకుని పోవాలని, లేనట్లయితే పార్టీలో విభేదాలు వస్తాయని ఎమ్మెల్యేను ఉద్దేశించి కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు.